భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన OnePlus 13, OnePlus 13R.. ధ‌ర ఎంతంటే

గత ఏడాది అక్టోబర్‌లో OnePlus 13 చైనాలో లాంచ్ అయ్యింది. బ్రాండ్-న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్ ఫోన్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది

భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన OnePlus 13, OnePlus 13R.. ధ‌ర ఎంతంటే

Photo Credit: OnePlus

OnePlus 13 సిరీస్‌లో 6,000mAh బ్యాటరీలు 100W వరకు ఛార్జింగ్‌కు మద్దతునిస్తాయి

ముఖ్యాంశాలు
  • OnePlus 13 సిరీస్ ఆక్సిజన్ OS 15.0తో Android 15లో ర‌న్ అవుతోంది
  • OnePlus 13R ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు
  • OnePlus 13R ఫోన్‌ OnePlus Ace 5 గ్లోబల్ వెర్షన్‌గా క‌నిపిస్తోంది
ప్రకటన

OnePlus 13, OnePlus 13R హ్యాండ్‌సెట్‌లు భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి విడుద‌ల‌య్యాయి. తాజా ఈ OnePlus స్మార్ట్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌తోపాటు 100W వరకు ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6,000mAh సామ‌ర్థ్యం ఉన్న భారీ బ్యాటరీతో అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ రెండు మోడ‌ల్స్‌ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ వెనుక కెమెరా యూనిట్లను కలిగి ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో OnePlus 13 చైనాలో లాంచ్ అయ్యింది. బ్రాండ్-న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్ ఫోన్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. OnePlus 13R ఫోన్‌ OnePlus Ace 5 గ్లోబల్ వెర్షన్‌గా క‌నిపిస్తోంది.

మ‌న దేశీయ మార్కెట్‌లో

OnePlus 13 ప్రారంభ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 69,999గా నిర్ణ‌యించారు. అలాగే, 16GB RAM + 512GB, 24GB + 1TB వేరియంట్‌ల ధర వ‌రుస‌గా రూ. 76,999, రూ. 86,999గా ఉన్నాయి. ఇది ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్‌తోపాటు మిడ్‌నైట్ ఓషన్ షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. OnePlus 13R ఫోన్‌ 12GB+256GB వెర్షన్ ధ‌ర రూ. 42,999, 16GB+512GB మోడల్ ధ‌ర రూ. 49,999గా ఉన్నాయి. ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ కలర్ ఆప్షన్‌ల‌లో అందుబాటులో ఉన్నాయి.

OnePlus 13 స్పెసిఫికేష‌న్స్‌

డ్యూయల్-సిమ్ (నానో)తో OnePlus 13 Android 15-ఆధారిత ఆక్సిజన్‌OS 15.0పై ర‌న్ అవుతోంది. అలాగే, 6.82-అంగుళాల క్వాడ్-HD+ (1,440x3,168 పిక్సెల్‌లు) LTPO 4.1 ProXDR డిస్‌ప్లేతో వ‌స్తోంది. దీని డిస్‌ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్, సిరామిక్ గార్డ్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఇది 1TB వరకు UFS 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజీని అందిస్తోంది. ఇది Hasselblad-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వ‌స్తుంది. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 కెమెరాతోపాటు ఫోన్‌లో అలర్ట్ స్లైడర్‌ను అమ‌ర్చారు. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వ‌స్తుంది. అలాగే, నాయిస్ క్యాన్సిలేషన్, ORReality ఆడియో సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. 162.9x76.5x8.9mm ప‌రిమాణంతో 213 గ్రాముల బ‌రువు ఉంటుంది.

OnePlus 13R స్పెసిఫికేష‌న్స్‌

డ్యూయల్-సిమ్ (నానో)తో OnePlus 13R ఆండ్రాయిడ్ 15లో ఆక్సిజన్ OS 15.0తో ర‌న్ అవుతుంది. 93.9 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 450ppi పిక్సెల్ టుడెన్సిటీ పిక్సెల్‌తో 6.78-అంగుళాల ఫుల్‌-HD+ (1,264x2,780 పిక్సెల్‌లు) LTPO డిస్‌ప్లేతో వ‌స్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొట‌క్ష‌న్‌తో వ‌స్తుంది. ఇది అండ‌ర్ ది హుడ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస‌ర్‌తో గరిష్టంగా 16GB RAM, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయ‌బ‌డింది. OIS స‌పోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony LYT-700 1/1.56-అంగుళాల ప్రైమరీ సెన్సార్ క‌లిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం దీనికి ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తోపాటు అలెర్ట్‌ స్లయిడర్‌తో వ‌స్తుంది. 161.72x75.8x8.02mm ప‌రిమాణంతో 206 గ్రాముల బరువు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »