టాబ్లెట్లు, ఫోల్డబుల్ ఫోన్లు ఉపయోగించే వారి కోసం గూగుల్ ప్రత్యేకంగా బబుల్ బార్ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
Photo Credit: Google
Android device
Android 17 : ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తో వచ్చిన బబుల్స్ అనేది ఒక విప్లవాత్మక మల్టీటాస్కింగ్ ఫీచర్. దీని ద్వారా మీకు నచ్చిన ఏ యాప్‌నైనా సరే ఒక చిన్న ఫ్లోటింగ్ విండోలా మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, కేవలం యాప్ ఐకాన్‌ను కాసేపు నొక్కి పడితే చాలు. ఇలా మీరు ఒకేసారి నాలుగైదు యాప్స్‌ను బబుల్స్ రూపంలో మార్చుకుని, ఒకదానిపై ఒకటిగా స్క్రీన్‌పై అమర్చుకోవచ్చు. దీనివల్ల యాప్స్ మధ్య స్విచ్ అవ్వడం చాలా వేగంగా మారిపోతుంది.
టాబ్లెట్లు, ఫోల్డబుల్ ఫోన్లు ఉపయోగించే వారి కోసం గూగుల్ ప్రత్యేకంగా బబుల్ బార్ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఇది స్క్రీన్ కుడి వైపు కింద భాగంలో ఒక చిన్న డాక్ లాగా కనిపిస్తుంది. మీరు బబుల్స్‌గా మార్చిన యాప్స్ అన్నీ ఈ బార్‌లో ఐకాన్స్ లాగా అమరిపోతాయి. ఇక్కడి నుంచే మీరు నేరుగా వేరే యాప్‌లోకి మారవచ్చు, లేదా దాన్ని మినిమైజ్ చేయవచ్చు, లేదంటే ఒకే క్లిక్‌తో ఫుల్ స్క్రీన్ మోడ్‌లోకి కూడా మార్చుకోవచ్చు.
మీ ఆండ్రాయిడ్ 17 ఫోన్‌లో బబుల్స్ ఫీచర్‌ను ఉపయోగించడానికి మొదట మీ హోమ్ స్క్రీన్ లేదా యాప్ డ్రాయర్‌లోకి వెళ్ళండి. మీకు నచ్చిన యాప్ ఐకాన్‌ను లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు వచ్చే పాప్-అప్ మెనూలో మీకు బబుల్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని టాప్ చేయండి. అంతే, ఆ యాప్ వెంటనే ఒక చిన్న ఫ్లోటింగ్ విండోలా మారిపోతుంది. ఒకవేళ మీరు గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ లేదా పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ వాడుతుంటే, స్క్రీన్ కింద నుంచి పైకి స్లోగా స్వైప్ చేసి టాస్క్‌బార్ ఓపెన్ చేసి కూడా ఈ ప్రాసెస్ రిపీట్ చేయవచ్చు.
క్రియేట్ చేసిన బబుల్‌ను పెద్దగా చేయాలంటే ఆ బబుల్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే చాలు. దాన్ని మళ్లీ చిన్నగా చేయాలంటే, ఆ ఐకాన్‌పై మరోసారి నొక్కాలి లేదా స్క్రీన్‌పై ఖాళీగా ఉన్న చోట ఎక్కడైనా టచ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ యాప్‌ను పూర్తిగా క్లోజ్ చేయాలనుకుంటే, ఆ బబుల్ ఐకాన్‌ను గట్టిగా పట్టుకుని స్క్రీన్‌పై కింద భాగంలో కనిపించే X లేదా క్రాస్ మార్క్ ఉన్న క్లోజ్ బటన్‌పైకి డ్రాగ్ చేసి వదిలేయాలి. అలాగే ఒక బబుల్ యాప్ నుంచి ఇంకో యాప్‌కి మారడానికి ఆ బబుల్ బార్‌లోని ఐకాన్స్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
Smartphones : ఆఫర్లు లేవు.. అన్నీ రేట్లు పెరిగాయి.. రూ.25 వేల బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలో అర్థం కావట్లేదా?
మీరు గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ సిరీస్ వాడుతుంటే, ఈ బబుల్స్ టాస్క్‌బార్ ఎప్పుడూ స్క్రీన్‌పైనే ఉండేలా లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్క్రీన్ కింద నుండి పైకి స్వైప్ చేసి టాస్క్‌బార్ ఓపెన్ చేయండి. అందులో కనిపించే ఒక చిన్న డివైడర్ లైన్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు వచ్చే ఆప్షన్లలో ఆల్వేస్ షో టాస్క్‌బార్ అనే ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి. దీనివల్ల మీరు ఏ యాప్ వాడుతున్నా కింద టాస్క్‌బార్ అలాగే ఉండిపోతుంది.
ప్రస్తుతానికి గూగుల్ ఈ ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్, బబుల్స్ ఫీచర్‌ను కేవలం తన సొంత పిక్సెల్ ఫోన్లకు (పిక్సెల్ 6 సిరీస్ నుంచి కొత్త మోడల్స్ వరకు) మాత్రమే విడుదల చేసింది. అయితే ఆండ్రాయిడ్ ప్రియులు కంగారు పడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో శాంసంగ్, వన్‌ప్లస్, షావోమి, రియల్‌మీ లాంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు కూడా ఈ ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్, ఈ అద్భుతమైన మల్టీటాస్కింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ప్రకటన
ప్రకటన
Discord Says It Has Not Received Take-Two Subpoena Over GTA 6 Leaks as More Gameplay Clips Surface Online