Asus : గేమర్లకు పూనకాలే.. మార్కెట్లోకి అసూస్ ఆల్ఫా రేంజ్ గాడ్జెట్స్

గేమర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ కార్డ్ (GPU), మదర్‌బోర్డ్, మోడ్యులర్ పీసీ కేస్‌లతో ఈ లైనప్‌ను డిజైన్ చేశారు.

Asus :  గేమర్లకు పూనకాలే.. మార్కెట్లోకి అసూస్ ఆల్ఫా రేంజ్ గాడ్జెట్స్
ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి అసూస్ ఆల్ఫా రేంజ్ గాడ్జెట్స్
  • గేమర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ కార్డ్
  • బ్లాక్ అండ్ గోల్డ్ లుక్‌లో సరికొత్త మదర్‌బోర్డ్
ప్రకటన

Asus :  గేమింగ్ ప్రపంచంలో ఎవరికీ అందనంత క్రేజ్ ఉన్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది అసూస్ సంస్థకు చెందిన  రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్(ROG) సిరీస్ మాత్రమే. 2006లో ప్రారంభమైన ఈ ప్రత్యేక గేమింగ్ లైనప్ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని తైవాన్ టెక్ దిగ్గజం అసూస్.. తైపీలో జరగబోయే కంప్యూటెక్ 2026 ఈవెంట్‌కు ముందే  ఆర్‌ఓజీ ఎడిషన్ 20 పేరిట ఒక మోస్ట్ పవర్‌ఫుల్ స్పెషల్ సిరీస్‌ను సోమవారం నాడు ఆవిష్కరించింది. గేమర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ కార్డ్ (GPU), మదర్‌బోర్డ్, మోడ్యులర్ పీసీ కేస్‌లతో ఈ లైనప్‌ను డిజైన్ చేశారు.  

బ్లాక్ అండ్ గోల్డ్ లుక్‌లో సరికొత్త మదర్‌బోర్డ్ 
ఈ స్పెషల్ ఎడిషన్ 20 లైనప్‌లో భాగంగా అసూస్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మదర్‌బోర్డ్ ఆర్‌ఓజీ క్రాస్‌హెయిర్ X870E ఎడిషన్ 20ను ప్రదర్శించింది. ఈ మదర్‌బోర్డ్‌లో ఇంటిగ్రేటెడ్ ఏఐఓ కూలింగ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. ఇందులో ఉండే ఆర్‌ఓజీ ర్యూజిన్ ఎడిషన్ 20 కూలింగ్ సొల్యూషన్, ఫుల్-విడ్త్ థర్మల్ డెక్.. సీపీయూతో పాటు వీఆర్‌ఎమ్ ఉష్ణోగ్రతలను కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా, దీనికి అదనంగా Asetek EMMA Gen10 V3Rx పంప్, డ్యూయల్ 6.67-ఇంచుల ఎల్‌సీడీ స్క్రీన్ సెటప్‌ను కూడా జతచేశారు.

రాక్షస శక్తి లాంటి ఆర్టీఎక్స్ 5090 జీపీయూ 
గేమింగ్‌లో గ్రాఫిక్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించేందుకు అసూస్ సంస్థ ఆర్‌ఓజీ ఆస్ట్రల్ జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5090 ఎడిషన్ 20 ఫ్లాగ్‌షిప్ జీపీయూను మార్కెట్లోకి తెచ్చింది. ఈ గ్రాఫిక్స్ కార్డ్‌లో నాలుగు ఫ్యాన్ల  ప్రత్యేక డిజైన్‌ను ఇచ్చారు. దీనివల్ల మునుపటి కంటే ఏకంగా 20 శాతం అదనపు ఎయిర్‌ఫ్లో, ప్రెజర్‌ను అందిస్తూ సిస్టమ్ అస్సలు హీట్ అవ్వకుండా కాపాడుతుంది.

