Amazon : అమెజాన్ సమ్మర్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.15 వేల వరకు డిస్కౌంట్

ఈ భారీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు వివిధ గృహోపకరణాలపై ఐదు శాతం నుంచి ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.

Amazon : అమెజాన్ సమ్మర్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.15 వేల వరకు డిస్కౌంట్

The Amazon Great Summer Sale lists various OnePlus smartphones at a discounted price

ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఫోన్ల పై భారీ డిస్కౌంట్
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు కంపెనీ ప్రత్యేక ఆఫర్
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వసతులు, ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్
ప్రకటన

Amazon : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి కాలం సందర్భంగా నిర్వహిస్తున్న సరికొత్త షాపింగ్ జాతర అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రస్తుతం వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం ఫోన్లపై భారీగా ధరలు తగ్గాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అదిరిపోయే డిస్‌ప్లే ఉన్న వన్‌ప్లస్ మొబైల్స్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక సువర్ణావకాశం.

మే 8వ తేదీ నుంచి వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ భారీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు వివిధ గృహోపకరణాలపై ఐదు శాతం నుండి ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. కేవలం ఫ్లాట్ డిస్కౌంట్లే కాకుండా అదనపు పొదుపు కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు కంపెనీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.9,500 వరకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వసతులు, ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్ కూపన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ డైరెక్ట్ 10 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో మార్కెట్లో రూ.86,999 గా ఉన్న వన్‌ప్లస్ 15 అసలు ధర.. ఈ సేల్‌లో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ కింద కేవలం రూ.77,999 కే సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా అదిరిపోయే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, హ్యాసిల్‌బ్లాడ్ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 13 మోడల్‌పై ఏకంగా రూ.15,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ.79,999 కాగా, ప్రస్తుతం సేల్‌లో కేవలం రూ.64,999 ఎఫెక్టివ్ ధరకే లభిస్తోంది.

ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వారి కోసం వన్‌ప్లస్ ఆకర్షణీయమైన మిడ్-రేంజ్ ఫోన్లను కూడా తక్కువ ధరకే అందిస్తోంది. రూ.54,999 విలువైన వన్‌ప్లస్ 15ఆర్ మొబైల్ ఈ సేల్‌లో రూ.52,990 కి అందుబాటులో ఉంది. అలాగే కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చే వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్ అసలు ధర రూ.57,999 కాగా, బ్యాంక్ ఆఫర్లతో కలిపి కేవలం రూ.49,999 ధరకే లభిస్తోంది. మరోవైపు, భారీ 9,000mAh బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లో సంచలనం సృష్టించిన వన్‌ప్లస్ నోర్డ్ 6  పై కూడా అదిరిపోయే ఆఫర్ ఉంది. రూ.56,999 విలువైన ఈ ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు కేవలం రూ.41,998 కే లభిస్తోంది. చివరిగా, బడ్జెట్ ప్రీమియం రేంజ్‌లో ఉన్న వన్‌ప్లస్ 13ఆర్   ఫోన్‌ను రూ.44,999కి బదులుగా కేవలం రూ.39,999కే దక్కించుకోవచ్చు.

ఈ నెల ప్రారంభంలోనే వన్‌ప్లస్ సంస్థ బడ్జెట్ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 6 సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్లలో లభించే ఫీచర్లు పరిమితంగానే ఉంటాయి. కాబట్టి, జేబుకు చిల్లు పడకుండా వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి బెస్ట్ డిస్‌ప్లే, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ, అధునాతన ఏఐ కెమెరా ఫీచర్లు కావాలనుకునే వారికి నోర్డ్ సీఈ మోడల్ కంటే ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో లభిస్తున్న పాత ఫ్లాగ్‌షిప్ మోడళ్లను కొనుగోలు చేయడమే అత్యంత లాభదాయకమైన ఉత్తమమైన నిర్ణయం అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్లు మరింత అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Amazon Great Summer Sale 2026: Best Deals on OnePlus Phones

Model List Price Effective Sale Price Buying Link
OnePlus 15 Rs. 86,999 Rs. 77,999 Buy Here
OnePlus 13 Rs. 79,999 Rs. 64,999 Buy Here
OnePlus 15R Rs. 54,999 Rs. 52,990 Buy Here
OnePlus 13s Rs. 57,999 Rs. 49,999 Buy Here
OnePlus Nord 6 Rs. 56,999 Rs. 41,998 Buy Here
OnePlus 13R Rs. 44,999 Rs. 39,999 Buy Here

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »