డిజైన్, డిస్‌ప్లే విషయంలో ఐకూ 16 సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతోంది.
iQOO 16
iQOO 16: పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్‌కు పేరుగాంచిన ఐకూ సంస్థ తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐకూ 16పై దృష్టి పెట్టింది. చైనాకు చెందిన 3సి సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌తో పాటు ఐఎంఈఐ డేటాబేస్‌లోనూ మోడల్ నంబర్ I2601 తో ఇది దర్శనమిచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో 8,500 mAh భారీ బ్యాటరీ, కళ్లు చెదిరే 2K డిస్‌ప్లే ఉండనున్నాయి. ఈ సంచలన లీక్స్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ లవర్స్‌లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
165Hz డిస్‌ప్లే.. స్నాప్‌డ్రాగన్ నెక్స్ట్ లెవెల్ చిప్‌సెట్
డిజైన్, డిస్‌ప్లే విషయంలో ఐకూ 16 సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతోంది. ఇందులో 6.85-ఇంచీల ఫ్లాట్ శామ్‌సంగ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 2K రిజల్యూషన్‌తో పాటు 165Hz అత్యధిక రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా క్వాల్కమ్ నుంచి రాబోతున్న అత్యంత పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌తో పాటు ఆడ్రినో 850 జిపియు ఈ ఫోన్‌కు ప్రధాన బలంగా నిలవనుంది.
8,500 mAh బ్యాటరీ.. పేరిస్కోప్ కెమెరా మ్యాజిక్
స్మార్ట్‌ఫోన్ వాడకంలో బ్యాటరీ లైఫ్ చాలా కీలకం కాగా ఐకూ ఈసారి ఏకంగా 8,500 mAh సామర్థ్యం ఉన్న జంబో బ్యాటరీని పరిచయం చేస్తోంది. భద్రత కోసం డిస్‌ప్లే కింద 3D ఆల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను చేర్చారు. వెనుక భాగంలో సరికొత్త డిజైన్‌తో కూడిన కెమెరా మాడ్యూల్‌తో పాటు సుదూర దృశ్యాలను స్పష్టంగా బంధించే పేరిస్కోప్ టెలిఫోటో కెమెరా అందుబాటులోకి రానుంది. ఆడియో ప్రియుల కోసం సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, గేమింగ్ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా అధునాతన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఈ డివైజ్‌లో రానున్నాయి.
Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
భారత మార్కెట్‌లోకి రావడంపై అనిశ్చితి
గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ఐకూ 15 మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో మార్కెట్లో మంచి విజయం సాధించింది. ఐతే గ్లోబల్ మార్కెట్‌లో మెమరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఐకూ 16 మోడల్‌ను భారతీయ మార్కెట్‌లో పరిచయం చేయడంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
8,500 mAh భారీ బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ వంటి సంచలన ఫీచర్లతో రాబోతున్న ఐకూ 16 మోడల్ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో కొత్త ప్రమాణాలు నెలకొల్పనుంది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వస్తే గేమింగ్, ఫ్లాగ్‌షిప్ విభాగాల్లో మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురవడం ఖాయం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Galaxy S27 Ultra Camera Processing May Change From Galaxy S26 Ultra; Might Drop Dedicated 3X Telephoto Lens
Noise Homestage Soundbar Series Launched in India With Dolby Atmos, Up to 700W Output: Price, Features