నాలుగు గ్రాఫిక్స్ కార్ల రన్ చేసే పవర్ సప్లై  
ఈ రేంజ్ హెవీ సిస్టమ్ నడవాలంటే పవర్ కూడా అంతే రేంజ్‌లో ఉండాలి కదా! అందుకే అసూస్ ఆర్‌ఓజీ థోర్ 3000W టైటానియం III ఎడిషన్ 20 పవర్ సప్లై యూనిట్‌ను తీసుకొచ్చింది. ఇందులో సర్వర్-గ్రేడ్ GaN MOSFET భాగాలను వాడారు. దీని పవర్ కెపాసిటీ ఎంతంటే.. ఏకంగా నాలుగు ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5090 గ్రాఫిక్స్ కార్డులను ఒకేసారి ఒకే సిస్టమ్‌లో రన్ చేయగలదు. దీనితో పాటు సిస్టమ్ బిల్డింగ్ కోసం  ఆర్‌ఓజీ జీఆర్20 ఎడిషన్ 20 అనే సరికొత్త మోడ్యులర్ పీసీ కేస్‌ను కూడా ఆవిష్కరించారు.

మినీ డెస్క్‌టాప్ ఆర్‌ఓజీ ఎన్‌యూసీ 16 
కంప్లీట్ ప్యాకేజీని కోరుకునే గేమర్ల కోసం అసూస్  ఆర్‌ఓజీ ఎన్‌యూసీ 16 ఎడిషన్ 20 అనే మినీ డెస్క్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇది సెమీ ట్రాన్స్‌పరెంట్ బ్లాక్ బాడీ, గోల్డ్ కలర్ టచ్‌తో లగ్జరీ లుక్‌లో ఉంటుంది. ఇందులో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5090 జీపీయూ ఉండటమే కాకుండా ఇది 'DLSS 4.5' టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. క్వైట్‌ఫ్లో కూలింగ్ సిస్టమ్ వల్ల 300 వాట్ల వరకు సీపీయూ, జీపీయూల వేడిని క్షణాల్లో తగ్గించేస్తుంది. ఈ చిన్న డెస్క్‌టాప్ సాయంతో ఒకేసారి ఐదు 4K మానిటర్లను కనెక్ట్ చేసి వాడుకోవచ్చు.

ఈ సిరీస్‌లో మరికొన్ని అద్భుతమైన గాడ్జెట్స్ 
ఈ 20 ఏళ్ల పండగ సెలబ్రేషన్స్‌లో భాగంగా అసూస్ మరికొన్ని స్మార్ట్ గాడ్జెట్లను కూడా పరిచయం చేసింది.  ఆర్‌ఓజీ జీ1000 ఎడిషన్ 20 డెస్క్‌టాప్, ఆర్‌ఓజీ స్విఫ్ట్ ఓఎల్ఈడీ PG27AQWP-G ఎడిషన్ 20 గేమింగ్ మానిటర్, అలాగే ఇంటర్నెట్ స్పీడ్ కోసం క్వాడ్-బ్యాండ్ వై-ఫై 7 గేమింగ్ రూటర్  ఆర్‌ఓజీ రాప్చర్ GT-BE98 ప్రో ఎడిషన్ 20లను లాంచ్ చేసింది. వీటితో పాటు బ్యాక్‌లిట్ మెకానికల్ కీబో ఆర్‌ఓజీ అజోత్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ 20ని కూడా తీసుకువచ్చింది.

హ్యాండ్‌హెల్డ్ లవర్స్ కోసం ఎక్స్‌బాక్స్ బండిల్ 
చివరగా మొబైల్ గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఆర్‌ఓజీ ఎక్స్‌బాక్స్ అల్లీ X20 బండిల్ను అసూస్ ప్రదర్శించింది. ఈ హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ డివైజ్‌తో పాటు  ఆర్‌ఓజీ ఎక్స్‌రియల్ R1 ఎడిషన్ 20 గేమింగ్ ఏఆర్ గ్లాసెస్ కూడా లభిస్తాయి. ఈ ఎడిషన్ 20 లైనప్‌లోని అన్ని ప్రొడక్టులు కూడా ఆర్‌ఓజీ బ్లాక్ కలర్ థీమ్‌తో వస్తూ, అక్కడక్కడా ఆర్‌ఓజీ రెడ్, క్రిస్టల్ లెన్స్, రేడియంట్ గోల్డ్ కలర్ లైటింగ్‌తో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »