మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌తో ఇండియాలో లాంఛ్ అయిన‌ Samsung Galaxy F16 5G

Samsung Galaxy F16 5G కెమెరా విష‌యానికి వ‌స్తే.. దీనిని 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో రూపొందించారు.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌తో ఇండియాలో లాంఛ్ అయిన‌ Samsung Galaxy F16 5G

Photo Credit: Samsung

శామ్సంగ్ గెలాక్సీ F16 5G బ్లింగ్ బ్లాక్, గ్లాం గ్రీన్ మరియు వైబింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ముఖ్యాంశాలు
  • Samsung Galaxy F16 5G 6.7-అంగుళాల సూప‌ర్ AMOLED డిస్‌ప్లేతో వ‌స్తుంది
  • ఈ హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీని క‌లిగి ఉంటుంది
  • Galaxy F16 5G 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది
ప్రకటన

గ‌త ఏడాదిలో మార్చిలో ఇండియాలో విడుద‌లైన‌ Galaxy F15 5Gకి కొన‌సాగింపుగా Samsung Galaxy F16 5G మ‌న దేశంలో లాంఛ్ అయ్యింది. ఈ తాజా Galaxy F16 5G ఫోన్‌ MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్‌లో శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని క‌లిగి ఉంది. ఇక కెమెరా విష‌యానికి వ‌స్తే.. దీనిని 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో రూపొందించారు. ఈ ఫోన్ ఆరు OS అప్‌గ్రేడ్‌లతో పాటు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ల‌ను పొందుతుంది.

ఎప్పుడు కొనుగోలుకు అందుబాటులో

మ‌న దేశంలో Samsung Galaxy F16 5G ధర అన్ని ఆఫర్లతో క‌లిపి రూ. 11,499 నుండి ప్రారంభమవుతుంది. మార్చి 13న మధ్యాహ్నం 12 గంటల నుండి భార‌త్‌లో దీని అమ్మకాలు ప్రారంభమవుతాయ‌ని Flipkartలోని ప్రమోషనల్ బ్యానర్ ద్వారా స్ప‌ష్ట‌మైంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్, వైబింగ్ బ్లూ షేడ్స్‌లో ఈ-కామర్స్ సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా.. ఇండియాలో గెలాక్సీ F16 5G ధర వరుసగా 4GB, 6GB, 8GB RAM ఆప్షన్‌లు రూ. 13,499, రూ. 14,999, రూ. 16,499గా ఉండే అవ‌కాశం ఉంది. అన్ని వేరియంట్‌లు 128GB స్టోరేజ్‌కు స‌పోర్ట్ చేస్తాయ‌ని తెలుస్తోంది.

స్టోరేజీ సామ‌ర్థ్యం ఇలా

కొత్త Samsung Galaxy F16 5G ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్‌-HD+ (1,080 x 2,340 పిక్సెల్స్) సూపర్ AMOLED డిస్‌ప్లేతో వ‌స్తుంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 8GB RAMతో అటాచ్ చేయ‌బ‌డి ఉంది. అంతే కాదు, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో మైక్రో SD కార్డ్ ద్వారా 1.5TB వరకు ఎక్స్‌ట్ర‌న‌ల్ స్టోరేజీని స‌పోర్ట్ చేస్తుంది.

కెమెరా స్పెసిఫికేష‌న్స్‌

ఈ ఫోన్ Android 15-ఆధారిత One UI 7తో ర‌న్ అవుతుంది. అలాగే, ఆరు OS అప్‌గ్రేడ్‌లతోపాటు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ల‌ను పొంద‌నున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది. Galaxy F16 5G స్మార్ట్ ఫోన్ కెమెరా విష‌యానికి వ‌స్తే.. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, వెనుక 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ కలిగి ఉంటుంది. అంతే కాదు, ఫోన్ ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

కనెక్టివిటీ ఆప్ష‌న్స్ ఇలా

ఈ Samsung Galaxy F16 5G స్మార్ట్ ఫోన్‌ 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని క‌లిగి ఉంటుంది. అలాగే, కనెక్టివిటీ విష‌యానికి వస్తే.. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, Glonass, Beidou, Galileo, QZSS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 164.4 x 77.9 x 7.9mm పరిమాణంతో 191 గ్రాముల బ‌రువును క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సిమ్ కార్డ్‌ డోర్ డెల‌వ‌రీ సేవ‌ల‌ను తీసుకొచ్చిన BSNL.. సెల్ఫ్ కేవైసీతో సిమ్ పొందండిలా
  2. అవే ఫీచ‌ర్స్‌, స్పెసిఫికేష‌న్‌ల‌తో ఇండియాలోకి Honor X9c వ‌చ్చేస్తోంది
  3. భారతదేశంలో ప్రారంభించబడిన Poco F7 5G స్మార్ట్‌ఫోన్: స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 SoC, 7,550mAh బ్యాటరీ
  4. 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 6,000mAh బ్యాటరీతో VIVO T4 Lite 5G భారతదేశంలో ప్రారంభించబడింది
  5. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC, 6,500mAh బ్యాటరీతో Vivo X200 FE లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు
  6. జూలై 9న జరగనున్న Samsung Galaxy Unpacked 2025 ఈవెంట్; Galaxy Z Fold 7 మరియు Galaxy Z Flip 7 ఆవిష్కరించబడతాయి
  7. స్నాప్‌డ్రాగ‌న్ 8s Gen 4 ప్రాసెస‌ర్‌తో Nothing Phone 3.. లాంఛ్‌కు ముందే స్పెసిఫికేష‌న్స్ లీక్‌
  8. ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ద్వారా Oppo Reno 14 5G సిరీస్ ఫోన్‌ల అమ్మ‌కాలు
  9. ఇండియాలో జూన్ 27న Samsung Galaxy M36 5G లాంఛ్‌.. ధ‌ర ఎంతో తెలుసా
  10. AI నాయిస్ క్యాన్సిలేష‌న్‌తో OnePlus Bullets Wireless Z3.. ధ‌ర కేవ‌లం రూ. 1699
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »