Photo Credit: MSI
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తమకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునేవారికి గొప్ప వేదిక అని చెప్పొచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాల లాంటి అనేక వస్తువులపై రకరకాల డిస్కౌంట్, డీల్‌లను అందిస్తోంది. ఈ ప్రొడక్ట్స్‌పై ఎక్కువ ఖర్చు చేయకుండా కొనుగోలుదారులకు సరసమైన ధరలకు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ మీకోసం Amazon సేల్‌లో రూ. 50 వేల నుంచి రూ. లక్షలోపు ధర ఉండే బెస్డ్ బ్రాండెడ్ ల్యాప్‌టాప్ డీల్‌ల లిస్ట్‌ను రూపొందించాం. ఈ జాబితాలో Acer, Asus, Dell, HP లాంటి టాప్ కంపెనీల ల్యాప్‌ట్యాప్‌లు ఉన్నాయి. అలాగే, మీరు PC బిల్డ్‌పై ఎక్కవ మొత్తంలో ఖర్చు చేయకూడదనుకునే గేమర్ అయినా, పవర్‌హౌస్‌గా కూడా ఉండే పోర్టబుల్ ప్రొడక్ట్‌ను కోరుకున్నా ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం రూ. లక్ష లోపు కొన్ని బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై గొప్ప ఆఫర్‌లను ప్రవేశపెట్టింది.
ఈ సేల్‌లో అత్యంత ఆదరణ పొందిన డీల్ MSI Katana A17 గేమింగ్ ల్యాప్‌టాప్ ఆఫర్. దీని మార్కెట్ ధర రూ. 1,29,990గా ఉంది. అయితే తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కేవలం రూ. 86,490లకే అందిస్తోంది. డిస్కౌంట్‌తోపాటు, కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లలో రూ. రూ. 10,000 వరకూ తగ్గింపు పొందొచ్చ. వీటితోపాటు రూ. 5 వేల కూపన్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ఈ సేల్‌లో రూ. 20 వేల వరకూ ఆదాచేసుకోవచ్చు. కొనుగోలుదారులు అమౌంట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకూడదనుకుంటే, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన