Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం

లెనోవో లెజియన్ 27-1ఆర్ మానిటర్‌ను కంపెనీ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది.

Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం

Photo Credit: Lenovo

Lenovo Legion 27-1r

ముఖ్యాంశాలు
  • గేమర్స్‌కు మైండ్ బ్లోయింగ్ న్యూస్
  • లెనోవో నుంచి 'లెజియన్ 27-1ఆర్' గేమింగ్ మానిటర్ లాంచ్
  • హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో గేమింగ్ ప్రపంచంలో సరికొత్త అధ్యాయం
ప్రకటన

Lenovo Legion 27-1r : గేమింగ్ లవర్స్‎ను ఆకట్టుకునేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో మార్కెట్‌లోకి ఒక సూపర్ బడ్జెట్ గేమింగ్ మానిటర్ తీసుకొచ్చింది. లెనోవో లెజియన్ 27-1ఆర్ పేరుతో దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పేరులోనే ఉన్నట్లుగా ఇది 27 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. బడ్జెట్ ధరలోనే లభించే ఈ మానిటర్‌లో ఏకంగా 280Hz రిఫ్రెష్ రేట్‌ను అందించడం విశేషం. హెవీ గేమింగ్ ఆడేవారికి, కంటికి శ్రమ తగ్గించే ఫీచర్లతో పాటు ఆకట్టుకునే డిజైన్‌తో ఈ డివైజ్ అందుబాటులోకి వచ్చింది.

ధర ఎంత? ఎక్కడ కొనుగోలు చేయవచ్చు ? 
ధర విషయానికి వస్తే.. లెనోవో లెజియన్ 27-1ఆర్ మానిటర్‌ను కంపెనీ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. అక్కడ దీని ధరను 789 యువాన్లుగా నిర్ణయించారు. మన భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.11,000 వరకు ఉంటుంది. చైనాలోని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ జేడీ.కామ్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే ఇది భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

డిస్‌ప్లే క్వాలిటీ, స్మూత్ గేమింగ్ పెర్ఫార్మెన్స్
ఈ మానిటర్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 1920 x 1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన 27 అంగుళాల ఐపీఎస్ ప్యానెల్‌ను అమర్చారు. గేమింగ్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా ఉండటానికి 280Hz రిఫ్రెష్ రేట్, 0.5ms MPRT రెస్పాన్స్ టైమ్‌ను అందించారు. అంతేకాకుండా స్క్రీన్ టెరింగ్ తగ్గించి, గేమ్‌ప్లేను ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఉంచడానికి VESA AdaptiveSync, ఎన్‌విడియా జీ-సింక్  సపోర్టును కూడా ఇందులో అందించారు.   

Redmi 17 4G : మార్కెట్‌లోకి రెడ్‌మీ 17 4జి.. లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్లు

కలర్ డెప్త్, ఐ-సేఫ్ సేఫ్టీ ఫీచర్స్  
కలర్స్ మరియు బ్రైట్‌నెస్‌ విషయానికొస్తే.. ఈ ఐపీఎస్ ప్యానెల్ 99% sRGB కలర్ స్పేస్‌ను కవర్ చేస్తుంది. ఇది 400 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 8-బిట్ కలర్ డెప్త్‌తో ఏకంగా 16.7 మిలియన్ రంగులకు సపోర్ట్ ఇస్తుంది. గేమర్స్ గంటల తరబడి స్క్రీన్ వైపు చూసినా కళ్లు అలసిపోకుండా ఉండేందుకు EyeSafe 2.0లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కూడా ఇందులో ఇచ్చారు. ఇది హానికరమైన బ్లూ లైట్ ప్రభావం నుండి కళ్లను కాపాడుతుంది.

కనెక్టివిటీ పోర్టులు, డిజైన్ సౌకర్యం
కనెక్టివిటీ కోసం ఇందులో ఒక డిస్‌ప్లే పోర్ట్ 1.4తో పాటు రెండు హెచ్‌డీఎంఐ 2.1 ఇన్ పుట్ పోర్టులను అందించారు. అయితే 280Hz రిఫ్రెష్ రేట్ నిరంతరంగా పొందాలంటే మానిటర్‌ను తప్పనిసరిగా డిస్‌ప్లే పోర్ట్‌ ద్వారానే కనెక్ట్ చేయాల్సి ఉంటుందని, హెచ్‌డీఎంఐ ద్వారా కనెక్ట్ చేస్తే రిఫ్రెష్ రేట్ 240Hz వరకు పరిమితమవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక అడ్జస్టబుల్ స్టాండ్‌తో పాటు 100 x 100mm VESA మౌంట్‌ సదుపాయం ఉండడం వల్ల దీనిని సులభంగా గోడకు కూడా తగిలించుకోవచ్చు.  

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »