Lava Agni 4 : అమెజాన్‌లో డిస్కౌంట్ల జాతర.. లావా ఫోన్ కొనడానికి ఇంతకంటే మంచి టైమ్ రాదు

లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 8GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‎లో రూ.27,999 ధరతో లిస్ట్ చేయబడింది.

Lava Agni 4 : అమెజాన్‌లో డిస్కౌంట్ల జాతర.. లావా ఫోన్ కొనడానికి ఇంతకంటే మంచి టైమ్ రాదు

Photo Credit: Lava Mobiles

Lava Agni 4

ముఖ్యాంశాలు
  • అమెజాన్‌లో డిస్కౌంట్ల జాతర
  • అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్
  • రూ.25 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్
ప్రకటన

Lava Agni 4 : దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా గత ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చిన పవర్‌ఫుల్ మోడల్ లావా అగ్ని 4 పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు అన్ని ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, లావా తన అగ్ని 4 ఫోన్‌ను తక్కువ ధరకే ఆఫర్ చేస్తూ కస్టమర్లకు ఒక బెస్ట్ డీల్‌ను అందిస్తోంది. మీరు గనుక రూ.25 వేల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఆఫర్ల కింద లభిస్తున్న ఈ ఫోన్ మీకు అత్యంత ప్రయోజనకరంగా మారబోతోంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇవ్వడం విశేషం.

లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 8GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‎లో రూ.27,999 ధరతో లిస్ట్ చేయబడింది. అయితే దీనిపై క్రేజీ బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి పేమెంట్ చేస్తే, నేరుగా రూ.4,000 ల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.23,999 కి తగ్గిపోతుంది. దీనికి అదనంగా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఏకంగా రూ.26,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత మొబైల్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7ఎఫ్ఈ 5జీపై భారీ డిస్కౌంట్

ఫీచర్ల విషయానికి వస్తే లావా అగ్ని 4 లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 1.5K హై-రిజల్యూషన్‌తో పాటు, సున్నితమైన గేమింగ్ అనుభూతి కోసం 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా స్పీడ్‌గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 5,000mAh పెద్ద బ్యాటరీ ఉంది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

ఈ ఫోన్ కెమెరా విభాగంలో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు, ఇది షేక్స్ లేని క్లియర్ ఫోటోలను తీస్తుంది. దీనితో పాటు వైడ్ యాంగిల్ షాట్స్ కోసం f/2.2 అపెర్చర్ కలిగిన 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీ లవర్స్ కోసం ఏకంగా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు, ఇది క్రిస్ప్ అండ్ క్లియర్ సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాలింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా ఇందులో 5G, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఒటిజి సపోర్ట్, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »