మన దేశంలో అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్ జూలై 20, 21 తేదీల్లో ఉంది. అనేక రకాల వస్తువులు వాటి సాధారణ ధరల కంటే చాలా తగ్గింపు ధరలకు ఈ సేల్‌లో లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, ట్యాబ్‌లతోపాటు మరెన్నో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తక్కువ ధరలకు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతోపాటు ఎక్స్‌ఛేంజ్ డీల్‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, స్పీకర్‌లు, స్ట్రీమింగ్ పరికరాలతోపాటు గృహోపకరణాలపై కూడా ఆఫర్‌లు లభిస్తాయి. మరీ ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతోపాటు అమెజాన్ బ్రాండ్ ఉత్పత్తులపై భారీ రాయితీ ఉండబోతోంది. అయితే, ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ సేల్‌లో మొబైల్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతోపాటు మొబైల్స్‌పై కూడా రాయితీ లభిస్తోంది. ఇప్పటికే అమెజాన్ కొన్ని ఆఫర్లను ప్రకటించగా.. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ కార్డులపై 10 శాతం వరకూ అదనపు డిస్కౌంట్‌ను పొందేందుకు అవకాశం ఉంటుంది.
సొంత బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్
ఈసారి అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో కొనుగోలుదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్‌లో అమెజాన్ తమ బ్రాండ్‌తో వస్తోన్న స్మార్ట్ హోమ్ పరికరాలపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే అమెజాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెజాన్ ఫైర్ స్టిక్, అలెక్సాతో కూడిన ఎకో స్మార్ట్ స్పీకర్స్‌తో సహా అలెక్సా అనుసంధానిత స్మార్ట్ హోమ్ ఉపరికరాలపై దాదాపు 55 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌లు ఇస్తున్నట్లు వెల్లడించింది. కొనుగోలుదారులు అమెజాన్ ఎకో పాప్‌ను ఈ ప్రైమ్ డే సేల్‌లో రూ.2,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఎకో షో 5 (2 జెన్) ఆఫర్ల అనంతరం రూ.3,999కే లభించనున్నాయి. ప్రస్తుతం వీటి ధరలు మనదేశంలో వరుసగా రూ.3,999, రూ.8,999గా కొనసాగుతున్నాయి. ఈసారి సేల్‌లో రూ.13,999 ధర ఉన్న అమెజాన్ ఎకో షో 8 (2 జెన్) తాజాగా రూ.8,999కు సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే, ప్రైమ్ డే సేల్‌లో ఐఫోన్ 13 (128జీబీ) ఎన్నడూలేనంత తక్కువ ధరకే అంటే రూ.48,799కే అందుబాటులో ఉండనుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్‌తో తీసుకుంటే మరో వెయ్యి రూపాయిలు ఆదా చేసుకోవచ్చు. కొన్ని ఉత్పత్తులపై కాంబో డీల్స్
ఈసారి సేల్‌లో అమెజాన్ కొన్ని ఉత్పత్తులపై కాంబో డీల్స్ కూడా అవకాశం కల్పించింది. అందులో ఎకో డాట్ (5 జెన్)ను విప్రో 9W స్మార్ట్ బల్బ్‌తో కలిపి కేవలం రూ.4,749కే సొంతం చేసుకోవచ్చు. అలాగే వాచ్‌తో కూడిన ఎకో డాట్ (4 జెన్), విప్రో 9W స్మార్ట్ బల్బ్ కలిపి రూ.3,749కు లభిస్తుండగా, ఇదే బల్బ్‌తో కలిపి ఎకో పాప్‌ను రూ.2,749కు కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ స్మార్ట్ ప్లగ్‌తో కలిపి విప్రో బల్బ్‌ను కొంటే రూ.2,948 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రైమ్ డే సేల్‌లో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కనిష్ఠంగా రూ.2,199కు అంటే, దీని అసలు ధర రూ.4,499తో పోలిస్తే 56 శాతం తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ.1,999కు అలెక్సా వాయిస్ రిమోట్ లైట్‌తో ఉండే ఫైర్ టీవీ స్టిక్‌ను బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఫైర్ టీవీ స్టిక్ 4కే 43 శాతం తగ్గింపుతో రూ.3,999కు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇన్‌బిల్ట్ ఫైర్ టీవీతో కూడిన స్మార్ట్ టెలివిజన్‌పై 50 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ప్రైమ్ మెంబర్ అయితే వెంటనే ఈ అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్‌లో మీ ఇంటికి అవసరమైన వస్తువులను తక్కువ ధరలకే సొంతం చేసుకోండి!
మరింత చదవడం: