సాధారణంగా మార్కెట్‌లో రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించే ఈ ల్యాప్‌టాప్ అసలు ఎంఆర్‌పీ ధర రూ.1,29,990 కాగా, ఈ సేల్‌లో ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌తో రూ.71,990లకే అందుబాటులోకి వచ్చింది.
Photo Credit: Acer
Flipkart Freedom Sale: గేమింగ్ లవర్లకు ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఫ్రీడమ్ సేల్ 2026లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో ప్రత్యేకంగా ఏసర్ ఆస్పైర్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్‌పై అపూర్వమైన తగ్గింపు లభిస్తోంది. సాధారణంగా మార్కెట్‌లో రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించే ఈ ల్యాప్‌టాప్ అసలు ఎంఆర్‌పీ ధర రూ.1,29,990 కాగా, ఈ సేల్‌లో ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌తో రూ.71,990లకే అందుబాటులోకి వచ్చింది. అంటే ఏకంగా రూ.58,000 మిగులుతుండటం గమనార్హం.
బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్
కేవలం ల్యాప్‌టాప్ ధరపైనే కాకుండా అదనపు తగ్గింపు పొందేందుకు బ్యాంక్ ఆఫర్లు సహాయపడుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.5,025 వరకు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.3,600 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే వారికి కూడా ఈ బ్యాంక్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. దీనికి తోడు మీ వద్ద ఉన్న పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరో రూ.6,000 వరకు అదనపు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. పాత పరికరం వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఈ ధర నిర్ణయమవుతుంది.
సూపర్ ఫాస్ట్ ప్రాసెసింగ్.. అదిరిపోయే డిస్‌ప్లే
ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ సాంకేతికంగా ఎంతో శక్తివంతంగా రూపుదిద్దుకుంది. ఇందులో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 4.6GHz వరకు క్లాక్ స్పీడ్‌ను ఇస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు డిస్‌ప్లే క్లారిటీ కోసం 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడం వల్ల విజువల్స్ ఎంతో స్మూత్‌గా కనిపిస్తాయి. నాణ్యమైన విజువల్స్ కోసం ప్రత్యేకంగా 6GB GDDR6 గ్రాఫిక్స్ మెమరీ కలిగిన ఎన్‌విడియా జీఫోర్స్ RTX 3050 జతచేర్చారు.
Redmi Note 17 5G: 8000mAh బ్యాటరీ, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్.. రెడ్‌మీ నోట్ 17 5G సేల్ షురూ
మెమరీ కెపాసిటీ.. కనెక్టివిటీ ఫీచర్లు ఇవే
మల్టీ టాస్కింగ్ కోసం ఈ ల్యాప్‌టాప్‌లో 16GB DDR4 ర్యామ్ ఇచ్చారు. దీనివల్ల ఒకేసారి అనేక యాప్‌లు, బ్రౌజర్ ట్యాబ్‌లు వాడినా డివైజ్ స్లో అవ్వదు. స్టోరేజ్ విషయానికి వస్తే ఫాస్ట్ బూటింగ్ ఇచ్చే 512GB SSD అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ బరువు సుమారు 1.99 కిలోలు ఉంటుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై 6, బ్లూటూత్, 4 యూఎస్‌బీ పోర్ట్లు, ఒక హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్ ఉన్నాయి. ఇందులో 54Wh సామర్థ్యం గల 4-సెల్ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎమ్ఎస్ ఆఫీస్ లభిస్తాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999