సినిమా చూసేవారికి పండగే! 11-అంగుళాల 2.5K స్క్రీన్, డాల్బీ అట్మోస్‌తో కొత్త మోటో టాబ్లెట్..!

మోటరోలా సంస్థ అమెరికా మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో కూడిన సరికొత్త టాబ్లెట్ 'మోటో ప్యాడ్ (2026)' విడుదల చేసింది.

సినిమా చూసేవారికి పండగే! 11-అంగుళాల 2.5K స్క్రీన్, డాల్బీ అట్మోస్‌తో కొత్త మోటో టాబ్లెట్..!

Photo Credit: Motorola

డాల్బీ అట్మోస్‌తో కొత్త మోటో టాబ్లెట్

ముఖ్యాంశాలు
  • రూ. 21,000 ధరలో మోటోరోలా కొత్త టాబ్లెట్
  • ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  • 5G కనెక్టివిటీ, భారీ బ్యాటరీతో బడ్జెట్ ధర
ప్రకటన

మోటరోలా సంస్థ అమెరికా మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో కూడిన సరికొత్త టాబ్లెట్ 'మోటో ప్యాడ్ (2026)' విడుదల చేసింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి స్టైలస్‌తో కలిపి ఈ గ్యాడ్జెట్‌ను కంపెనీ పరిచయం చేయడం విశేషం. గతేడాది సెప్టెంబర్ నెలలో భారత్‌లో సందడి చేసిన మోటో ప్యాడ్ 60 నియో మోడల్‌ను రీబ్రాండ్ చేస్తూ అమెరికా వినియోగదారుల కోసం ఈ వెర్షన్‌ను తీసుకొచ్చినట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. డిజైన్ పరంగా గానీ లోపల ఉండే హార్డ్‌వేర్ విషయంలో గానీ రెండు పరికరాలు ఒకేలా కనిపిస్తున్నాయి. నేటి తరం అవసరాలకు తగ్గట్టుగా స్టైలిష్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించేలా మోటరోలా దీనిని తీర్చిదిద్దింది.

ధర విషయానికొస్తే దీనిని సుమారు 250 డాలర్లుగా అంటే భారత కరెన్సీలో దాదాపు 23,000 రూపాయలుగా నిర్ణయించారు. కేవలం 8GB ర్యామ్ అలాగే 128GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే ఈ టాబ్లెట్ లభిస్తుంది. పాంటోన్ క్యూరేటెడ్ 'బ్రాంజ్ గ్రీన్' రంగులో మెరిసిపోతున్న ఈ పరికరం చూడటానికి చాలా ప్రీమియం అనుభూతిని కలిగిస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ నుండి అమెరికాలోని ప్రముఖ స్టోర్లలో ఇది అమ్మకానికి రానుంది. నేరుగా మోటరోలా ఆన్‌లైన్ వెబ్ సైట్ ద్వారా కూడా దీనిని కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే విద్యార్థులు వృత్తినిపుణులకు ఇది చక్కని ఎంపిక కాగలదు.

ఈ టాబ్లెట్ డిస్‌ప్లే హైలైట్ గురించి చెప్పుకోవాలంటే ఇందులో 11 అంగుళాల భారీ 2.5K స్క్రీన్ అమర్చారు. కళ్ళకు రక్షణనిచ్చే ట్యూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల ఎంతసేపు చూసినా అలసట కలగదు. 90Hz రిఫ్రెష్ రేట్ కారణంగా గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. సినిమా ప్రియుల కోసం ఇందులో నాలుగు స్పీకర్ల సెటప్ ఇచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటంతో ఆడియో అనుభవం థియేటర్ స్థాయిని తలపిస్తుంది. కాంతివంతమైన ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను దీనికి జోడించారు.

పనితీరును మెరుగుపరచడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ను వాడారు. దీనివల్ల 5G నెట్‌వర్క్ వేగాన్ని యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండటానికి ఈ ప్రాసెసర్ శక్తివంతంగా పనిచేస్తుంది. ఆఫీస్ పనుల కోసం హెవీ ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం లేదా సోషల్ మీడియా యాప్స్ వాడటం వంటివి చాలా వేగంగా పూర్తవుతాయి. అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉండటం వల్ల నెట్‌వర్క్ సిగ్నల్స్ చాలా బలంగా అందుతాయి. ఈ జనరేషన్ యువత ఇష్టపడే స్పీడ్ ఈ టాబ్లెట్‌లో పుష్కలంగా కనిపిస్తుంది.

బ్యాటరీ సామర్థ్యం గురించి మాట్లాడితే ఇందులో 7,040mAh భారీ బ్యాటరీని పొందుపరిచారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 12 గంటల పాటు నిరంతరాయంగా వీడియోలు చూసుకోవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోతుందనే భయం లేకుండా హాయిగా కాలక్షేపం చేయవచ్చు. ఛార్జింగ్ కోసం 20W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఛార్జర్ పాయింట్ వెతుక్కునే పని లేకుండా రోజంతా పనులు చక్కబెట్టుకోవడానికి ఈ బ్యాటరీ బ్యాకప్ సరిపోతుంది. స్లిమ్ డిజైన్ ఉన్నప్పటికీ ఇంత పెద్ద బ్యాటరీని అమర్చడం విశేషం.

ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అలాగే వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా కేటాయించారు. ఆఫీస్ మీటింగ్స్ లేదా ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే వారికి ఈ కెమెరాలు నాణ్యమైన విజువల్స్ ఇస్తాయి. కేవలం 480 గ్రాముల బరువు ఉండటం వల్ల దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. వైఫై 5 తో పాటు బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్లు డేటా షేరింగ్‌ను సులభతరం చేస్తాయి. మొత్తం మీద ఈ ప్రైస్ రేంజ్‌లో మోటో ప్యాడ్ (2026) ఒక కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. టెక్నాలజీని ఇష్టపడే వారికి ఈ కొత్త ట్యాబ్ ఖచ్చితంగా నచ్చుతుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »