Photo Credit: Vivo
Vivo Y300 Pro+ మైక్రో పౌడర్, సింపుల్ బ్లాక్ మరియు స్టార్ సిల్వర్ (అనువాదం) షేడ్స్‌లో వస్తుంది.
చైనాలో Vivo Y300 Pro+ లాంఛ్ అయింది. ఈ మొబైల్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీ, 12GB వరకు RAMతో అటాచ్ చేయబడిన స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఉన్నాయి. కంపెనీ Vivo Y300t మోడల్‌ను సైతం ఆవిష్కరించింది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లను కలిగి ఉంటాయి. అలాగే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆరిజిన్ OS 5పై రన్ అవుతాయి.చైనాలో ధరలు ఇలా,ఈ Vivo Y300 Pro+ ధర చైనాలో 8GB + 128GB ఆప్షన్ CNY 1,799 (సుమారు రూ. 21,200) నుండి ప్రారంభమవుతుంది. 8GB + 256GB వెర్షన్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,500)గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం అధికారిక ఈ-స్టోర్ ద్వారా దేశంలో ప్రీ-ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉండగా, ఏప్రిల్ 3 నుండి మైక్రో పౌడర్, సింపుల్ బ్లాక్, స్టార్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో వస్తోంది. Vivo Y300t ధర 8GB + 128GB ఆప్షన్ CNY 1,199 (సుమారు రూ. 14,100) నుండి ప్రారంభమవుతుంది. ఇది ప్రస్తుతం దేశంలోని అధికారిక వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్లాక్ కాఫీ, ఓషన్ బ్లూ, రాక్ వైట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది.
ఇది 6.77-అంగుళాల ఫుల్-HD+ (1,080X2,392 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌తో వస్తోంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ Sony LYT-600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), వెనుక భాగంలో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. వెనుక కెమెరా యూనిట్ ఆరా లైట్ ఫీచర్‌తో వస్తోంది. ఇది AI ఇమేజింగ్ టూల్స్‌తో పాటు లైవ్ ఫోటోలకు సపోర్ట్ చేస్తుంది. అలాగే, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, GLONASS, Beidou, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
ఇది 6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్స్) LCD స్క్రీన్‌ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,050nits వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో అటాచ్ చేయబడింది. అలాగే, ఇది 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడి, ఆండ్రాయిడ్ 15పై Origin OS 5 స్కిన్‌తో వస్తోంది.
50-మెగాపిక్సెల్ వెనుక సెన్సార్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్‌తోపాటు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీలు-వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందించారు. 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీతో వస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
ప్రకటన
ప్రకటన