Photo Credit: OnePlus
మనదేశంలోని ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌ల కోసం Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే, సెప్టెంబర్ 27న ఉదయం 12 గంటల నుండి మిగిలినవారందరికీ ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. మీరు ఈ పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సేల్ మీకు సరైన వేదిక అవుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మీరు iOS కంటే Androidని ఇష్టపడితే ఈ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్‌లు మీకు ఉపయోగపడతాయి.
తాజా Galaxy S సిరీస్‌లోని మూడు ఫోన్‌లలో మంచి ఆదరణ పొందిన Galaxy S24 Ultra ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. సేల్ సమయంలో దీని ధర రూ. 1,09,999గా నిర్ణయించారు. ఈ మోడల్ అసలు ధర రూ. 1,29,999. ఇది గెలాక్సీ AI ఫీచర్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తాజా iPhone 16 Pro Maxని రూ. 1,44,900కి బదులుగా రూ. 1,43,400లకు, ఐఫోన్ 16 ప్రో మోడల్‌ను రూ. 1,19,900 నుంచి రూ. 1,18,400లకు సొంతం చేసుకోవచ్చు.
Xiaomi 14 అసలు ధర రూ. 69,999కాగా అమెజాన్ సేల్‌లో దీని తగ్గింపు ధర రూ. 47,999గా ఉంది. అలాగే, iQoo 12 5G, Oneplus ఓపెన్ కూడా తగ్గింపు ధరలతో జాబితా ఉన్నాయి. అమెజాన్ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపును అందించడానికి SBI కార్డ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. కొనుగోలుదారులు Amazon Pay-ఆధారిత ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌లతోపాటు కూపన్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో మీరు పొందగలిగే ప్రీమియం హ్యాండ్‌సెట్‌లపై పెద్ద డీల్‌లు ఇక్కడ చూడొచ్చు.
సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల డిస్కౌంట్ వివరాలు..
ప్రకటన
ప్రకటన