Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 20 వేల లోపే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్

అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కి లిస్ట్ అయింది.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 20 వేల లోపే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్

Photo Credit: OnePlus

OnePlus N6x

ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా
  • వన్‌ప్లస్ N6x పై భారీ డిస్కౌంట్
  • 7,000mAh బ్యాటరీ, HDFC బ్యాంక్ ఆఫర్‌తో తక్కువ ధరకే!
ప్రకటన

Amazon Great Freedom Sale: మీరు రూ. 20,000 బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఇదే బెస్ట్ టైం. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఫ్రీడమ్ సేల్‎లో వన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నేరుగా లభించే ప్రైస్ కట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ N6x ధర, బ్యాంక్ ఆఫర్లు 
అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు చేసే కస్టమర్లకు 10 శాతం (గరిష్టంగా రూ. 1,250 వరకు) ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ వర్తించిన తర్వాత ఈ ఫోన్ ఎఫెక్టివ్ రేటు రూ. 17,749కి తగ్గుతుంది.

వన్‌ప్లస్ N6x డిస్‌ప్లే, ప్రాసెసర్ 
ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల HD+ LCD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 720x1570 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్ 4GB RAM తో పాటు 64GB, 128GB ఇన్-బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో వేడిని తగ్గించడానికి ఇందులో 13,280 sq mm హీట్ డిస్సిపేషన్ ఏరియాతో వేపర్ చాంబర్ కూలింగ్ సొల్యూషన్ కూడా అందించారు. ఇది MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో రావడం విశేషం.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా రూ. 2,000 బడ్జెట్‌లోనే బెస్ట్ ఇయర్ బడ్స్

కెమెరా, బిగ్ బ్యాటరీ ఫీచర్లు 
కెమెరా సెటప్ గురించి పరిశీలిస్తే.. వన్‌ప్లస్ N6x వెనుక భాగంలో f/2.2 అపెర్చర్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.2 అపెర్చర్‌తో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 7,000mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీ ఉంది. ఇది 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ కొలతల విషయానికొస్తే 166.38 mm పొడవు, 78.13 mm వెడల్పు, 8.65 mm మందం కలిగి ఉండి, సుమారు 214 గ్రాముల బరువు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »