Amazon Smartchoice Days Sale June 2026: ఇంటెల్ కోర్ సెలెరాన్ N4500 ప్రాసెసర్‌తో వచ్చే ఏసర్ ఆస్పైర్ వన్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.55,999 కాగా.. ఈ సేల్‌లో ఏకంగా రూ.35,990కే లభిస్తోంది.
Samsung Galaxy Tab S10 Lite features an Exynos 1380 SoC
Huge discount on Laptops, Tablets in Amazon Smartchoice Days Sale June 2026: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు అమెజాన్ ఇండియా మరోసారి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. జూన్ 9న ముగిసిన మెగా డీల్ డేస్ సేల్ తర్వాత.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా జూన్ 11 నుంచి అమెజాన్ స్మార్ట్‌చాయిస్ డేస్ సేల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఈ సేల్ ఈ వారం జూన్ 18వ తేదీతో ముగియనుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొత్త ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ మొత్తంలో డబ్బు ఆదా చేసుకునే అవకాశం లభిస్తోంది. కంపెనీ నేరుగా ధరలను తగ్గించడమే కాకుండా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికైతే అదనంగా మరో 5 శాతం వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ లభిస్తుంది.
ఏసర్ ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు..
ఈ సేల్‌లో బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్ ఆశించే వారి కోసం ఏసర్ బ్రాండ్ పై మైండ్ బ్లాకింగ్ ఆఫర్లు ఉన్నాయి. ఇంటెల్ కోర్ సెలెరాన్ N4500 ప్రాసెసర్‌తో వచ్చే ఏసర్ ఆస్పైర్ వన్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.55,999 కాగా.. ఈ సేల్‌లో ఏకంగా రూ.35,990కే లభిస్తోంది. అలాగే మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఏఎమ్‌డీ రైజెన్ 3 ప్రాసెసర్ మోడల్ పై ఏకంగా రూ.32,000 భారీ ప్రైస్ కట్ లభించింది. రూ.71,999 ఎంఆర్‌పీ ఉన్న ఈ రైజెన్ మోడల్ ల్యాప్‌టాప్‌ను కస్టమర్లు ప్రస్తుతం కేవలం రూ.39,990 కే సొంతం చేసుకోవచ్చు.
ఆసుస్ మరియు హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు..
ఆసుస్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లను ఇష్టపడే వారి కోసం సరికొత్త ఆసుస్ క్రోమ్‌బుక్ CX1405 (2026) మోడల్ పై మంచి డీల్ అందుబాటులో ఉంది. దీని సాధారణ ధర రూ.51,990 కాగా, సేల్‌లో భాగంగా దీనిని రూ.36,990 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇంటెల్ కోర్ i5 14th జనరేషన్ ప్రాసెసర్‌తో వచ్చే ప్రీమియం ఆసుస్ వివోబుక్ S16 మోడల్ రూ.2,000 తగ్గింపుతో రూ.66,990 కి లిస్ట్ అయింది. మరోవైపు, హెవీ గేమింగ్, కోడింగ్ కోసం చూసే వారి కోసం హెచ్‌పీ విక్టస్ (Intel Core i5 14th Gen) ల్యాప్‌టాప్ పై ఏకంగా రూ.12,000 వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,01,199 విలువైన ఈ హెచ్‌పీ గేమింగ్ ల్యాప్‌టాప్ ప్రస్తుతం రూ.89,990 ధరకే అందుబాటులో ఉంది.
![]()
Photo Credit: Screenshot/ Amazon
టాప్ బ్రాండెడ్ టాబ్లెట్‌లపై క్రేజీ డీల్స్..
ల్యాప్‌టాప్‌లతో పాటు ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగపడే టాబ్లెట్‌లపై కూడా అమెజాన్ సూపర్ ఆఫర్లను ప్రైస్ కట్ రూపంలో అందిస్తోంది. ఇందులో భాగంగా లెనోవో ఐడియా టాబ్ అసలు ధర రూ.28,000 నుంచి తగ్గి ప్రస్తుతం రూ.26,998కే లభిస్తోంది. అలాగే మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న షావోమి ప్యాడ్ 8 టాబ్లెట్ రూ.42,999 ధర నుంచి తగ్గి ప్రస్తుతం రూ.40,999కే సేల్‌లో అందుబాటులో ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ పై బంపర్ డిస్కౌంట్..
ఇక అందరినీ ఆకట్టుకుంటున్న లగ్జరీ ఆఫర్ సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వచ్చింది. ప్రీమియం ఫీచర్లతో మెరిసిపోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S10 లైట్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. మార్కెట్లో దీని అసలు ధర రూ.41,999 కాగా, ఈ స్మార్ట్‌చాయిస్ డేస్ సేల్‌లో భాగంగా వినియోగదారులు దీనిని రూ.36,649 కే దక్కించుకోవచ్చు. పైన పేర్కొన్న సేల్ ధరలన్నీ కేవలం డైరెక్ట్ డిస్కౌంట్లు మాత్రమేనని, కస్టమర్లు పేమెంట్ చేసే సమయంలో బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే అదనపు క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లతో ధర ఇంకా తగ్గుతుందని అమెజాన్ స్పష్టం చేసింది. జూన్ 18 లోపు కొనుగోలు చేసి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Grand Theft Auto 6's Multiplayer Mode Will Launch Next Year, Says Twitch CEO