గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.49,999గా ఉంది.
Photo Credit: AI Generated
Flipkart GOAT Sale
Flipkart GOAT Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న గోట్ సేల్ 2026లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ దాదాపు రూ.45,000ల వరకు ఉంటే, ఈ సేల్‌లో మీ ముందుకు రెండు అత్యంత పవర్‌ఫుల్, ప్రీమియం ఫోన్లు పోటీగా నిలుస్తున్నాయి. ఒకవైపు Samsung Galaxy S25 FE కాగా, మరొకవైపు Google Pixel 10a. ఈ సేల్‌లో గెలాక్సీ S25 FE మోడల్ రూ.47,999కి లిస్ట్ అయింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎస్‌బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడం ద్వారా కస్టమర్లకు రూ.2,875 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే దాదాపు రూ.45,000లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
డిస్కౌంట్ ఆఫర్లతో సమాన ధరల్లో రెండు ఫ్లాగ్‌షిప్ మొబైల్స్
మరోవైపు గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.49,999గా ఉంది. కానీ ఐసీఐసీఐ, ఇతర ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ల సహాయంతో దీని ఎఫెక్టివ్ ధర కూడా సుమారు రూ.47,999కి చేరుకుంటుంది. అంటే ఈ సేల్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు దాదాపు ఒకే విధమైన బడ్జెట్ పరిధిలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఫోన్ కొంటే ఎక్కువ లాభం? ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అందిస్తుంది? అనే గందరగోళం కస్టమర్లలో నెలకొంది. అందుకే స్పెక్స్, ఫీచర్ల ఆధారంగా ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.
డిస్‌ప్లేల పోరు: శాంసంగ్ స్క్రీన్ సైజ్ పెద్దది
స్క్రీన్ విషయానికి వస్తే, రెండింటిలోనూ విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 FE మోడల్లో 6.7 ఇంచుల భారీ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అదే సమయంలో గూగుల్ పిక్సెల్ 10a లో కాస్త చిన్నదైన 6.3 ఇంచుల ఆక్చువా పిఓఎల్ఈడీ డిస్‌ప్లే కలదు. ఇందులో కూడా 120Hz రీఫ్రెష్ రేట్ ఉన్నప్పటికీ, దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 3,000 నిట్స్ వరకు ఉంటుంది. కాబట్టి మీకు పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే శాంసంగ్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. కానీ ఎండలో లేదా అవుట్‌డోర్ విజిబిలిటీలో స్క్రీన్ స్పష్టంగా కనిపించాలంటే మాత్రం గూగుల్ పిక్సెల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రాసెసర్‌ల వార్
ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా గెలాక్సీ S25 FE లో పవర్‌ఫుల్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 8GB ర్యామ్, గరిష్టంగా 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను జత చేశారు. మునుపటి మోడళ్లతో పోలిస్తే ఇందులో 13 శాతం పెద్దదైన వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను శాంసంగ్ ఏర్పాటు చేసింది. దీనివల్ల హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ అస్సలు హీట్ అవ్వదు. ఇక గూగుల్ పిక్సెల్ 10aలో గూగుల్ టెన్సార్ G4 చిప్‌సెట్ ఉంది. ఇందులో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ లభిస్తుంది. రా పర్ఫార్మెన్స్, స్పీడ్ విషయంలో ఎక్సినోస్ 2400 ముందంజలో ఉన్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్‌లో మాత్రం టెన్సార్ జీ4 చిప్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.
కెమెరా కంపారిజన్
కెమెరా విభాగంలో ఇరు కంపెనీలు భిన్నమైన వ్యూహాలను అనుసరించాయి. శాంసంగ్ గెలాక్సీ S25 FE లో వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా + 8MP టెలిఫోటో లెన్స్ + 12MP ఆల్ట్రావైడ్ కెమెరాల సెటప్ ఉంది. ఇందులో ప్రత్యేకంగా టెలిఫోటో లెన్స్ ఇవ్వడం వల్ల కస్టమర్లకు ఆప్టికల్ జూమ్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. సెల్ఫీల కోసం ఇందులో 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కాగా, గూగుల్ పిక్సెల్ 10a లో 48MP మెయిన్ కెమెరా + 13MP ఆల్ట్రావైడ్ కెమెరాలు మాత్రమే ఉన్నాయి, ఇందులో టెలిఫోటో జూమ్ కెమెరా లేదు. కానీ గూగుల్ ఫోన్లు వాటి కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇందులో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. జూమ్ ఫీచర్ కావాలంటే శాంసంగ్, నాచురల్ ఫోటోలు ఇష్టపడే వారికి పిక్సెల్ బెస్ట్.
పెద్ద బ్యాటరీ వర్సెస్ ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ పరంగా చూస్తే, గెలాక్సీ S25 FE లో 4,900mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మరోవైపు పిక్సెల్ 10aలో పెద్దదైన 5,100mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, దీని ఛార్జింగ్ స్పీడ్ మాత్రం 30W వైర్డ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మాత్రమే పరిమితమైంది. అంటే పిక్సెల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుంది, కానీ శాంసంగ్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.
సాఫ్ట్‌వేర్ పరంగా రెండు ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. ఈ రెండు ఫోన్లకు ఏకంగా 7 సంవత్సరాల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీలు ప్రామిస్ చేశాయి. శాంసంగ్ వన్ యూఐ 8తో పాటు జెనరేటివ్ ఎడిట్, సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్ వంటి క్రేజీ AI ఫీచర్లను అందిస్తుండగా, గూగుల్ పిక్సెల్ 10aలో ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు గూగుల్ సొంత ఏఐ ఫీచర్లు లభిస్తాయి. మీకు గేమింగ్, పెద్ద స్క్రీన్, జూమ్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే Samsung కరెక్ట్ ఛాయిస్. అలా కాకుండా క్లీన్ ఆండ్రాయిడ్, బెస్ట్ పిక్సెల్ కెమెరా, అవుట్‌డోర్ బ్రైట్‌నెస్, పెద్ద బ్యాటరీ కావాలనుకుంటే Google Pixel సరైన ఆప్షన్.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Pad FE Reportedly Surfaces on TDRA, TUV Certifications; Charging Specifications Revealed
OpenAI Lawsuit Says Employee Who Left for Apple Took Files About Unreleased Device