ఏఐ సాంకేతికతను ఉపయోగించి పరిశోధకులు ఈ జీరో-క్లిక్ దాడి గుట్టు రట్టు చేశారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎ సెక్యూరిటీ చేసిన పరిశోధనలో ఈ భయంకరమైన లోపం వెలుగు చూసింది.
Photo Credit: Pexels
Zoom
Zoom App Hacking: ప్రముఖ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్‌లో అత్యంత ప్రమాదకరమైన సెక్యూరిటీ లోపం బయటపడింది. వినియోగదారులు ఎలాంటి లింక్ క్లిక్ చేయకుండానే, ఏ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే కేవలం మీటింగ్‌లో పాల్గొంటే చాలు.. వారి డివైజ్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఏఐ సాంకేతికతను ఉపయోగించి పరిశోధకులు ఈ జీరో-క్లిక్ దాడి గుట్టు రట్టు చేశారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎ సెక్యూరిటీ చేసిన పరిశోధనలో ఈ భయంకరమైన లోపం వెలుగు చూసింది. గతంలో ఇలాంటి సంక్లిష్టమైన భద్రతా లోపాలను కనుగొనడానికి నెలల తరబడి సమయం, నిపుణుల సేవలు అవసరమయ్యేవి. అయితే ఈసారి పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారు. కేవలం 20 కన్నా తక్కువ ప్రాంప్ట్‌లను ఉపయోగించి 24 గంటల కంటే తక్కువ సమయంలోనే ఈ లోపాన్ని గుర్తించి హ్యాకింగ్ దాడి విధానాన్ని సిద్ధం చేయడం గమనార్హం. జూమ్ ఆండ్రాయిడ్ పాత వెర్షన్‌ను లోతుగా పరిశీలించడం ద్వారా ఈ పరిశోధన ప్రారంభమైంది.
అనొటేషన్ ఫీచరే పెద్ద శాపం
ఆన్‌లైన్ మీటింగ్‌ల సమయంలో ఇతరులు పంపే సమాచారాన్ని యాప్ ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకునే క్రమంలో పరిశోధకుల దృష్టి అనొటేషన్ ఫీచర్‌పై పడింది. సాధారణంగా జూమ్‌లో స్క్రీన్ లేదా వైట్‌బోర్డ్ పంచుకున్నప్పుడు దానిపై రాసుకోవడానికి, గీతలు గీయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి పంపిన సమాచారాన్ని జూమ్ యాప్ ప్రాసెస్ చేసే క్రమంలో సరైన భద్రతా తనిఖీలు లేకపోవడం వల్ల మెమరీ లోపం ఏర్పడుతోందని గుర్తించారు. హ్యాకర్లు దీన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన డేటాను మీటింగ్ ద్వారా అవతలి వ్యక్తి యాప్‌కు పంపి సిస్టమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఏర్పడింది.
జీరో-క్లిక్ దాడి.. కెమెరా, మైక్రోఫోన్ హ్యాక్
సాధారణంగా జరిగే సైబర్ దాడుల్లో బాధితుడు ఏదైనా లింక్ క్లిక్ చేయడం లేదా ఫైల్ ఓపెన్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లోపంలో ఎలాంటి క్లిక్ అవసరం లేకపోవడమే తీవ్ర కలకలం రేపుతోంది. వినియోగదారుడు మీటింగ్‌లో ఉంటే చాలు.. హ్యాకర్ ఆ డివైజ్‌లోకి చొరబడి తనకు నచ్చిన కోడ్‌ను రన్ చేయగలడు. దీనివల్ల బాధితుడి వ్యక్తిగత సమాచారం చోరీ కావడం, ప్రమేయం లేకుండానే కెమెరా, మైక్రోఫోన్‌లు ఆన్ కావడం వంటి తీవ్ర ముప్పు పొంచి ఉంది. విండోస్, మాక్, ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులందరిపై ఈ ప్రభావం పడింది. ఈ లోపాలను సివిఇ-2026-53413, సివిఇ-2026-53414, సివిఇ-2026-53415 అని పిలుస్తున్నారు.
Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.58 వేల తగ్గింపుతో గేమింగ్ ల్యాప్‌టాప్
వెంటనే అప్‌డేట్ చేసుకోండి
ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎ సెక్యూరిటీ సంస్థ జూమ్ యాప్‌కు సమాచారం అందించింది. జూమ్ సంస్థ త్వరితగతిన స్పందించి జూన్ నుంచి జులై మధ్యలో వరుసగా సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేసింది. జులై 20 నాటికి విడుదల చేసిన 7.1.5 వెర్షన్‌లో అన్ని లోపాలకు పరిష్కారం చూపింది. ఒకవేళ మీరు ఇప్పటికీ పాత వెర్షన్ ఉపయోగిస్తుంటే వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్‌డేట్ చేయడం కుదరని పక్షంలో తాత్కాలిక భద్రత కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెట్టింగ్‌ను ఆఫ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999