OnePlus Summer Sale 2026 : వన్‌ప్లస్ సమ్మర్ సేల్ ధమాకా.. అదిరిపోయే ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్లు

వన్‌ప్లస్ ఇండియాలో తన  సమ్మర్ సేల్‎ను ప్రకటించింది. మే 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభమైంది.

OnePlus Summer Sale 2026 :  వన్‌ప్లస్ సమ్మర్ సేల్ ధమాకా.. అదిరిపోయే ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్లు
ముఖ్యాంశాలు
  • మే 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి వన్‌ప్లస్ సేల్
  • వన్‌ప్లస్ 15R మోడల్ రూ.50,999 ధరకే సొంతం చేసుకోవచ్చు
  • వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ.14,999కే అందుబాటులో ఉంది
ప్రకటన

OnePlus Summer Sale 2026: మొబైల్ అంటే ఇష్టపడే వారికి ఒక అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ఈ ఫోన్లను కొనాలి అనుకుంటే వన్‌ప్లస్ సమ్మర్ సేల్‎ ఒక మంచి అవకాశం. వేసవి తాపాన్ని తగ్గించేందుకు వన్‌ప్లస్ కంపెనీ ఇండియాలో తన  సమ్మర్ సేల్‎ను ప్రకటించింది. మే 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో కేవలం స్మార్ట్‌ఫోన్లే కాకుండా, ట్యాబ్లెట్లు, ఇయర్ బడ్స్, ఇతర ఆడియో ఉత్పత్తులపై వన్‌ప్లస్ భారీగా ధరలను తగ్గించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అదనంగా బ్యాంకు ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా కస్టమర్లకు లభించనున్నాయి.

వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్‌ప్లస్ 15 సిరీస్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. వన్‌ప్లస్ 15 ఫోన్ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.73,999 కే లభించనుంది. అలాగే, వన్‌ప్లస్ 15R మోడల్ రూ.50,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక గత మోడల్స్ అయిన వన్‌ప్లస్ 13 పై ఏకంగా రూ.7,000 ధర తగ్గింపుతో పాటు రూ.5,000 బ్యాంకు డిస్కౌంట్ లభిస్తోంది, దీనివల్ల ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.57,999కి చేరుకుంది. మిడ్-రేంజ్ విభాగంలో వన్‌ప్లస్ 13R రూ.37,999కి, వన్‌ప్లస్ 13s రూ.46,999కి అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ నార్డ్ 6 కొనేవారికి కూడా బ్యాంకు బెనిఫిట్లతో రూ.36,999కే లభిస్తుంది.

Product Pre-Discount Price (Rs.) Price Discount (Rs.) Additional Instant Bank Discount (EMI) (Rs.) Net Effective Price (Rs.)
OnePlus 13 69,999 7000 5000 57,999
OnePlus 13R 42,999 3000 2000 37,999
OnePlus 13s 54,999 5000 3000 46,999
OnePlus 15 77,999 0 4000 73,999
OnePlus 15R 54,999 2000 2000 50,999
OnePlus Nord 6 38,999 0 2000 36,999
OnePlus Pad Lite 17,999 1000 2000 14,999
OnePlus Pad Go 2 27,999 1000 2000 24,999
OnePlus Pad 3 49,999 1000 0 48,999
OnePlus Pad 4 59,999 0 5000 54,999

 
ట్యాబ్లెట్ వాడే వారి కోసం వన్‌ప్లస్ ప్యాడ్ 4 పై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.59,999 ధర కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ ట్యాబ్లెట్ ఇప్పుడు బ్యాంకు ఆఫర్లతో రూ.54,999కే దొరుకుతుంది. బడ్జెట్ ట్యాబ్లెట్ కావాలనుకునే వారికి వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ.14,999కే అందుబాటులో ఉండగా, ప్యాడ్ గో 2 రూ.24,999కి, ప్యాడ్ 3 రూ.48,999కి లభించనున్నాయి. ముఖ్యంగా ఓపెన్ కాన్వాస్ మల్టీ టాస్కింగ్ ఫీచర్లతో వచ్చే ఈ ట్యాబ్లెట్లు ఆఫీస్ వర్క్, గేమింగ్‌కు చాలా బాగుంటాయి.

Product Pre-Discount Price (INR) Price Discount (INR) Additional Instant Bank Discount (EMI) (INR) Net Effective Price (INR
Bullets Wireless Z3 1,799 200 100 1,499
Bullets Wireless Z2 ANC 2,099 100 100 1,899
Nord Buds 3r 1,999 200 200 1,599
Nord Buds 3 2,499 250 150 2,099
Nord Buds 3 Pro 3,099 300 150 2,649
Nord Buds 4 Pro 3,999 NA 200 3,799
OnePlus Buds 4 6,499 500 400 5,599
OnePlus Buds Pro 3 12,999 1000 2000 9,999

 
మీరు మంచి ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ఇప్పుడు కేవలం రూ.9,999 కే లభిస్తుంది. వన్‌ప్లస్ బడ్స్ 4 ధర రూ.5,599గా నిర్ణయించారు. తక్కువ బడ్జెట్‌లో దొరికే నార్డ్ బడ్స్ 3 ప్రో రూ.2,649కి,  నార్డ్ బడ్స్ 3 రూ.2,099కి అందుబాటులో ఉంటాయి. నెక్ బ్యాండ్ వాడే వారి కోసం వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z3 కేవలం రూ.1,499కే లభించనుంది. ఇవి కాకుండా బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా వీటిని త్వరగా కొనుగోలు చేయవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »