Google Play Store : గూగుల్ ప్లే స్టోర్‌ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి

యూజర్ల వయస్సును నిర్ధారించడానికి గూగుల్ ప్లే ఏజ్ సిగ్నల్ API అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది.

Google Play Store  : గూగుల్ ప్లే స్టోర్‌ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి

Photo Credit: freepnglogo

Google

ముఖ్యాంశాలు
  • గూగుల్ ప్లే స్టోర్‌లో సంచలన మార్పులు
  • ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి
  • గ్లోబల్ లెవెల్లో 'ప్లే ఏజ్ సిగ్నల్ API' రోల్‌అవుట్
ప్రకటన

Google Play Store  : టెక్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌లలో ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను అంతర్జాతీయ స్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి, రెగ్యులేటరీ సంస్థల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి, నిబంధనల నేపథ్యంలోని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆపిల్ సంస్థ తన యాప్ స్టోర్‌లో ఈ రకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు గూగుల్ కూడా ప్రపంచవ్యాప్తంగా దీనిని ప్లే స్టోర్‌లో రోల్‌అవుట్ చేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచంలో ఏ మూలన ఉన్న యూజర్ అయినా సరే యాప్‌లను యాక్సెస్ చేసే ముందు ఏజ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఏమిటీ ప్లే ఏజ్ సిగ్నల్ API ?
యూజర్ల వయస్సును నిర్ధారించడానికి గూగుల్ ప్లే ఏజ్ సిగ్నల్ API అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఈ సిస్టమ్ యూజర్ల వ్యక్తిగత వివరాలను లేదా నిబంధనలను అతిక్రమించకుండా, ప్రైవసీకి పూర్తి భద్రతనిస్తూ వారి వయస్సు పరిమితిని డెవలపర్లు తెలుసుకునేలా చేస్తుంది. 2026 చివరి నాటికి అమెరికా మార్కెట్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ సిస్టమ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

Play Age Signal API

 Photo Credit: Google


ఐడీ, సెల్ఫీ వెరిఫికేషన్ అవసరం లేదు 
సాధారణంగా ఏజ్ వెరిఫికేషన్ అనగానే ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు లేదా సెల్ఫీలు అప్‌లోడ్ చేయాల్సి వస్తుందని భయపడుతుంటారు. అయితే, గూగుల్ గతేడాది బీటా వర్షన్‌లో లాంచ్ చేసిన ఈ ప్లే ఏజ్ సిగ్నల్ APIలో ఎలాంటి ఐడీ లేదా సెల్ఫీ వెరిఫికేషన్ అవసరం ఉండదు. ఇది గూగుల్‌కు చెందిన ఫ్యామిలీ లింక్ యాప్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన వయస్సు పరిమితిని ముందే సెట్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆగస్టు మధ్యనాటికి ఆస్ట్రేలియా, కెనడాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా ఏడాది ఆఖరు నాటికి ఇతర అన్ని దేశాలకు విస్తరిస్తుంది.

పిల్లల భద్రతే ప్రధాన లక్ష్యం 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటరీ సంస్థలు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో మైనర్లు, చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారులకు సరిపడని కంటెంట్ లేదా యాప్‌లు అందుబాటులో లేకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఫిబ్రవరిలో ఆపిల్ తన ఏజ్ వెరిఫికేషన్ టూల్స్ లాంచ్ చేయగా, గూగుల్ కూడా అదే బాటలో నడిచింది. యూజర్ల ఖచ్చితమైన పుట్టిన తేదీ లేదా ప్రైవేట్ సమాచారాన్ని సేకరించకుండానే, తల్లిదండ్రులు నేరుగా యాప్‌లతో తమ పిల్లల ఏజ్ రేంజ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును ఈ టెక్నాలజీ కల్పిస్తుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »