యాపిల్ కంపెనీ ఈ సరికొత్త ఐఫోన్ ఆల్ట్రాను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పటికీ, దీని మాన్యుఫ్యాక్చరింగ్ ప్రక్రియలో కొన్ని సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది.
Photo Credit: Apple
Apple
Apple : ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాపిల్ కంపెనీ తన కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఐఫోన్ మొదటి ఫోల్డబుల్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసేందుకు యాపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఐఫోన్ ఆల్ట్రా అనే పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్, తన అప్ కమింగ్ ఐఫోన్ 18 సిరీస్ మొబైల్స్‌తో పాటే ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది.
ఫోల్డబుల్ ఐఫోన్ సేల్స్ ఆలస్యం కానున్నాయా?
యాపిల్ కంపెనీ ఈ సరికొత్త ఐఫోన్ ఆల్ట్రాను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పటికీ, దీని మాన్యుఫ్యాక్చరింగ్ ప్రక్రియలో కొన్ని సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ కారణంగానే ఈ ఫోన్ అమ్మకాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కువో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఈ ఫోల్డబుల్ ఐఫోన్ షిప్‌మెంట్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంచనాలను పంచుకున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల ఫోల్డబుల్ ఐఫోన్ యూనిట్లను షిప్‌మెంట్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇది ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగబోయే మొత్తం 80 లక్షల (8 మిలియన్) యూనిట్ల షిప్‌మెంట్లలో సుమారు 10 శాతానికి సమానం. అయితే, ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఇది లాంచ్ అయినప్పటికీ, ఈ ఏడాది చివరి త్రైమాసికం కంటే ముందు దీని విక్రయాలు ప్రారంభం కాకపోవచ్చని కువో అంచనా వేస్తున్నారు.
3D ప్రింటెడ్ టెక్నాలజీతో స్క్రీన్ మడతల సమస్యకు చెక్
ఇటీవల వచ్చిన కొన్ని మీడియా నివేదికల ప్రకారం, యాపిల్ సంస్థ ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించిన డిస్‌ప్లే, బాడీ చేసిస్, మెకానికల్ స్ట్రక్చర్ వంటి అత్యంత కీలకమైన భాగాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కంపెనీ గత ఏప్రిల్ నెలలోనే ఐఫోన్ ఆల్ట్రా మొదటి రౌండ్ ట్రయల్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను కూడా పూర్తి చేసింది. అయితే ఫోల్డబుల్ ఫోన్లకు అత్యంత కీలకమైన హింజ్ (మడత పెట్టే జాయింట్) విషయంలో యాపిల్ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ సమస్యను అధిగమించేందుకు హింజ్ తయారీలో 3D ప్రింటెడ్ టెక్నాలజీని ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల ఫోన్‌ను అన్‌ఫోల్డ్ చేసినప్పుడు డిస్‌ప్లే స్క్రీన్ పైన కనిపించే మడత మార్కులు (క్రీజ్) చాలా వరకు తగ్గిపోతాయి. గతంలో యాపిల్ కంపెనీ తన యాపిల్ వాచ్ కేస్ తయారీ కోసం కూడా ఇదే 3D ప్రింటెడ్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగించింది.
Flipkart Goat Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. రూ.20 వేల లోపు బడ్జెట్‌లో టాప్ 5 బెస్ట్ డీల్స్ ఇవే
క్రేజీ లుక్‌తో రానున్న ఐఫోన్ ఆల్ట్రా
ఈ సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ ఆల్ట్రా ఫీచర్లు యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ లోపలి ప్రధాన స్క్రీన్ 7.58 ఇంచులుగా, అలాగే బయటి వైపు ఉండే స్క్రీన్ 5.25 ఇంచులుగా ఉండే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫోన్‌ను పూర్తిగా విప్పినప్పుడు దీని యూజర్ ఇంటర్‌ఫేస్ యాపిల్ ఐప్యాడ్ లాగా మారిపోతుంది. అంటే ఒకే ఫోన్ లో అటు ఐఫోన్, ఇటు ఐప్యాడ్ ఫీచర్లను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చన్నమాట.
బ్యాటరీ పవర్‌లో శాంసంగ్‌కే సవాల్
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో యాపిల్ కంపెనీ అత్యంత అధునాతనమైన 2 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీతో రూపొందించిన అప్‌కమింగ్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను ఉపయోగించబోతోంది. దీనివల్ల ఫోన్ స్పీడ్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఐఫోన్ల చరిత్రలోనే అత్యధిక కెపాసిటీ కలిగిన భారీ బ్యాటరీని ఈ ఫోల్డబుల్ మోడల్‌లో అందించనున్నారు. ఇది గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బ్యాటరీ సామర్థ్యం కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుందని టెక్ వర్గాల సమాచారం. వీటితో పాటు ఈ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం డ్యూయల్-లేయర్ UTG, UFG గ్లాస్ డిజైన్‌ను వాడుతున్నారు. ఇందులో డిస్‌ప్లే అనేది రెండు సన్నని గ్లాస్ షీట్ల మధ్య సురక్షితంగా అమర్చబడి ఉంటుంది. సరికొత్త హింజ్ డిజైన్ వల్ల ఫోన్‌ను సులభంగా మడతబెట్టడానికి, స్క్రీన్ లైఫ్ పెరగడానికి ఎంతగానో దోహదపడుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Google Play Store ‘Shop Devices’ Feature Goes Live in India With Pixel Phones and Accessories