Photo Credit: Voltas
ఇండియాలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ ఈ-కామర్స్ దిగ్గజం కొత్త ఏడాది మొదటి సేల్ జనవరి 13న ప్రారంభమై జనవరి 19న ముగుస్తుంది. సేల్ సమయంలో, స్మార్ట్ ఫోన్‌లు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, సెక్యూరిటీ కెమెరాలు వంటి ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ జాబితాలో ఎయిర్ కండిషనర్‌లు కూడా ఉన్నాయి. కొత్తగా ఏసీలను కొనుగోలు చేయాలనుకునే వారు LG, Panasonic, Voltas, Hitachi, Daikin లాంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి లాభదాయకమైన డిస్కౌంట్‌లతోపాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా పొందొచ్చు. మరెందుకు ఆలస్యం, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025లో ఎయిర్ కంటిషనర్‌లపై అందిస్తోన్న టాప్ డీల్స్‌ను తెలుసుకుందాం రండి.
ఈ డిస్కౌంట్ సేల్‌లో కొనుగోలుదారులు తమ ప్రొడక్ట్స్‌ను మార్పిడి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని వల్ల కొత్త వస్తువులపై అదనపు తగ్గింపును పొందొచ్చు. అయితే, ఇలాంటి సమయంలో మీరు మార్పిడి చేసే వస్తువులకు ఎలాంటి ఫిక్స్‌డ్ ధర లేదు. ఆ వస్తువు మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా దాని విలువను అమెజాన్ నిర్ణయిస్తున్నందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఎంపిక చేసుకున్న బ్రాండ్‌లను బట్టీ కూడా, ధరలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను వినియోగించి, వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కూడా అదనపు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది అందిస్తోన్న ఈ డిస్కౌంట్ సేల్ సమయం ముగింపు దశకు చేరుకోవడంతో కొనుగోలుదారులు త్వరపడాలని కంపెనీ చెబుతోంది. అంతే కాదు, గతంతో పోల్చితే ఈ సేల్ మంచి ఆఫర్‌ను ప్రకటించి, కొనుగోలుదారులను ఆకర్షించినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, మీరు కొత్తగా ఎయిర్ కండిషనర్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ సేల్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దని చెబుతున్నాయి.
ఎయిర్ కండిషనర్‌లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్
ప్రకటన
ప్రకటన