Flipkart Summer Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా.. మోటరోలా, ఒప్పో, రియల్‌మీ ఫోన్ల ధరలు భారీగా డౌన్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌కు గట్టి పోటీనిస్తూ మే 9 నుంచి భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది.

Flipkart Summer Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా.. మోటరోలా, ఒప్పో, రియల్‌మీ ఫోన్ల ధరలు భారీగా డౌన్
ముఖ్యాంశాలు
  • మే 9 నుంచి భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది.
  • మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ సేల్‌లో ఇది రూ.24,999కే లభించనుంది
  • పోకో F7 5G అసలు ధర రూ.33,999కాగా, సేల్‌లో ఇది రూ.31,999 కే దొరుకుతుంది
ప్రకటన

Flipkart Summer Sale 2026 : వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఫ్లిప్‌కార్ట్ తన ధమాకా సేల్‌తో సిద్ధమైంది. మే 9 నుంచి భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌కు గట్టి పోటీనిస్తూ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. సేల్ ప్రారంభానికి ముందే స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించి కస్టమర్లను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ కొనేవారికి ఇది ఒక సువర్ణావకాశం. ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ డీల్స్ అందుబాటులోకి వస్తాయి.

మోటరోలా ఫోన్లపై స్పెషల్ డీల్స్
మోటరోలా లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ క్రేజీ ఆఫర్లను టీజ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ అసలు ధర రూ.26,999 కాగా, సేల్‌లో ఇది రూ.24,999కే లభించనుంది. అంటే నేరుగా రూ.2,000 ఆదా చేయవచ్చు. అలాగే మోటరోలా ఎడ్జ్ 60 ప్రో రూ.27,999కి, మోటో G06 పవర్ రూ.9,499కి అందుబాటులో ఉంటాయి. మోటో G06 పవర్‌లో 7000mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 వంటి ఫీచర్లు ఉండటం గమనార్హం. తక్కువ బడ్జెట్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ల కోసం చూసేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్.

ఒప్పో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు
ఒప్పో, రియల్‌మీ బ్రాండ్లు కూడా తమ పాపులర్ మోడళ్లపై ధరలను తగ్గించాయి. ఒప్పో K14 5G ఫోన్ రూ.17,999కే లభించనుండగా, ఒప్పో K14x 5G మోడల్ రూ.14,499కే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మీ విషయానికి వస్తే, రియల్‌మీ GT 7T రూ.26,499కి, రియల్‌మీ P4 ప్రో 5G రూ.24,999 కి లభించనున్నాయి. ముఖ్యంగా రియల్‌మీ GT 7T లో 120W ఫాస్ట్ ఛార్జింగ్, గేమింగ్‌కు కావాల్సిన పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మీ P3 అల్ట్రా కూడా రూ.23,499 కి అందుబాటులోకి రానుంది.

పోకో, ఇన్ఫినిక్స్ ఫోన్ల హంగామా
బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగంలో పోకో, ఇన్ఫినిక్స్ ఫోన్లు కూడా దుమ్మురేపనున్నాయి. పోకో F7 5G అసలు ధర రూ.33,999కాగా, సేల్‌లో ఇది రూ.31,999 కే దొరుకుతుంది. పోకో M8 5G రూ.17,099కే అందుబాటులో ఉంటుంది. ఇక ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పై ఏకంగా రూ.4,000 తగ్గింపు ఉండనుంది, దీని ధర రూ.27,999 గా నిర్ణయించారు. ఇన్ఫినిక్స్ GT 30 5G+ మోడల్ రూ.17,999కే లభించనుంది. ఈ ధరలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కలుపుకుని ఉంటాయని గుర్తుంచుకోవాలి.\

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »