రాబోయే పిక్సెల్ 11 సిరీస్ ధరలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Photo Credit: Google
Google Pixel
Google Pixel 11 Series Launch: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల సిరీస్ గూగుల్ పిక్సెల్ 11ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. మేడ్ బై గూగుల్ పేరుతో జరిగే ఈ భారీ హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్ ఆగస్టు 12న జరగనుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. పిటి సమయం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 13 తెల్లవారుజామున 3:30 గంటలకు) ఈ కీనోట్ ప్రెజెంటేషన్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ గూగుల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈసారి పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రొ, పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్, పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్ అనే నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్లు రానున్నాయి.
ఆశించిన ధరలు, కొత్త డిజైన్ లీక్స్
రాబోయే పిక్సెల్ 11 సిరీస్ ధరలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాథమిక పిక్సెల్ 11 అమెరికాలో $899 (సుమారు రూ. 79,000) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, పిక్సెల్ 11 ప్రొ $1,099 (సుమారు రూ. 96,500), పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్ $1,299 (సుమారు రూ. 1,14,000), ఫోల్డబుల్ పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్ $1,899 (సుమారు రూ. 1,67,000) ప్రారంభ ధరలతో వచ్చే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఈసారి వెనుక కెమెరా బార్ వద్ద సరికొత్త RGB ఆర్బీ లైటింగ్ సిస్టమ్ పిక్సెల్ గ్లోను పరిచయం చేయబోతున్నారు. ఇది నోటిఫికేషన్లు, AI ఫీచర్లకు అనుగుణంగా వెలుగుతుంది. ఇవి డ్యూన్, లైట్ ఫాగ్, మిడ్‌నైట్ హేజ్, పైన్, ఫ్యూషియా, మాస్ వంటి ఆకర్షణీయమైన కలర్లలో రానున్నాయి.
డిస్‌ప్లే, నెక్స్ట్-జెన్ టెన్సర్ G6 ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్
పిక్సెల్ 11 మోడల్ 6.3-ఇంచుల ఫుల్-హెచ్‌డీ+ యాక్చువా OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. పిక్సెల్ 11 ప్రొ మోడల్‌లో 3,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.3-ఇంచుల సూపర్ యాక్చువా LTPO OLED స్క్రీన్ ఉండగా, ప్రొ ఎక్స్‌ఎల్ మోడల్ 6.8-ఇంచుల భారీ స్క్రీన్‌తో రానుంది. ఇక పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్ మోడల్ 8-ఇంచుల లోపలి ఫోల్డబుల్ OLED స్క్రీన్, 6.4-ఇంచుల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొత్తం సిరీస్ గూగుల్ సొంతంగా తయారుచేసిన నెక్స్ట్-జనరేషన్ టెన్సర్ G6 ప్రాసెసర్, టైటాన్ M3 సెక్యూరిటీ చిప్‌తో పనిచేస్తుంది. ఇవి లేటెస్ట్ Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బాక్స్ వెలుపల లభిస్తాయి. ప్రొ వర్షన్లలో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
48MP కెమెరాలు, ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్
కెమెరా విభాగంలో పిక్సెల్ 11 వేరియంట్‌లో 48MP ప్రైమరీ, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఇవ్వబడ్డాయి. అయితే పిక్సెల్ 11 ప్రొ, ప్రొ ఎక్స్‌ఎల్ మోడళ్లలో 50MP ప్రైమరీ, 48MP మ్యాక్రో అల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అందించబడుతుంది. ఇది 120x ప్రో జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 42MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్‌లో 48MP ప్రైమరీ, 10.5MP అల్ట్రా వైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలు ఉంటాయి. బ్యాటరీ విషయానికొస్తే పిక్సెల్ 11 లో 4,985mAh బ్యాటరీ, పిక్సెల్ 11 ప్రొ లో 4,850mAh, ప్రొ ఎక్స్‌ఎల్‌లో 5,115mAh (45W ఫాస్ట్ ఛార్జింగ్), ప్రొ ఫోల్డ్‌లో 4,806mAh బ్యాటరీలు కలవు. ఇవన్నీ 30W లేదా 45W వైర్డ్ ఛార్జింగ్, Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999