అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: ట‌్యాబ్‌ల‌పై ఉత్తమ డీల్స్ మీకోసం

గతంలో, స్మార్ట్ ఫోన్‌లు, హెడ్ ఫోన్‌లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఉన్న టాప్‌ డీల్‌ల గురించి తెలుసుకున్న‌వారు ఇప్పుడు, ఈ సేల్‌లో ట్యాబ్‌ల‌పై ఉన్న ఉత్త‌మ డీల్‌ల‌ జాబితాను చూసేయొచ్చు

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: ట‌్యాబ్‌ల‌పై ఉత్తమ డీల్స్ మీకోసం

Photo Credit: OnePlus Pad

OnePlus Pad 2 (చిత్రం) జూలై 2024లో భారతదేశంలో ప్రారంభించబడింది

ముఖ్యాంశాలు
  • కొన్ని ప్రొడ‌క్ట్‌లు లాభదాయకమైన నో-కాస్ట్ EMI ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి
  • ఈ సేల్ సమయంలో అన్ని దుకాణదారులకు రూ. 5000 వరకు బంపర్ రివార్డు
  • SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్‌లకు ఇతర అదనపు ప్రయోజనాలు
ప్రకటన

జనవరి 13 మధ్యాహ్నం నుండి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 మ‌న‌దేశంలో మొద‌లైంది. ఆ రోజు అర్ధరాత్రి ప్రైమ్ వినియోగదారుల కోసం సేల్ ముందుగానే ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యక్తిగత గాడ్జెట్‌లు వంటి మరిన్ని వస్తువులను తగ్గింపు ధరలకు పొందవచ్చు. గతంలో, స్మార్ట్ ఫోన్‌లు, హెడ్ ఫోన్‌లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఉన్న టాప్‌ డీల్‌ల గురించి తెలుసుకున్న‌వారు ఇప్పుడు, ఈ సేల్‌లో ట్యాబ్‌ల‌పై ఉన్న ఉత్త‌మ డీల్‌ల‌ జాబితాను చూసేయొచ్చు.

రూ. 5000 వరకు బంపర్ రివార్డ్‌

ఈ సేల్‌లో SBI కస్టమర్‌లు రూ. 14,000 వరకు ఎంపిక చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్‌లు ఇతర అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఈ సేల్ సమయంలో అన్ని దుకాణదారులకు రూ. 5000 వరకు బంపర్ రివార్డులను సొంతం చేసుకోవ‌చ్చు. కొన్ని ప్రొడ‌క్ట్స్‌ లాభదాయకమైన నో-కాస్ట్ EMI ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్లు, చెల్లింపు ఎంపికల వివరాలను ఇక్క‌డ చూడ‌వ‌చ్చు. ఈ జాబితాలోని ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ అమ్మకపు ధరలపై కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొంద‌వ‌చ్చు.

భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు

OnePlus Pad 2కు చెందిన‌ 12GB + 256GB వెర్షన్ జూలై 2024లో దేశీయ మార్కెట్‌లో ధ‌ర‌ రూ. 42,999గా ఉంది. ఈ సేల్ సమయంలో ఇది కేవ‌లం రూ. 37,999కే సొంతం చేసుకోవ‌చ్చు. Xiaomi Pad 6కి చెందిన‌ 8GB + 256GB వేరియంట్ జూన్ 2023లో దేశంలో రూ. 28,999లు ఉండ‌గా, సేల్ డిస్కౌంట్లు ఇతర ఆఫర్లతో దీనిని రూ. 19,499కి కొనుగోలు చేయవచ్చు. జూలై 2024లో మ‌న దేశంలో ఎనిమిది JBL స్పీకర్లతో ఆవిష్కరించిన‌ Lenovo Tab Plus అస‌లు ధర రూ. 22,999. దీనిని కేవ‌లం రూ. 16,499కు సొంతం చేసుకోవ‌చ్చు.

లాంచ్ ధరతోపాటు డిస్కౌంట్ సేల్ ధరల‌ను ఈ జాబితాలో చూడొచ్చు

  • OnePlus Pad 2 లాంచ్ ధ‌ర‌ రూ. 42,999కాగా సేల్ స‌మ‌యంలో రూ. 37,999
  • షియోమి Pad 6 అస‌లు ధ‌ర రూ. 28,999 ఉంటే, ఆఫ‌ర్ ధ‌ర‌ రూ. 19,499
  • హానర్ Pad 9 ప్రారంభ ధ‌ర‌ రూ. 24,999కాగా, రూ. 18,499ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు
  • రూ. 21,999 ధ‌ర ఉన్న OnePlus Pad Go సేల్‌లో కేవ‌లం రూ. 16,999
  • Lenovo ట్యాబ్ ప్లస్ రూ. 22,999కాగా, కేవ‌లం రూ. 16,499గా ఉంది
  • శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9+ అస‌లు ధ‌ర రూ. 20,999కాగా, సేల్‌లో రూ. 12,499
  • Lenovo ట్యాబ్ M11 (పెన్‌తో) రూ. 22,000 ఉంటే, ఆఫ‌ర్ ధ‌ర‌ రూ. 12,749
  • రెడ్‌మి Pad SE అస‌లు ధ‌ర రూ. 14,999కాగా, రూ. 12,599ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఒప్పో K13X 5G ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే... బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనే చెప్పవచ్చు
  2. అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న వివో X ఫోల్డ్ 5...ప్రైస్ ఎంతో తెలుసా
  3. అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న హువాయ్ బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్...ప్రైస్ ఎంతో తెలుసా
  4. టెక్నో పోవా 7 నియో 4G ఫీచర్స్ అదిరిపోయాయి. కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం
  5. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Pad 3.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి
  6. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో మార్కెట్‌లోకి OnePlus 13s: ధర, స్పెసిఫికేషన్స్ మీకోసం
  7. Vi, Vivo స‌రికొత్త‌ ఒప్పందం.. భారత్‌లోని Vivo V50e కొనుగోలుదారులకు ప్రత్యేకమైన 5G రీఛార్జ్‌ ప్లాన్‌
  8. నాలుగు స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో Realme 15 5G హ్యాండ్‌సెట్ అందుబాటులోకి.. నివేదిక‌లు ఏం చెబుతున్నాయంటే
  9. బడ్జెట్ ధరలో లావా నుంచి బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ధర ఎంతంటే
  10. అతి తక్కువ ధరకే Samsung Galaxy S25 Ultra.. డోంట్ మిస్!
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »