నిన్నమొన్నటివరకు కేవలం అంచనాలకే పరిమితమైన దీని ఫీచర్లు.. ఇప్పుడు మైక్రోసైట్ అప్డేట్తో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఏకంగా 24 లక్షలకు పైగా అన్టుటు స్కోర్, కొండలాంటి భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Photo Credit: Flipkart/ Motorola
Motorola Edge 70 Pro+ will sport a hole-punch display cutout
Motorola Edge 70 Pro+ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న మోటోరోలా సంస్థ.. భారతీయ మార్కెట్లోకి మరో పవర్ఫుల్ మొబైల్‌ను దించడానికి సర్వం సిద్ధం చేసింది. జూన్ 4వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ స్పెసిఫికేషన్లను కంపెనీ తాజాగా తన మైక్రోసైట్ ద్వారా అధికారికంగా రివీల్ చేసింది. నిన్నమొన్నటివరకు కేవలం అంచనాలకే పరిమితమైన దీని ఫీచర్లు.. ఇప్పుడు మైక్రోసైట్ అప్డేట్తో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఏకంగా 24 లక్షలకు పైగా అన్టుటు స్కోర్, కొండలాంటి భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
24 లక్షల అన్టుటు స్కోర్
మోటోరోలా తన కొత్త ఎడ్జ్ 70 ప్రో ప్లస్ మోడల్లో పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు స్పష్టం చేసింది. 4nm ఫ్యాబ్రికేషన్ ప్రక్రియపై రూపొందిన ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ అన్టుటులో ఈ ఫోన్ ఏకంగా 24,00,000 కంటే ఎక్కువ పాయింట్ల మైండ్ బ్లాకింగ్ స్కోర్ సాధించిందని మోటోరోలా గర్వంగా ప్రకటించింది. దీనికి తోడు ఇందులో గరిష్టంగా 16జీబీ వరకు లార్జ్ LPDDR5x ర్యామ్ ఉండబోతోంది. హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ అస్సలు హీట్ అవ్వకుండా ఉండేందుకు 4,600 చదరపు మిల్లీమీటర్ల వైశాల్యం గల ప్రత్యేకమైన వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా ఇందులో అమర్చారు.
ఈసారి 6,500mAh భారీ బ్యాటరీ
బ్యాటరీ పరంగా మోటోరోలా ఈసారి గట్టి ప్లానే వేసింది. సాధారణంగా స్లిమ్ ఫోన్లలో చిన్న బ్యాటరీలు ఇస్తుంటారు, కానీ ఈ ఫోన్ లో ఏకంగా 6,500mAh మెగా బ్యాటరీని ప్యాక్ చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ సులభంగా రెండు రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు యూజర్లకు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండేందుకు 90W వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అన్నింటికంటే క్రేజీ అప్డేట్ ఏంటంటే.. ఈ మిడ్-రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లో 15W వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా కన్ఫర్మ్ చేశారు. దీనివల్ల వైర్లతో పనిలేకుండానే ఫోన్‌ను ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.
5,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్
డిస్ప్లే విభాగంలో కూడా ఈ ఫోన్ మార్కెట్ రికార్డులను తిరగరాయబోతోంది. ఇందులో 144Hz హై రిఫ్రెష్ రేట్ గల 6.8-ఇంచుల 1.5K ఎక్స్ట్రీమ్ అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 5,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సామర్థ్యాన్ని దీనికి ఇచ్చారు. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని వాడారు. సాఫ్ట్వేర్ విషయానికొస్తే.. ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐతో పనిచేస్తుంది. దీనికి తోడు 3 సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని మోటోరోలా కంపెనీ అధికారికంగా ప్రామిస్ చేసింది.
నీళ్లలో మునిగినా అస్సలు పాడవదు
ఫోన్ మన్నిక విషయంలో మోటోరోలా ఒక సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా IP68, IP69 రేటింగ్స్ రెండింటితోనూ వస్తోంది. అంటే కేవలం దుమ్ము, ధూళి, నీటి తుంపర్లు మాత్రమే కాదు.. అత్యంత వేడి నీటి ప్రవాహం తగిలినా లేదా ఫోన్ నీటిలో పూర్తిగా మునిగిపోయినా సరే అస్సలు పాడవదు. దీనితో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీని సూచించే MIL-810H సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ సొంతం చేసుకుంది. అంటే పొరపాటున చేతిలోంచి కిందపడినా దీని బాడీ గట్టిగా తట్టుకుంటుంది.
50ఎంపీ సోనీ సెన్సార్ కెమెరా
కెమెరా లవర్స్ కోసం ఈ ఫోన్ లో అదిరిపోయే ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను కన్ఫర్మ్ చేశారు. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా.. దానికి సోనీ ఎల్వైటీ-710 ఫ్లాగ్షిప్ సెన్సార్‌ను, 3.5-డిగ్రీల ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌ను అమర్చారు. దీనివల్ల నడుస్తూ ఫోటోలు తీసినా షేక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. దీనితో పాటు ఏకంగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా మోటోరోలా జత చేసింది. ఇది 50x డిజిటల్ జూమ్ సామర్థ్యంతో వస్తోంది. దీనివల్ల ఎంత దూరంలో ఉన్న సీనరీనైనా చాలా స్పష్టంగా క్యాప్చర్ చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్ సేల్స్
జూన్ 4న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ మొత్తం మూడు రకాల విభిన్నమైన పాంటోన్ కలర్ వేరియంట్లలో లభించనుంది. అవి.. స్కల్ప్టెడ్ ఉడ్ ఫినిష్‌తో వచ్చే పాంటోన్ చికోరీ కాఫీ, ట్విల్ ప్రేరేపిత ఫినిష్‌తో వచ్చే పాంటోన్ స్టార్మీ సీ, శాటిన్ లక్స్ ఫినిష్‌తో వచ్చే పాంటోన్ జిన్‌ఫాండెల్. లుక్ పరంగా ఈ ఫోన్లు ప్రీమియం ఐఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Grand Theft Auto 6 Will Reportedly Take Up 210GB of SSD Storage on Consoles