Budget Smartphones : రూ. 11 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది? హెచ్ఎండీ, రెడ్‌మీ, లావా మధ్య బిగ్ ఫైట్

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఆశించే ఎంట్రీ లెవల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు పోటీపడుతున్నాయి.

Budget Smartphones : రూ. 11 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది? హెచ్ఎండీ, రెడ్‌మీ, లావా మధ్య బిగ్ ఫైట్

HMD Vibe 2 5G vs Redmi A7 4G vs Lava Yuva Star 3

ముఖ్యాంశాలు
  • రెడ్‌మీ ఏ7 4జీ 6.88-ఇంచుల భారీ హెచ్‌డీ+ స్క్రీన్‌తో వస్తుంది
  • రెడ్‌మీ ఏ7 4జీ లో యూనిసోక్ టీ7250 చిప్‌సెట్, ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
  • భారీ బ్యాటరీలతో దిగ్గజ కంపెనీల మైండ్ బ్లాక్ చేస్తున్న సరికొత్త ఫోన్లు!
ప్రకటన

Budget Smartphones : భారతదేశంలో రూ.11,000 లోపు బడ్జెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఆశించే ఎంట్రీ లెవల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ సరికొత్త నెట్‌వర్క్ సపోర్ట్‌తో దుమ్ములేపుతోంది. దీనికి గట్టి పోటీ ఇస్తూ షావోమీ వారి రెడ్‌మీ ఏ7 4జీ లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో దూసుకొచ్చింది. వీటన్నింటికంటే తక్కువ ధరలోనే క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తానంటూ లావా యువ స్టార్ 3 కూడా బరిలోకి నిలిచింది. మరి ఈ మూడింటిలో ఏది బెస్ట్, దేని ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ధరల విషయానికొస్తే ఏది ఎంత?
మొదటగా హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ విషయానికొస్తే.. దీని 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. అలాగే 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించారు. ఇది కాస్మిక్ లావెండర్, నార్డిక్ బ్లూ, పీచ్ పింక్ కలర్స్‌లో లభిస్తుంది. ఇక రెడ్‌మీ ఏ7 4జీ కేవలం ఒకే ఒక వేరియంట్ (3GB ర్యామ్ + 64GB స్టోరేజ్) తో రూ.10,999 ధరకు దొరుకుతుంది. వీటన్నింటికంటే చౌకగా లావా యువ స్టార్ 3 కేవలం రూ. 7,499 ధరకే లభిస్తోంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ లో ఎవరి జోరు ఎక్కువ?
స్క్రీన్ విషయానికొస్తే రెడ్‌మీ ఏ7 4జీ అందరికంటే పెద్దదైన 6.88-ఇంచుల భారీ హెచ్‌డీ+ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో చెమట లేదా తడి చేతులతో కూడా స్క్రీన్ వాడేలా వెట్ టచ్ సపోర్ట్, కళ్లకు రక్షణ ఇచ్చే సర్టిఫికేషన్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. హెచ్ఎండీ వైబ్ 2 5జీ లో 6.7-ఇంచుల స్క్రీన్‌తో పాటు సూపర్ స్మూత్ 120Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఈ రెండు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి. అయితే లావా యువ స్టార్ 3 మాత్రం కొంచెం వెనుకబడి 6.75-ఇంచుల స్క్రీన్, 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది బడ్జెట్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‎తో రన్ అవుతుంది.

ప్రొసెసర్ పవర్, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
రోజువారీ పనులు, యాప్స్ వాడకంలో రెడ్‌మీ ఏ7 4జీ లోని యూనిసోక్ టీ7250 చిప్‌సెట్, ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ వల్ల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇందులో వర్చువల్ ర్యామ్ పెంచుకోవడంతో పాటు ఎస్‌డీ కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు. దీనికి గట్టి పోటీ ఇస్తూ హెచ్ఎండీ వైబ్ 2 5జీ లో యూనిసోక్ టీ8200 అక్టా-కోర్ ప్రొసెసర్‌ను పెట్టారు. ఇది కూడా చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. కానీ చాలా తక్కువ ధర ఉండే లావా యువ స్టార్ 3 లో బేసిక్ పనుల కోసం Unisoc SC9863A ప్రొసెసర్‌ను మాత్రమే ఇచ్చారు. అయితే ఇందులో కూడా 8GB వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకునే ఫీచర్ ఉంది.

బ్యాటరీలో ఎవరు టాప్? ఛార్జింగ్ స్పీడ్ ఎంత?
ఈ బడ్జెట్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండటం విశేషం. బ్యాటరీ రేసులో అందరికంటే ముందు రెడ్‌మీ ఏ7 4జీ నిలిచింది. ఇందులో 6,300mAh భారీ బ్యాటరీ ఉంది. దీని ద్వారా వేరే ఫోన్లకు కూడా ఛార్జింగ్ ఇచ్చుకునేలా 7.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని తర్వాత హెచ్ఎండీ వైబ్ 2 5జీ లో 6,000mAh బ్యాటరీతో పాటు బాక్స్‌లోనే 18W ఫాస్ట్ ఛార్జర్‌ను ఇస్తున్నారు. ఇక లావా యువ స్టార్ 3 లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 10W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ లావా ఫోన్ 30 గంటల టాక్ టైమ్, 340 గంటల స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ చెప్తోంది.

కెమెరా క్వాలిటీ, ఫోన్ సైజులు ఇవే 
ఫొటోగ్రఫీ విషయానికొస్తే హెచ్ఎండీ వైబ్ 2 5జీ స్పష్టమైన తేడాతో ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏఐ సపోర్ట్ ఉన్న పవర్‌ఫుల్ 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని బరువు 210 గ్రాములు ఉంటుంది. ఇక రెడ్‌మీ ఏ7 4జీ లో వెనుక 13-మెగాపిక్సెల్, ముందు 8-మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. దీని బరువు 208 గ్రాములు. లావా యువ స్టార్ 3 ఫోన్ లో కూడా వెనుక 13-మెగాపిక్సెల్, ముందు 5-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ మూడింటిలో కెల్లా లావా ఫోన్ చాలా తేలికగా కేవలం 193.7 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

ఈ మూడింటిలో ఏ ఫోన్ కొనాలి?
మీరు తక్కువ బడ్జెట్‌లోనే భవిష్యత్తు కోసం 5జీ కనెక్టివిటీ, సూపర్ స్మూత్ 120Hz స్క్రీన్,   అదిరిపోయే 50MP కెమెరా కావాలనుకుంటే కళ్ళు మూసుకుని హెచ్ఎండీ వైబ్ 2 5జీ వైపు వెళ్ళవచ్చు. అలా కాకుండా మాకు 5జీ తో పనిలేదు, కానీ కొండంత బ్యాటరీ బ్యాకప్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే రెడ్‌మీ ఏ7 4జీ బెస్ట్ ఛాయిస్. ఒకవేళ మీ బడ్జెట్ రూ.8,000 లోపే ఉండి, రోజువారీ అవసరాలకు, సోషల్ మీడియా వాడుకోవడానికి ఒక సింపుల్ అండ్ క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే లావా యువ స్టార్ 3 చాలా చక్కగా సరిపోతుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »