Photo Credit: Netflix
మార్చి 28న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
కోలీవుడ్ తాజా బ్లాక్ బస్టర్ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాలలో రూ. 120 కోట్ల కలెక్షన్‌లను దాటేసింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించగా, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించారు. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్‌ను సాధించింది. థియేటర్లలో రన్ అయిన తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OTT విడుదలకు సన్నద్ధమైంది. ఈ రిలీజ్‌పై జరుగుతోన్న ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్ వేద్దాం రండి!
డ్రాగన్, దీని తెలుగు వెర్షన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మార్చి 28న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా రిలీజ్ కానున్నాయి. అయితే, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి, సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉండడంతో డిజిటల్ హక్కులు ముందుగానే పొందినట్లు టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే OTT విడుదలకు ముందు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుందని చెబుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి వస్తే మరింత ప్రేక్షకాధరణ పొందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా కథ విషయానికి వస్తే.. ఒక యువకుడి జీవిత గమనాన్ని మార్చే ఊహించని సంఘటనల చుట్టూ స్టోరీ నడుస్తుంది. ప్రతి సీన్ ఆసక్తికరంగా మళచడంలో దర్శకుడు సెక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫెల్యూర్ నుంచి సక్సెస్ కోసం హీరో ఎంచుకున్న మార్గం ఏంటి? తప్పును సరిదిద్దుకునేందుకు ఏం చేస్తాడు? చివరకు జీవితంలో అనుకున్నది సాధిస్తాడా? అనేది ఇతివృత్తంగా కథ సాగుతుంది.
ఈ కథలో యాక్షన్, కామెడీ, భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. ప్రదీప్ రంగనాథన్ నటన, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం, లియోన్ జేమ్స్ సంగీతం ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నాయనే చెప్పాలి. వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకాధరణ పొందిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుందనే చెప్పాలి. అటు తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాలలో హిట్ టాక్‌ను సొంతం చేసుంది.
ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించగా, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కథానాయికలుగా నటించారు. అశ్వత్ మరిముత్తు ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన అర్చన కళాపతి ఈ చిత్రాన్ని నిర్మించగా, లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. మొత్తంగా సినిమా సిల్వర్ స్ర్కీన్‌పై వసూళ్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, కమర్షియల్ విజయాన్ని అందుకుంది. దీనికి IMDb రేటింగ్ 8.3 / 10. మరి, సినిమా OTT రిలీజ్‌తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం మార్చి 28 వరకూ ఆగాల్సిందే.
ప్రకటన
ప్రకటన