గూగుల్ పిక్సెల్ 11, శామ్‌సంగ్ గెలాక్సీ S26 రెండూ 6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తాయి.
Google Pixel 11 vs Samsung Galaxy s26 vs Oneplus 15: భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గూగుల్ తన కొత్త పిక్సెల్ 11 మోడల్‌ను ఆగస్టు 12న విడుదల చేసి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. టెన్సార్ G6 ప్రొసెసర్, టైటాన్ M3 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే విక్రయమవుతున్న శామ్‌సంగ్ గెలాక్సీ S26, వన్‌ప్లస్ 15లతో నేరుగా తలపడుతోంది. ప్రారంభ ధరల పరంగా శామ్‌సంగ్ గెలాక్సీ S26 12GB ర్యామ్, 256GB వేరియంట్ రూ. 79,999 కి లభిస్తూ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 11 బేస్ మోడల్ రూ.89,999 కాగా, వన్‌ప్లస్ 15 రూ.85,999కి లభిస్తోంది. ప్రీమియం విభాగంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ మూడు బ్రాండ్లు విభిన్న హంగులతో పోటీపడుతున్నాయి.
డిస్‌ప్లే, ప్రాసెసింగ్ వేగంలో ఏది టాప్?
స్క్రీన్ సైజ్ చూస్తే గూగుల్ పిక్సెల్ 11, శామ్‌సంగ్ గెలాక్సీ S26 రెండూ 6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తాయి. అయితే వన్‌ప్లస్ 15 ఏకంగా 6.78 ఇంచుల క్యూహెచ్‌డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ అందిస్తూ ముందంజలో ఉంది. పిక్సెల్ 11 స్క్రీన్ 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వెలుగులు చిమ్ముతుంది. ప్రాసెసర్ల విషయంలో గూగుల్ తన సొంత టెన్సార్ G6 వాడగా, శామ్‌సంగ్ 2nm ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ ఉపయోగించింది. వన్‌ప్లస్ 15 లో అత్యంత వేగవంతమైన 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ అమర్చడం వల్ల గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లో అద్భుతమైన వేగం లభిస్తుంది.
ఫోటోగ్రఫీలో ఎవరిది పైచేయి?
ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ మూడు ఫోన్లు త్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నాయి. పిక్సెల్ 11 లో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 10.8 మెగాపిక్సెల్ 5x టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ S26 లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్లు లభిస్తాయి. ఇక వన్‌ప్లస్ 15 ఏకంగా వెనుకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చి సంచలనం సృష్టించింది. సోనీ IMX906 ప్రధాన సెన్సార్‌తో పాటు 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుండగా, సెల్ఫీల కోసం ఇందులో 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
Zoom App Hacking: జూమ్ యాప్‌లో సెక్యూరిటీ లోపం.. క్లిక్ చేయకపోయినా మీ ఫోన్ హ్యాక్
బ్యాటరీ, ఛార్జింగ్ విభాగంలో బిగ్ ట్విస్ట్
బ్యాటరీ సామర్థ్యంలో వన్‌ప్లస్ 15 మిగిలిన రెండు ఫోన్లకు ఏమాత్రం అందుబాటులో లేకుండా దూసుకుపోయింది. ఇందులో ఏకంగా 7,300mAh సిలికాన్-కార్బన్ జంబో బ్యాటరీ అమర్చారు. ఇది 120W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 39 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. పిక్సెల్ 11 లో 4,985mAh బ్యాటరీ ఉండగా, శామ్‌సంగ్ గెలాక్సీ S26 లో కేవలం 4,300mAh బ్యాటరీ మాత్రమే ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే పిక్సెల్ 11 సరికొత్త ఆండ్రాయిడ్ 17 పై నడుస్తుంది. గెలాక్సీ S26, వన్‌ప్లస్ 15 ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేస్తాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999