చాలామంది ఫోన్లలో ఒకే రకమైన ఫోటోలు లేదా వీడియోలు అనేక డాక్యుమెంట్లుగా సేవ్ అయి ఉంటాయి.
Photo Credit: AI Generated
Tech Tips: మన ఫోన్ స్టోరేజ్ వేగంగా నిండిపోవడానికి ప్రధాన కారణం వాట్సాప్. రోజువారీ చాట్లు, వివిధ గ్రూపుల నుంచి వచ్చే వేలాది ఫోటోలు, వీడియోలు, జిఫ్‌లు ఫోన్‌లో తిష్టవేస్తాయి. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్ > స్టోరేజ్ అండ్ డేటా > మేనేజ్ స్టోరేజ్ విభాగంలోకి వెళ్తే ఏ చాట్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించిందో స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ అవసరం లేని పెద్ద వీడియోలను నేరుగా డిలీట్ చేయవచ్చు. అలాగే మనం ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే పీడీఎఫ్ ఫైళ్లు, APK ఫైళ్లు, ఇమేజ్‌లు డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లో అలానే ఉండిపోతాయి. మై ఫైల్స్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్స్ విభాగంలో ఉన్న పాత ఫైళ్లను తనిఖీ చేసి అనవసరమైన వాటిని క్లీన్ చేయడం చాలా మంచిది.
డూప్లికేట్ ఫైళ్లు, అనవసరమైన యాప్‌లకు గుడ్‌బై
చాలామంది ఫోన్లలో ఒకే రకమైన ఫోటోలు లేదా వీడియోలు అనేక డాక్యుమెంట్లుగా సేవ్ అయి ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్ వంటి యాప్‌ల నుంచి మీడియా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. గ్యాలరీలోకి వెళ్లి ఒకేలా ఉన్న ఫోటోలు, వీడియోల కాపీలను ఏరిపారేయండి. అదేవిధంగా ఫోన్‌లో నెలల తరబడి వాడకుండా పడివున్న యాప్‌లు, గేమ్స్ చాలా స్థలాన్ని వృథా చేస్తాయి. ఫోన్ సెట్టింగ్స్‌లోని యాప్స్ విభాగానికి వెళ్లి ఏ యాప్ ఎక్కువ స్టోరేజ్ వాడుతోందో చూసి, అవసరం లేని పెద్ద యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేస్తే గిగాబైట్ల కొద్దీ స్పేస్ ఒకేసారి ఖాళీ అవుతుంది.
యాప్ క్యాష్ డేటా క్లియర్ చేసేటప్పుడు జాగ్రత్త
మనం క్రమం తప్పకుండా వాడే యాప్‌లు పనిచేసే క్రమంలో కొంత తాత్కాలిక డేటాను సృష్టిస్తాయి. దీనినే క్యాచీ అంటారు. సమయం గడిచేకొద్దీ ఈ క్యాచీ డేటా జీబీలలోకి చేరుకుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్ > యాప్స్ > సంబంధిత యాప్ > స్టోరేజ్ లోకి వెళ్లి క్లియర్ క్యాచీ పై టాప్ చేస్తే ఆ చెత్తంతా పోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయ గుర్తుంచుకోవాలి. క్లియర్ క్యాచీ మాత్రమే చేయాలి. పొరపాటున క్లియర్ డేటా లేదా క్లియర్ స్టోరేజ్ చేస్తే యాప్‌లో ఉన్న మీ లాగిన్ వివరాలు, సమాచారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి జాగ్రత్తగా క్లియర్ క్యాష్ మాత్రమే నొక్కాలి.
Google Pixel 11 Pro: గూగుల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. భారత్‌లో పిక్సెల్ 11 ప్రో, 11 ప్రో ఎక్స్‌ఎల్ లాంచ్
ముఖ్యమైన డేటా బ్యాకప్ మరవద్దు
ఫోన్ ఖాళీ చేసే తొందరలో అవసరమైన డాక్యుమెంట్లు, ముఖ్యమైన జ్ఞాపకాలను డిలీట్ చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ఫైల్ అవసరమో కాదో అని చిన్న సందేహం వచ్చినా, దానిని ముందుగా గూగుల్ డ్రైవ్ లేదా గూగుల్ ఫోటోస్ వంటి సురక్షితమైన క్లౌడ్ స్టోరేజ్‌లోకి బ్యాకప్ చేసుకోవడం శ్రేయస్కరం.
ప్రకటన
ప్రకటన
Vivo X500 Pro Max Reportedly Bags 3C Certification, Charging Speed Revealed
CD Projekt Red Confirms Layoffs at Project Sirius Witcher Multiplayer Spinoff