Photo Credit: Google tv
ఇండియాలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ ఈ-కామర్స్ దిగ్గజం నూతన సంవత్సరం మొదటి సేల్ సోమవారం నుంచి అందరి వినియోగదారులకు సేల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19న ముగుస్తోంది. ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలతో సహా అనేక ప్రొడక్ట్స్‌పై గొప్ప లాభదాయకమైన డిక్సౌంట్ ఆఫర్‌లను సొంతం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారి కోసం Hisense, శామ్‌సంగ్, Acer, TCL లాంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి డిస్కౌంట్‌లతోపాటు గొప్ప డీల్‌లను పొందొచ్చు.
ఇప్పటికే దేశంలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై అందించే డిస్కౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అందించే డిస్కౌంట్‌లతో పాటు కొనుగోలుదారులు ప్రొడక్ట్స్ ధరను తగ్గించుకునేందుకు అనేక అదనపు డిస్కౌంట్‌లను కూడా పొందొచ్చు. SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 14,000 వరకు కొనుగోలు చేసేవారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు, కొనుగోలుదారులు తాము ప్రస్తుతం వినియోగిస్తున్న వస్తువులను మార్పిడి చేసుకునేందుకు కూడా ఈ సేల్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎక్స్ఛేండ్ ఆలోచనలో ఉన్నవారికి మొత్తంపై అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, మీ వస్తువు ధరతోపాటు దాని ప్రస్తుత పనితీరు ఆధారంగా మార్పిడి విలువను అమెజాన్ నిర్ణయిస్తుందని మర్చిపోవద్దు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025లో రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీలపై అందిస్తోన్న గొప్ప డీల్స్ జాబితాను ఇక్కడ చూడొచ్చు. మరీ ముఖ్యంగా, ఈ డీల్స్ కొనుగోలుదారులను తప్పకుండా ఆకట్టుకుంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
தயாரிப்பின் பெயர் | விலை | விற்பனை விலை | Amazon Link |
---|---|---|---|
Hisense 4K Ultra HD Smart QLED TV | Rs. 79,999 | Rs. 49,999 | Buy Now |
Samsung D Series Crystal 4K TV | Rs. 78,900 | Rs. 49,990 | Buy Now |
Acer XL Series Ultra HD LED TV | Rs. 59,990 | Rs. 49,499 | Buy Now |
TCL 4K Ultra HD Smart QLED Google TV | Rs. 1,19,990 | Rs. 49,490 | Buy Now |
LG 4K Ultra HD Smart LED TV | Rs. 71,990 | Rs. 48,990 | Buy Now |
Xiaomi X Pro QLED Series Smart Google TV | Rs. 70,999 | Rs. 47,999 | Buy Now |
ప్రకటన
ప్రకటన