వన్‌ప్లస్ 15 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను సేల్ సమయంలో రూ.81,999కి కొనుగోలు చేయవచ్చు.
Photo Credit: OnePlus
Amazon Great Freedom Sale 2026
Amazon Great Freedom Sale : మీరు వన్‌ప్లస్ సంస్థకు చెందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా ఈ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను ఈ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఇటీవల మెమొరీ కాస్ట్ పెరిగిందనే కారణంతో కంపెనీ ఈ ఫోన్ ధరను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమెజాన్ సేల్‌లో లభించే బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో ఈ ఫోన్‌ను గతంలో కంటే తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చని అమెజాన్ విడుదల చేసిన టీజర్ ద్వారా వెల్లడైంది.
ఎఫెక్టివ్ ధర, బ్యాంక్ ఆఫర్ల వివరాలు
అమేజాన్ టీజర్ సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 15 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను సేల్ సమయంలో రూ.81,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుత MRP ధర రూ.89,999 కాగా, బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించడం ద్వారా కొనుగోలుదారులు ఏకంగా రూ.8,000 వరకు ఆదా చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈజీ ఈఎమ్‌ఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వీటితో పాటు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
డిస్‌ప్లే, ప్రాసెసర్ పర్ఫామెన్స్
వన్‌ప్లస్ 15 ఫోన్‌లో 6.78 ఇంచుల FHD+ (1,272x2,772 పిక్సెల్స్) 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1Hz నుంచి 165Hz మధ్య మారే రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. బిఓఈకి చెందిన ఫ్లెక్సిబుల్ ఓరియంటల్ OLED ప్యానెల్‌తో వచ్చే ఈ స్క్రీన్ 330Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 100 శాతం DCI-P3 కలర్ గ్యామట్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, అత్యంత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
itel Ace 3 Heera : కేవలం రూ.949లకే టైప్-సి ఛార్జింగ్ ఫోన్.. ఐటెల్ ఏస్ 3 హీరా మోడల్ లాంచ్
కెమెరా క్వాలిటీ, వీడియో రికార్డింగ్
ఈ ఫోన్‌లో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో f/1.8 అపర్చర్, ఓఐఎస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, f/1.8 అపర్చర్, OIS సపోర్ట్, 3.5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, f/2.0 అపర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ప్రముఖ హ్యాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన ఈ కెమెరా సిస్టమ్ ద్వారా 8K రెజల్యూషన్ వరకు వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
భారీ బ్యాటరీ, ఇతర ఫీచర్లు
వన్‌ప్లస్ 15 మోడల్‌లో 7,300mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మ్యాగ్నెట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్‌లో సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఆల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్‌ఎఫ్‌సి, స్టీరియో స్పీకర్లు అందించబడ్డాయి. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 161.42x76.67x8.10 mm కాగా బరువు 211 గ్రాములుగా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch