Acer : సూపర్ ఫీచర్స్, ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో ఏసర్ ఆస్పైర్ 5 AI లాంచ్, ధర వింటే షాకే

Acer ఏఐ ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకు కంపెనీ ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా 5, అల్ట్రా 7 హెచ్-సిరీస్ ప్రాసెసర్లను వాడింది.

Acer : సూపర్ ఫీచర్స్, ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో  ఏసర్ ఆస్పైర్ 5 AI లాంచ్, ధర వింటే షాకే

Photo Credit: Acer

Acer Aspire 5 AI is offered in a single Silver colourway

ముఖ్యాంశాలు
  • ఏసర్ ఆస్పైర్ 5 AI మోడల్ అధికారికంగా భారత్‌లో విడుదలైంది.
  • బేస్ మోడల్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 (125H) చిప్‌సెట్‌తో వస్తుంది
  • కేవలం 1.2 కిలోల బరువుతో, 17.5mm సన్నని డిజైన్‌తో రూపొందించింది.
ప్రకటన

Acer : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవానే నడుస్తోంది. దీనిని అందిపుచ్చుకుంటూ ప్రముఖ గ్లోబల్ టెక్ బ్రాండ్  ఏసర్ ఇండియాలో ఒక పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి వదిలింది. టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏసర్ ఆస్పైర్ 5 AI మోడల్ అధికారికంగా భారత్‌లో విడుదలైంది. అధునాతన ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లు, విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్+ ఫీచర్ల సపోర్ట్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను అల్ట్రా మోడ్రన్‌గా డిజైన్ చేశారు. ఆఫీస్ వర్క్ చేసుకునే ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు ఇదొక బెస్ట్ ఆప్షన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఈ సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకు కంపెనీ ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా 5, అల్ట్రా 7 హెచ్-సిరీస్ ప్రాసెసర్లను వాడింది. బేస్ మోడల్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 (125H) చిప్‌సెట్‌తో వస్తుంది, దీని బేస్ క్లాక్ స్పీడ్ 3.6GHz కాగా, బూస్ట్ స్పీడ్ ఏకంగా 4.5GHz వరకు ఉంటుంది. మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగడానికి ఇందులో 32GB వరకు భారీ LPDDR5 RAM, ఫైల్స్, వీడియోలను వేగంగా సేవ్ చేసుకోవడానికి 1TB వరకు NVMe SSD స్టోరేజ్‌ను అందించారు. ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉండటం వల్ల చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఎలాంటి లాగ్ లేకుండా సూపర్ స్పీడ్‌తో పనిచేస్తుంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే, ఏసర్ ఆస్పైర్ 5 AI ల్యాప్‌టాప్‌లో 14-ఇంచుల WUXGA IPS డిస్‌ప్లేను అమర్చారు. ఇది 1,920 x 1,200 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో పాటు 16:10 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. ఎక్కువ సమయం ల్యాప్‌టాప్ స్క్రీన్ చూసేవారి కళ్ళు అలసిపోకుండా, స్క్రీన్ నుంచి వచ్చే కాంతి ప్రభావం పడకుండా ఉండేందుకు ఏసర్ కామ్ఫీ వ్యూ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. దీనివల్ల ఎండలో లేదా ఎక్కువ వెలుతురు ఉన్న రూమ్‌లో కూర్చుని వర్క్ చేసినా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.

ఈ రోజుల్లో ఆన్‌లైన్ మీటింగ్‌లు, వర్చువల్ క్లాసులు ఎక్కువైపోయాయి. అందుకే ఏసర్ ఈ ల్యాప్‌టాప్‌లో ఫుల్ హెచ్‌డీ  వెబ్‌క్యామ్‌ను జత చేసింది. దీనితో పాటు ల్యాప్‌టాప్ వాడనప్పుడు కెమెరాను ఫిజికల్‌గా లాక్ చేసుకునేందుకు ఒక ప్రైవసీ షట్టర్‎ను కూడా ఇచ్చారు. దీనివల్ల హ్యాకర్లు మీ కెమెరాను హ్యాక్ చేసినా మీ వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాగే వాయిస్ స్పష్టంగా వినబడటానికి బిల్ట్-ఇన్ మైక్రోఫోన్లు, మంచి ఆడియో క్వాలిటీ కోసం హెచ్‌డీ ఆడియో సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అమర్చారు.

ట్రావెలింగ్ చేస్తూ వర్క్ చేసుకునే వారి కోసం ఏసర్ ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం 1.2 కిలోల బరువుతో, 17.5mm సన్నని డిజైన్‌తో రూపొందించింది. ఇందులో 53.8Wh లిథియం-అయాన్ బ్యాటరీని వాడారు, ఇది ఎక్కువ సమయం బ్యాకప్ ఇస్తుంది. కారులో లేదా ఆఫీసులో ఎక్కడైనా ఈజీగా ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 65W యూఎస్‌బీ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఏకంగా 180 డిగ్రీల వరకు వెనక్కి వంచవచ్చు. కీబోర్డ్‌లో రాత్రి పూట కూడా టైప్ చేసుకునేందుకు వీలుగా బ్యాక్‌లిట్ ఫీచర్,  కోపైలట్ కోసం ఒక ప్రత్యేకమైన ఏఐ కీని కూడా అమర్చారు.

కనెక్టివిటీ పరంగా ఈ ల్యాప్‌టాప్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్ కోసం వై-ఫై 6, బ్లూటూత్ 5.1 సపోర్ట్ ఉన్నాయి. డేటా ట్రాన్స్‌ఫర్ కోసం రెండు USB 3.2 Gen 1 టైప్-సి పోర్టులు (ఇందులో ఒకటి ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది), మూడు USB 3.2 టైప్-ఏ పోర్టులు, ఒక HDMI పోర్ట్, కెమెరా మెమొరీ కార్డ్ కోసం ఎస్‌డీ కార్డ్ రీడర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, భద్రత కోసం కెన్సింగ్టన్ లాక్ స్లాట్‌ను కూడా అందించారు. కంపెనీ దీనితో పాటు వన్-ఇయర్ క్యారీ-ఇన్ వారంటీని ఇస్తోంది.

భారతదేశంలో ఈ సరికొత్త ఏసర్ ఆస్పైర్ 5 AI ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.79,999గా కంపెనీ ప్రెస్ నోట్‌లో ప్రకటించింది. ప్రస్తుతానికి ఇది క్లాసిక్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను కొనాలనుకునే వారు ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఏసర్ ఇండియా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఇండియా, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి ప్రముఖ ఈ-కామర్స్, రీటైల్ అవుట్‌లెట్లలో సొంతం చేసుకోవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »