ఇప్పుడు కొత్తగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ ఈ ఉచిత కోటాను తగ్గించే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది.
Photo Credit: Unsplash
Google One Lite with 30GB is priced at Rs. 59 per month in India
Google Shocking Decision: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న జీమెయిల్ విషయంలో గూగుల్ ఒక కీలక మార్పు చేయబోతోంది. ఇప్పటివరకు కొత్తగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే గూగుల్ డ్రైవ్, ఫోటోస్ అన్నింటికీ కలిపి ఉచితంగా 15GB స్టోరేజీ ఇచ్చేది. అయితే, ఇప్పుడు ఈ ఉచిత కోటాను తగ్గించే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది. ఫోన్ నంబర్ వెరిఫై చేయని కొత్త అకౌంట్లకు కేవలం 5GB స్టోరేజీ మాత్రమే ఇవ్వాలని గూగుల్ యోచిస్తోంది. దీనికి సంబంధించిన పరీక్షలు ఇప్పటికే కొన్ని దేశాల్లో మొదలయ్యాయి.
రెడిట్, ఎక్స్ వేదికగా వినియోగదారులు పంచుకున్న సమాచారం ప్రకారం.. మీరు కొత్తగా గూగుల్ అకౌంట్ తెరిచినప్పుడు మీ ఫోన్ నంబర్‌ను లింక్ చేయకపోతే మీకు కేవలం 5GB క్లౌడ్ స్టోరేజీ మాత్రమే లభిస్తుంది. ఒకవేళ మీకు పాత పద్ధతిలోనే 15GB ఫ్రీ స్టోరేజీ కావాలంటే మాత్రం కచ్చితంగా మీ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. కేవలం స్టోరేజీ కోసమే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తుండటంతో, ఆ ప్రాక్టీస్‌కు చెక్ పెట్టాలని గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త మార్పుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫోన్ నంబర్ అడగడం ద్వారా గూగుల్ తమ వ్యక్తిగత సమాచారాన్ని మరింత ఎక్కువగా సేకరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే గూగుల్ మాత్రం ఇది అకౌంట్ సేఫ్టీ, డేటా రికవరీ కోసం చేస్తున్న మార్పు అని చెబుతోంది. ఫోన్ నంబర్ ఉంటే అకౌంట్ హ్యాక్ అయినప్పుడు రికవరీ చేయడం సులభం అవుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రయోగం కెన్యా, నైజీరియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతోంది. త్వరలోనే ఇది భారత్ వంటి ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
ఒకవేళ గూగుల్ నిజంగానే ఫ్రీ స్టోరేజీని 5GBకి తగ్గిస్తే.. అదనపు స్థలం కావాలనుకునే వారు కచ్చితంగా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో 30GB స్టోరేజీ ఇచ్చే గూగుల్ వన్ లైట్ ప్లాన్ నెలకు రూ.59కి అందుబాటులో ఉంది. అలాగే 100GB ప్లాన్ నెలకు రూ.130, 2TB ప్లాన్ రూ.650గా ఉన్నాయి. స్పామ్ అకౌంట్లను తగ్గించడానికి ఈ నిబంధన ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే అకౌంట్ ఉన్న పాత వినియోగదారులపై దీని ప్రభావం ఉండకపోవచ్చు, కానీ కొత్తగా వచ్చే వారికి మాత్రం ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
గూగుల్ కేవలం స్టోరేజీ మాత్రమే కాకుండా జీమెయిల్‌లో మరిన్ని ఏఐ ఫీచర్లను కూడా తీసుకువస్తోంది. ముఖ్యమైన మెయిల్స్ ను గుర్తించి ప్రయారిటీ ఇచ్చే ఏఐ ఇన్ బాక్స్ ఫీచర్ ను కూడా కంపెనీ రోల్ అవుట్ చేస్తోంది. ఏది ఏమైనా, భవిష్యత్తులో గూగుల్ సేవలు పొందాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి కానుంది. మీరు కూడా కొత్త అకౌంట్ తీసుకోవాలనుకుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999