స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో మార్కెట్‌లోకి OnePlus 13s: ధర, స్పెసిఫికేషన్స్ మీకోసం

OnePlus 13s 12GB వ‌ర‌కూ RAM, 512GB వ‌ర‌కూ స్టోరేజీ సామ‌ర్థ్యంతో ల‌భిస్తుంది. ఈ మోడ‌ల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,850mAh బ్యాట‌రీని క‌లిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో మార్కెట్‌లోకి OnePlus 13s: ధర, స్పెసిఫికేషన్స్ మీకోసం

Photo Credit: OnePlus

OnePlus 13s భారతదేశంలో ప్రారంభించబడింది: బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్ మరియు పింక్ శాటిన్ షేడ్స్‌లో అందించబడుతుంది

ముఖ్యాంశాలు
  • జూన్ 12 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి OnePlus 13s, ప్రారంభ‌మైన ప్రీ బుకిం
  • ఈ హ్యాండ్‌సెట్‌కు 2.5D క‌ర్వ్‌డ్ గ్లాస్‌ను రెండు వైపులా అందించారు
  • దుమ్ము, నీటి నియంత్ర‌ణ‌కు IP65 రేటింగ్‌ను క‌లిగి ఉంది
ప్రకటన

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ OnePlus త‌మ స‌రికొత్త ఫ్లాగ్ షిప్ హ్యాండ్‌సెట్ OnePlus 13s ను మ‌న దేశంలో లాంఛ్ చేసింది. ఈ మొబైల్ 6.32 అంగుళాల 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో రూపొందించ‌బ‌డింది. ఇది 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంది. ఇందులో స్పెష‌ల్ క్ర‌యో వెలాసిటీ వేప‌ర్ ఛాంబ‌ర్‌ను అందించడంతో ఫోన్ వేడెక్క‌డం లాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇది 12GB వ‌ర‌కూ RAM, 512GB వ‌ర‌కూ స్టోరేజీ సామ‌ర్థ్యంతో ల‌భిస్తుంది. ఈ మోడ‌ల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,850mAh బ్యాట‌రీని క‌లిగి ఉంది.OnePlus 13s ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే,12GB RAM, 256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ. 54,999గా ఉంది. అలాగే, 12GB RAM, 512GB స్టోరేజీ సామ‌ర్థ్యం క‌లిగిన ఫోన్ ధ‌ర రూ. 59,999గా కంపెనీ నిర్ణ‌యించింది. OnePlus ఆన్‌లైన్ స్టోర్‌తోపాటుగా అమెజాన్‌, గుర్తింపు పొందిన‌ రిటెయిల్ స్టోర్‌ల‌లోనూ జూన్ 12 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప్రీ బుకింగ్స్ ప్రారంభ‌మైంది. లాంఛింగ్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 5 వేలు వ‌ర‌కూ త‌క్ష‌ణ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌గా మ‌రో రూ. 5 వేలు త‌గ్గింపు పొందొచ్చు.

స్పెష‌ల్‌గా Plus Key

ఈ హ్యాండ్‌సెట్‌కు 2.5D క‌ర్వ్‌డ్ గ్లాస్‌ను రెండు వైపులా అందించారు. దీంతో ఫోన్ అద్భుత‌మైన గ్రిప్‌ను క‌లిగి ఉంటుంది. ప్రీమియం లుక్ ఇచ్చేలా గ్రీన్ సిల్క్ వేరియంట్‌ను కంపెనీ ప‌రిచ‌యం చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌కు స్పెష‌ల్‌గా Plus Keyని అందించ‌డంతో వైబ్రేష‌న్‌, డునాట్ డిస్ట‌ర్బ్‌, సౌండ్‌తోపాటు ఏఐ టూల్స్ వంటి ఫీచ‌ర్స్‌ను ఆప‌రేట్ చేసే అవ‌కాశం ఉంటుంది. ముందుగా Key ఆప్ష‌న్‌ల‌ను సెట్ చేసుకోవ‌డం ద్వారా యాక్సెస్ చేసేందుకు అనుమ‌తిస్తుంది.

50- మెగాపిక్సెల్ ప్ర‌ధాన కెమెరా

OnePlus 13s వెనుక 50- మెగాపిక్సెల్ ప్ర‌ధాన కెమెరాతోపాటు 50- మెగాపిక్సెల్ 2X ఆఫ్టిక‌ల్ టెలిఫోటో లెన్స్‌ను అందించారు. ముందు భాగంలో 32- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దుమ్ము, నీటి నియంత్ర‌ణ‌కు IP65 రేటింగ్‌ను క‌లిగి ఉంది. అలాగే, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కార‌ణంగా చాలా వేగంగా ఫోన్ ఛార్జ్ అవుతుంది. 3 నెల‌ల వ్య‌వది ఉన్న Google AI Proను ఉచితంగా పొంద‌వ‌చ్చు.

ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ర‌న్ అవుతుంది. నాలుగు ఓఎస్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించ‌నున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేస్తుంది. డ్యూయల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఆప్టిక‌ల్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ వంటి స్పెసిఫికేష‌న్స్‌ను అందించారు. ఇది 5G, డ్యూయ‌ల్ 4G వివో ఎల్‌టీఈ, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్ సీ వంటి అద‌న‌పు ఫీచ‌ర్స్ ఇందులో ఉన్నాయి. 8.15 ఎంఎం ప‌రిమాణంతో 185 గ్రాముల బ‌రువును క‌లిగి ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »