2027 మొదటి సగభాగంలో రాబోయే స్టాండర్డ్ ఐఫోన్ 18, నాన్-ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 18ఈ స్మార్ట్‌ఫోన్లు ఏకంగా 9జీబీ డీరామ్ తో రాబోతున్నాయి.
Photo Credit: iPhone 17
iPhone 17
iPhone 18 : ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించే యాపిల్ కంపెనీ, తన రాబోయే ఐఫోన్ 18 సిరీస్ విషయంలో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే అన్ని మోడళ్లను ఒకేసారి విడుదల చేసే యాపిల్, ఈసారి ఆ పద్ధతికి స్వస్తి పలకాలని చూస్తోంది. తాజా లీకుల ప్రకారం.. యాపిల్ తన ఐఫోన్ లాంచ్ టైమింగ్స్‌ను మార్చబోతోంది. కేవలం హై-ఎండ్ ప్రో మోడళ్లను మాత్రమే సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తెచ్చి, బేస్ లేదా స్టాండర్డ్ వేరియంట్లను మాత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ మార్పులపై యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ప్రముఖ ఆపిల్ అనలిస్ట్ మింగ్-చి కువో ఐఫోన్ 18 బేస్ మోడల్స్ ర్యామ్, ప్రాసెసర్ వివరాలను లీక్ చేసి టెక్ ప్రపంచంలో సంచలనం రేపారు.
ఐఫోన్ 18, 18ఈ లీకైన వివరాలు
యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం, 2027 మొదటి సగభాగంలో రాబోయే స్టాండర్డ్ ఐఫోన్ 18, నాన్-ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 18ఈ స్మార్ట్‌ఫోన్లు ఏకంగా 9జీబీ డీరామ్ తో రాబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ 17, ఐఫోన్ 17ఈ లలో ఉన్న 8జీబీ ర్యామ్‌తో పోలిస్తే ఇది ఒక మోస్తరు అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రాబోయే సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ఈ ఫోన్లు మరింత స్మూత్‌గా హ్యాండిల్ చేయడానికి యాపిల్ ఈ అదనపు మెమొరీని జత చేయబోతోందని ఆయన స్పష్టం చేశారు.
సరికొత్త ఏ20 చిప్‌సెట్
ఈ రెండు రాబోయే బేస్ మోడల్ ఐఫోన్లలో యాపిల్ కంపెనీ సరికొత్త ఏ20 చిప్‌సెట్‌ను ఉపయోగించబోతోంది. ఈ ప్రాసెసర్‌ను ప్రపంచ ప్రసిద్ధ చిప్ తయారీ సంస్థ తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అత్యంత అధునాతన 2ఎన్ఎమ్ గేట్-ఆల్-అరౌండ్ (GAA) ప్రాసెస్ టెక్నాలజీతో తయారు చేయబోతున్నారు. దీనివల్ల ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ వేగం పెరగడమే కాకుండా, బ్యాటరీ లైఫ్, ఎఫిషియెన్సీ కూడా మునుపటి కంటే చాలా అద్భుతంగా మెరుగుపడనుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం సిస్టమ్-లెవెల్ ఇంటిగ్రేషన్‌ను పటిష్టం చేయడానికే ఈ నయా టెక్నాలజీని వాడుతున్నారు.
6 డైస్ మెమొరీ కాన్ఫిగరేషన్
మింగ్-చి కువో లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18లో యాపిల్ ఒక వింతైన మెమొరీ కాన్ఫిగరేషన్‌ను ఉపయోగించనుంది. ఇందులో ఆరు 1.5జీబీ డీరామ్ డైస్ (1.5GB x 6 dies) సహాయంతో మొత్తం 9జీబీ ర్యామ్‌ను సెట్ చేయబోతున్నారు. ఇది ప్రస్తుత తరం ఐఫోన్ 17, ఐఫోన్ 17ఈ మోడళ్ల కంటే చాలా భిన్నమైనది. ఎందుకంటే ప్రస్తుత ఫోన్లలో నాలుగు 2జీబీ మెమొరీ చిప్స్ (2GB x 4 dies) సహాయంతో మొత్తం 8జీబీ ర్యామ్‌ను ఇస్తున్నారు. ఈ చిన్న ర్యామ్ మార్పు ఐఓఎస్ 27 లో వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌లను వేగంగా చేయడానికి హెల్ప్ అవుతుంది.
Smartphone : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఒక్క నెలలోనే మార్కెట్లోకి వచ్చిన టాప్ మొబైల్స్ ఇవే
సరికొత్త మడతబెట్టే ఐఫోన్ ఆల్ట్రాలో 12జీబీ ర్యామ్
మరోవైపు, యాపిల్ యొక్క టాప్-ఆఫ్-ది-లైన్ మోడళ్లయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్లలో యథావిధిగా 12జీబీ భారీ ర్యామ్‌ను కొనసాగించనున్నారు. వీటితో పాటు యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా రాబోతున్న సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ ఆల్ట్రా కూడా 12జీబీ ర్యామ్‌తోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూడు ప్రీమియం హ్యాండ్‌సెట్లలో ఎనిమిది 1.5జీబీ మెమొరీ చిప్స్‌తో పాటు అత్యంత పవర్‌ఫుల్ ఏ20 ప్రో చిప్‌సెట్‌ను యాపిల్ అమర్చబోతోంది.
ఐఫోన్ 18 లో పూర్తి స్థాయి ఏఐ ఫీచర్లు పని చేస్తాయా?
యాపిల్ తన ఆన్-డివైస్ ఏఐ హార్డ్‌వేర్ అవసరాల నిబంధనలను ఐఓఎస్ 27 తో మరింత కఠినతరం చేసింది. యాపిల్ తీసుకొచ్చిన అత్యంత అధునాతన ఆన్-డివైస్ ఏఐ మోడల్ సరిగ్గా రన్ అవ్వాలంటే కనీసం 12జీబీ యూనిఫైడ్ మెమొరీ ఉండాలని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కారణంగానే ప్రస్తుతం ఈ అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు కేవలం ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఎమ్4 చిప్ ఉన్న ఐపాడ్లు, ఎమ్3 లేదా ఆపై చిప్స్ ఉన్న మ్యాక్ బుక్స్, అలాగే యాపిల్ విజన్ ప్రో వంటి 12జీబీ లేదా అంతకంటే ఎక్కువ మెమొరీ ఉన్న డివైజ్ లకే పరిమితం అయ్యాయి. ప్రస్తుత ఐఫోన్ 17 బేస్ మోడల్‌లో 8జీబీ ర్యామ్ మాత్రమే ఉండటం వల్ల దీనికి సిరి (Siri) లో వచ్చే అడ్వాన్స్‌డ్ వాయిస్, డిక్టేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో లేవు. ఒకవేళ కువో చెప్పినట్లు ఐఫోన్ 18 లో 9జీబీ ర్యామ్ ఇస్తే, అది ఈ 12జీబీ నిబంధన కంటే తక్కువ కాబట్టి.. ఐఫోన్ 18 బేస్ మోడల్స్‌లో యాపిల్ మోస్ట్ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ పూర్తిగా రన్ అవుతాయా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo X Fold 6 Global Launch Nears as European Listing Reveals Price and Specifications