Photo Credit: Star Health
భారతదేశంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా కంపెనీలలో ఒకటైన స్టార్ హెల్త్‌కు సంబంధించిన కష్టమర్‌ల డెటా చోరీకి గురైనట్లు నిర్థారణ అయింది. చట్టవిరుద్ధంగా సైబర్ నేరగాళ్లు డేటాను యాక్సెస్ చేసినట్లు తెలిసింది. ఈ మొదటిగా సంఘటన గత నెలలో చోటుచేసుకుంది. అయితే, అంతర్గత విచారణకు ముందు ఈ అంశంపై మాట్లాడేందుకు బీమా సంస్థ నిరాకరించింది. తాజాగా కంపెనీ అధికారికంగా క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయడం ద్వారా బీమా సైబర్ సెక్యూరిటీ రెగ్యులేటరీ అధికారులకు తెలియజేసినట్లు తెలిసింది. ముఖ్యంగా, హ్యాకర్లు కంపెనీ డేటాను లీక్ చేయడానికి టెలిగ్రామ్ చాట్‌బాట్‌లను ఉపయోగించారని ఒక నివేదిక తెలిపింది.
కంపెనీ టెక్ క్రంచ్‌కి తెలిపిన దాని ప్రకారం.. వాస్తవానికి డేటా ఉల్లంఘనే లక్ష్యంగా ఈ సంఘటన జరిగింది. అలాగే, సంఘటన జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత దీనిని తాము నిర్థారించినట్లు తెలిపింది. చెన్నైకి చెందిన ఇన్సూరెన్స్ బ్రాంచ్ నుంచి హ్యాకర్లు సున్నితమైన డేటా యాక్సెస్ పొందగలిగారని స్పష్టం చేసింది. అయితే, ఏ విభాగానికి చెందిన కస్టమర్‌ల డేటా లీక్ అయ్యిందన్న వివరాలను వెల్లడించలేదు. ఈ సంఘటనపై ప్రస్తుతం ఫోరెన్సిక్ విచారణ జరుగుతోందని, దీనికి స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులు నాయకత్వం వహిస్తున్నారని స్టార్ హెల్త్ తెలిపింది. దర్యాప్తు సమయంలో ప్రతి దశలోనూ కంపెనీ ప్రభుత్వం, అధికారులతో కలిసి పని చేస్తుందని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ విభాగాలకు సంబంధించిన అధికారులకు కూడా సమాచారం అందించినట్లు పేర్కొంది.
గత నెలలో స్టార్ హెల్త్‌పై సైబర్ ఎటాక్‌తో భారీగా డేటా చోరీకి గురైంది. ఓ నివేదిక ప్రకారం.. 31 మిలియన్ల పాలసీదారుల వ్యక్తిగత డేటాతో పాటు 5.8 మిలియన్లకు పైగా బీమా క్లెయిమ్‌లను సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ద్వారా ఈ డేటా లీక్ అయినట్లు తర్వాత గుర్తించారు. హ్యాకర్లు డేటాను లీక్ చేయడానికి టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లోని చాట్‌బాట్స్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ డేటాలో పేర్లు, ఫోన్ నంబర్‌లు, చిరునామాలు, పన్ను వివరాలు, ID కార్డ్‌ల కాపీలు, పరీక్ష ఫలితాలు, మెడికల్ రిపోర్ట్స్ వంటి సున్నిత సమాచారం ఉన్నట్లు బహిర్ఘతమైయింది.
కొన్ని రోజులకే భారతీయ బీమా సంస్థ కంపెనీ సున్నితమైన డేటాను లీక్ చేయడం సులభతరం చేసినందుకు గానూ టెలిగ్రామ్‌పై దావా వేసింది. భారతదేశంలో డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన ఏవైనా చాట్‌బాట్స్, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఆదేశించింది. దీంతోపాటు ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం క్లౌడ్‌ఫ్లేర్‌పై స్టార్ హెల్త్ కంపెనీ ఫిర్యాదు చేసింది. లీకైన డేటాను హోస్ట్ చేస్తున్న వెబ్‌సైట్‌లకు క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులను అందిస్తున్నట్లు అందులో ఆరోపించింది. గత నెలలోనే వివిధ నేరారోపణలపై టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్‌ని పోలీసులు పారిస్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రకటన
ప్రకటన