Motorola Edge 70 Pro+ : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. నేటి నుంచే ఎడ్జ్ 70 ప్రో+ సేల్ షురూ

కస్టమర్లు ఈ ఫోన్‌ను మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పార్ట్‌నర్ రిటెయిల్ స్టోర్ల ద్వారా సొంతం చేసుకోవచ్చు.

Motorola Edge 70 Pro+ : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. నేటి నుంచే ఎడ్జ్ 70 ప్రో+ సేల్ షురూ

Photo Credit: Motorola

Motorola Edge 70 Pro+

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్
  • రూ.47,999 ధరతో ప్రీమియం రేంజ్ మోడల్
  • కెమెరా లవర్స్ కోసం మూడు 50MP కెమెరాల సెటప్
ప్రకటన

Motorola Edge 70 Pro+ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారతీయ మొబైల్ లవర్స్ కోసం సరికొత్త ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుంచి కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చేసింది. మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న వన్‌ప్లస్, శామ్‌సంగ్ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా మోటోరోలా ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. కస్టమర్లు ఈ ఫోన్‌ను మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పార్ట్‌నర్ రిటెయిల్ స్టోర్ల ద్వారా సొంతం చేసుకోవచ్చు.

ధర, లాంచ్ ఆఫర్ల వివరాలు
ధర విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.47,999 గా నిర్ణయించింది. మొదటి రోజు సేల్స్ లో భాగంగా కస్టమర్ల కోసం కంపెనీ కొన్ని అదిరిపోయే లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.3,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభించనుంది. దీనివల్ల ఈ ప్రీమియం ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కస్టమర్లకు దక్కనుంది.

కళ్లు చెదిరే ప్యాంటోన్ డిజైన్ కలర్స్
లుక్, డిజైన్ పరంగా మోటోరోలా ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. ఈసారి కూడా ప్యాంటోన్ క్యూరేటెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను రంగంలోకి దంపింది. సాటిన్-లక్స్ ఫినిషింగ్‌తో వచ్చే ప్యాంటోన్ జిన్‌ఫాండెల్, స్కల్ప్‌టెడ్ ఉడ్ ఫినిషింగ్‌తో వచ్చే ప్యాంటోన్ చికోరీ కాఫీ, ట్విల్ ఇన్‌స్పైర్డ్ ఫినిషింగ్‌తో వచ్చే ప్యాంటోన్ స్టార్మీ సీ రంగులలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఈ కలర్స్, ప్రీమియం ఫినిషింగ్ వల్ల ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా రాయల్ లుక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

అల్ట్రా బ్రైట్‌నెస్ సూపర్ డిస్‌ప్లే
ఫీచర్ల విషయానికి వస్తే, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ లో 6.8 ఇంచుల భారీ సూపర్ హెచ్‌డీ+ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2772x1272 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే, ఈ ఫోన్ ఏకంగా 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంటే ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా సరే స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కూడా అందించారు.

హెవీ ప్రాసెసర్.. నెక్స్ట్ లెవెల్ ఓఎస్
స్పీడ్, పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో సరికొత్త ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌ను వాడారు. దీనికి తోడు 12GB LPDDR5X RAM, 256GB UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ తోడవ్వడం వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హెల్లో యూఐ పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని మోటోరోలా గ్యారెంటీ ఇస్తోంది.

మూడు 50MP కెమెరాల జాతర
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ , f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా 710 మెయిన్ కెమెరా ఉంది. దీనితో పాటు 50x సూపర్ జూమ్ ప్రో సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ 3.5x పెరిస్కోప్ కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ + మాక్రో విజన్ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా ఉండటం విశేషం.

భారీ బ్యాటరీ.. రక్షణే రక్షణ
మొబైల్ ఎక్కువ సమయం వాడే వారి కోసం ఇందులో ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ధూళి, ఇసుక,  నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు అత్యున్నత స్థాయి IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. అలాగే మిలిటరీ గ్రేడ్ మన్నిక కోసం MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా ఉంది. మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, వై-ఫై 6E, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »