స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచేలా హానర్ కొత్త రోబోట్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.
Photo Credit: Honor
Honor Robot Phone Launch
Honor Robot Phone Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ ఆటోమొబైల్, టెక్నాలజీ ప్రపంచం ముక్కున వేలేసుకునేలా సరికొత్త హానర్ రోబోట్ ఫోన్‌ను పరిచయం చేసింది. ఫోన్ పైన తిరిగే 200 మెగాపిక్సెల్ రోబోటిక్ గింబల్ కెమెరాను అమర్చడం ద్వారా ట్రైపాడ్ సాయం లేకుండానే హ్యాండ్స్ ఫ్రీ వీడియో రికార్డింగ్ చేసుకునే అద్భుత వెసులుబాటును తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచేలా హానర్ ఈ కొత్త రోబోట్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రొఫెషనల్ వీడియోలు తీయడానికి ట్రైపాడ్లు, ఎక్స్ టర్నల్ గింబల్స్ వాడాల్సి వస్తుంది. అయితే ఈ ఫోన్ పైన అమర్చిన త్రీ-యాక్సిస్ రోబోటిక్ గింబల్ కెమెరా ఆ అవసరాన్ని పూర్తిగా తీసివేసింది. కెమెరాను ఆన్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సబ్జెక్ట్‌ను నిరంతరం ట్రాక్ చేస్తూ కెమెరా తనకు తానుగా తిరుగుతుంది. ప్రొఫెషనల్ సినిమాటిక్ షాట్స్ తీయడానికి హానర్ సంస్థ ఏఆర్‌ఆర్‌ఐ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ధర ఎంతంటే?
చైనా మార్కెట్లో విడుదలైన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రెండు మోడళ్లలో లభిస్తోంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 9,999 (మన భారత కరెన్సీలో దాదాపు రూ.1,41,400) కాగా, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ కలిగిన టాప్ మోడల్ ధర CNY 12,999 (దాదాపు రూ.1,84,000) గా కంపెనీ నిర్ణయించింది. గ్రే, సిల్వర్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో ఆకట్టుకుంటోంది.
కళ్లు చెదిరే డిస్‌ప్లే, ప్రాసెసర్ పవర్
ఈ రోబోట్ ఫోన్ 6.31 ఇంచుల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 6,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దాంతో ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా స్క్రీన్ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత వేగవంతమైన పనితీరు కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, అడ్రినో 840 జీపీయూ అమర్చారు. గేమింగ్, హెవీ మల్టీ టాస్కింగ్‌ను ఈ ఫోన్ చిటికెలో పూర్తి చేస్తుంది.
200MP కెమెరాలతో సంచలనం
కెమెరా విభాగంలో ఈ ఫోన్‌కు తిరుగులేదు. ప్రధాన కెమెరాగా f/1.6 ఎపర్చర్, గింబల్ స్టెబిలైజేషన్ కలిగిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. దీనికి తోడు 2.7x ఆప్టికల్ జూమ్, 200x డిజిటల్ జూమ్ ఇచ్చే మరొక 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 122 డిగ్రీల వైడ్ యాంగిల్ కవర్ చేసే 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. వెనుక కెమెరాతో 120 fps వద్ద, ముందు కెమెరాతో 60 fps వద్ద 4K వీడియోలు రికార్డ్ చేయవచ్చు.
Google Pixel 11 vs Samsung Galaxy s26 vs Oneplus 15.. ఏది కొనడం బెస్ట్?
జంబో బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్
ఈ శక్తివంతమైన ఫోన్ రోజుటి అవసరాలకు సరిపోయేలా ఏకంగా 7,060 mAh భారీ బ్యాటరీతో వస్తోంది. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 120W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, బ్లూటూత్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీతో పాటు స్టీరియో స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లు ఇందులో అమర్చారు. ఫోన్ బరువు 248 గ్రాములు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999