Lenovo : భారత మార్కెట్లోకి లెనోవో సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్.. ఐడియాప్యాడ్ స్లిమ్ 3 లాంచ్!

Lenovo IdeaPad Slim 3 Gen 11 ప్రీమియం ల్యాప్‌టాప్ ప్రారంభ ధరను రూ.1,09,900గా కంపెనీ నిర్ణయించింది.

Lenovo  : భారత మార్కెట్లోకి లెనోవో సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్.. ఐడియాప్యాడ్ స్లిమ్ 3 లాంచ్!

Photo Credit: Lenovo

Lenovo

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి లెనోవో సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్
  • ఇంటెల్ కోర్ ఆల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌తో నెక్స్ట్ లెవెల్ స్పీడ్
  • లాంచ్ ఆఫర్ కింద రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్
ప్రకటన

Lenovo  : ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జనరేషన్ 11 పేరుతో లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్.. పవర్‌ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రూపొందించబడింది. ఆఫీస్ ఉద్యోగులు, క్రియేటర్లు, హెవీ టాస్కులు చేసే యూజర్లను టార్గెట్ చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీతో లెనోవో ఈ నయా డివైజ్‌ను రంగంలోకి దించింది. ఇది సరికొత్త విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

ధరల వివరాలు, అదిరిపోయే లాంచ్ ఆఫర్లు
ధర విషయానికి వస్తే.. ఈ ప్రీమియం ల్యాప్‌టాప్ ప్రారంభ ధరను రూ.1,09,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం లెనోవో ఒక క్రేజీ ఆప్షన్‌ను ఇస్తోంది. యూజర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా రామ్, స్టోరేజ్ వంటి కాన్ఫిగరేషన్‌ను లెనోవో అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వయంగా ఎంచుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు భారం పడకుండా ఉండేందుకు 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ క్లాసిక్ లూనా గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

కళ్లకు రక్షణగా టీయూవీ సర్టిఫికేషన్
లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జనరేషన్ 11 ల్యాప్‌టాప్ 14 ఇంచులు, 15 ఇంచుల రెండు వేర్వేరు డిస్‌ప్లే సైజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండు స్క్రీన్లు కూడా 16:10 యాస్పెక్ట్ రేషియోతో పాటు ఎండలో లేదా వెలుతురులో స్పష్టంగా కనిపించేలా 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తాయి. ల్యాప్‌టాప్ చుట్టూ అల్ట్రా స్లిమ్ బెజెల్స్ ఉండటం వల్ల ఏకంగా 90 శాతం యాక్టివ్ ఏరియా రేషియో లభిస్తుందని లెనోవో స్పష్టం చేసింది. ఎక్కువ సమయం స్క్రీన్ చూసేవారి కళ్లకు హాని జరగకుండా ఉండేందుకు ఇందులో లో బ్లూ లైట్ ఎమిషన్ TUV Rheinland సర్టిఫికేషన్‌ను అందించారు.

Xiaomi 17T : ఆండ్రాయిడ్ 16.. హైపర్‌ఓఎస్ 3.. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో షావోమి 17T

ఇంటెల్ కోర్ ఆల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్,  కోపైలట్ ప్లస్ పవర్
పర్ఫార్మెన్స్ పరంగా ఈ ల్యాప్‌టాప్ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇందులో సరికొత్త ఇంటెల్ కోర్ ఆల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ కార్డ్‌ను అమర్చారు. ఈ ల్యాప్‌టాప్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ ఏఐ సామర్థ్యాలతో వస్తుంది. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రోజువారీ ఆఫీస్ పనులు, కోడింగ్, వీడియో ఎడిటింగ్ వంటి కఠినమైన పనులను చాలా స్మార్ట్‌గా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.

వీడియో కాల్స్ కోసం ప్రత్యేక ఐఆర్ కెమెరా
మెమొరీ విషయానికి వస్తే, ఇందులో 16 GB వరకు భారీ రామ్, డేటా దాచుకోవడానికి 512 GB వరకు ఎస్ఎస్‌డీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. ఇక ఆఫీస్ మీటింగులు, వీడియో కాల్స్ కోసం ఇందులో హై-క్లారిటీ ఇచ్చే FHD IR కెమెరాను అమర్చారు. ఇది ఫేస్ రికగ్నిషన్ ద్వారా ల్యాప్‌టాప్ అన్‌లాక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కనెక్టివిటీ పరంగా ఇందులో బ్లూటూత్, వై-ఫై, హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్, యూఎస్‌బీ టైప్-ఏ పోర్ట్లు, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5 mm ఆడియో జాక్ వంటి అన్ని రకాల అవసరమైన ఆప్షన్లను ఇచ్చారు.

రాపిడ్ ఛార్జ్ బూస్ట్.. నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్
ఈ ల్యాప్‌టాప్‌లో 60 Wh సామర్థ్యం గల పటిష్టమైన బ్యాటరీని లెనోవో అందించింది. ఇది రాపిడ్ ఛార్జ్ బూస్ట్ అనే అడ్వాన్స్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల పాటు ఈ ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా రెండు గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చని లెనోవో గర్వంగా చెప్తోంది. దీనివల్ల అర్జంట్‌గా బయటికి వెళ్లేటప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ టెన్షన్ అస్సలు ఉండదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »