వచ్చే నెలలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు ఐఫోన్ ఆల్ట్రాను పరిచయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
iphone Ultra Launch
iphone Ultra Launch: ఆపిల్ అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఫోల్డబుల్ మార్కెట్లో తమ ఉనికిని చాటుకునేందుకు యాపిల్ సిద్ధమైంది. వచ్చే నెలలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు ఐఫోన్ ఆల్ట్రాను పరిచయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తొలి దశలో ఈ ఫోన్ కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత చైనా విపణికి విస్తరించే ఆలోచనలో కంపెనీ ఉంది.
తయారీ సవాళ్లు.. ధర ఊహాగానాలు
ఫోల్డబుల్ డివైజ్‌ల తయారీలో యాపిల్ కొన్ని సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది. జూన్ నెలలోనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. వచ్చే నెల ఈవెంట్లో ఈ ఫోన్‌ను ప్రదర్శించినప్పటికీ, ధర వివరాలను వెంటనే వెల్లడించకపోవచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కంటే దీని ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. మార్కెట్ రీసెర్చ్ నివేదికల ప్రకారం ఈ ఏడాదితో ఫోల్డబుల్ ఫోన్ల విక్రయాలు 30 శాతానికి పైగా పెరిగే అవకాశముంది.
కళ్లు చెదిరే డిస్ప్లే.. అధునాతన చిప్సెట్
ఐఫోన్ ఆల్ట్రా సాంకేతిక వివరాలు లీకై టెక్ ప్రపంచంలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోన్ లోపలి భాగంలో 7.58 ఇంచీల విశాలమైన డిస్ప్లే, వెలుపల 5.25 ఇంచీల ఔటర్ స్క్రీన్ ఉండనున్నాయి. యాపిల్ సొంతంగా తయారు చేసిన 2 నానోమీటర్ ప్రాసెస్ చిప్సెట్తో ఇది పనిచేస్తుంది. డిస్ప్లేపై మడత మార్కులు కనిపించకుండా ఉండేందుకు వీలుగా 3D ప్రింటెడ్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేక హింజ్ డిజైన్‌ను ఉపయోగిస్తున్నారు. డుయల్-లేయర్ UTG, UFG గ్లాస్ ప్రొటెక్షన్ ఈ ఫోన్‌కు అదనపు బలాన్ని ఇస్తాయి.
iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
ఐప్యాడ్ తరహా అనుభూతి.. భారీ బ్యాటరీ
ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను అన్ఫోల్డ్ చేసినప్పుడు దాని యూజర్ ఇంటర్ఫేస్ ఐప్యాడ్‌ను పోలి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది ఒక సరికొత్త డిజిటల్ అనుభూతిని అందిస్తుంది. ఐఫోన్ చరిత్రలోనే అత్యధిక కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఈ మోడల్లో అమర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లగ్జరీ డిజైన్, శక్తివంతమైన పర్ఫార్మెన్స్తో వస్తున్న ఈ హ్యాండ్సెట్ స్మార్ట్‌ఫోన్ రంగాన్ని మరో మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ రావడం స్మార్ట్‌ఫోన్ విపణిలో పెద్ద మార్పుకు సంకేతం. ప్రారంభంలో పరిమిత మార్కెట్లకే పరిమితమైనప్పటికీ, సాంకేతికత పరంగా ఐఫోన్ ఆల్ట్రా ఆటోమేటిక్‌గా ప్రీమియం ఫోన్ల కేటగిరీలో నంబర్ వన్‌గా నిలిచే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Leak Suggests Grand Theft Auto 6's Extended Look on Netflix Could Have 3 Episodes