Photo Credit: Amazon
Amazon's Great Indian Festival sale kicks off
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Amazon వార్షిక సేల్ ఈవెంట్ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందడి మొదలైంది. ప్రతి సంవత్సరం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లోని ఇతర కస్టమర్‌ల కంటే ఒక రోజు ముందుగా Amazon ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్ డీల్‌లను వినియోగదారులకు అందిస్తుంది. దీంతో వారికి 24 గంటల ముందే సేల్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న Amazon సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల నుండి గృహోపకరణాల వరకు అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. అంతేకాదు, కస్టమర్‌లు అనేక రకాల ఉత్పత్తులపై అదనపు తగ్గింపును పొందేందుకు లేదా పాత ఉత్పత్తులను మార్పిడి చేసుకునే క్రమంలో వారి కొనుగోళ్ల ధరను తగ్గించడానికి SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
అమెజాన్‌తోపాటు మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజే ప్రారంభమైంది. అయితే, ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రమే ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ గురువారం (సెప్టెంబర్ 27) అర్ధరాత్రి తమ ప్లాట్‌ఫారమ్‌లపై డిస్కౌంట్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులందరికి అవకాశం ఇస్తున్నాయి. ఈ సేల్ సమయంలో కొనుగోలు చేసే ముందు రెండు ప్లాట్‌ఫారమ్‌లలో డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను సరిపోల్చడం అస్సలు మర్చిపోవద్దు.
ఈ Amazonలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Apple నుంచి వచ్చిన iPhone 13 ధర రూ. 41,180గా ఉంది. నిజానికి, దాని వాస్తవ ధర రూ. 59,900. అయితే, ఈ డీల్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే, Honor 200 5G ధర రూ. 34,999కాగా అమెజాన్ సేల్‌లో రూ. 29,999లకు అందుబాటులో ఉంది. గతేడాది లాంచ్ అయన Samsung Galaxy S23 Ultra 5G సేల్‌లో ప్రస్తుత ధర రూ. 74,999గా ప్రకటించారు. కొనుగోలుదారులు అదనంగా రూ. 2000 కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. అదేవిధంగా, Samsung మిడ్‌రేంజ్ Galaxy M35 5G ధర రూ. 19,999 నుండి రూ. 15,999కి తగ్గించబడింది. Galaxy M15 5G రూ. 15,999 నుంచి రూ. 10,999కు లభిస్తోంది.
అమెజాన్ సేల్‌లో ఐప్యాడ్ (10th Generation, 64GB) రూ. 29,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ మన దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేటప్పుడు రూ. 44,900 కాగా, ప్రస్తుత ధర రూ 34,900గా ఉంది. Samsung Galaxy Tab S9 FE మోడల్ రూ. 26,999కు అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర రూ. 34,900. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో వైర్‌లెస్ ఆడియో పరికరాలు, స్మార్ట్ టీవీలు కూడా తగ్గింపు ధరలో వస్తున్నాయి. Samsung యొక్క D-సిరీస్ 43-అంగుళాల 4K LED TV ధర రూ. 36,990 (రూ. 41,990 నుండి తగ్గింది). మరి ఈ ప్రత్యేకమైన డీల్‌లు, డిస్కౌంట్‌లను అస్సలు మిస్ చేసుకోవద్దు.
ప్రకటన
ప్రకటన