OnePlus 16 : వన్ ప్లస్ లవర్స్‎కు పండగే.. OnePlus 16 లాంచ్ కన్‌ఫర్మ్, అదిరిపోయే ఫీచర్లతో టీజర్ రిలీజ్

OnePlus 16 స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటివరకు ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లోనూ చూడని వినూత్నమైన డిస్‌ప్లే టెక్నాలజీని అందించబోతున్నారు.

OnePlus 16 : వన్ ప్లస్ లవర్స్‎కు పండగే.. OnePlus 16 లాంచ్ కన్‌ఫర్మ్, అదిరిపోయే ఫీచర్లతో టీజర్ రిలీజ్

Photo Credit: X/@yabhishekhd

OnePlus 16

ముఖ్యాంశాలు
  • వన్ ప్లస్ ప్రేమికులకు పండగే.
  • 'OnePlus 16' లాంచ్ కన్‌ఫర్మ్, అదిరిపోయే ఫీచర్లతో టీజర్ రిలీజ్
  • 185Hz రిఫ్రెష్ రేట్, 9000mAh బ్యాటరీతో రాబోతున్న OnePlus 16
ప్రకటన

OnePlus 16 : గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ తమ మోస్ట్ అవెయిటెడ్ తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్  OnePlus 16 లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. చైనాలో జరిగిన  స్నాప్‌డ్రాగన్ గేమింగ్ టెక్నాలజీ అవార్డ్స్ ఈవెంట్ వేదికగా వన్ ప్లస్ చైనా జనరల్ మేనేజర్ లియు బావోయౌ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో వచ్చిన OnePlus 15 ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే, ఇప్పుడు దానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రాబోతున్న OnePlus 16 పై వినియోగదారులలో, టెక్ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మొదటగా చైనా మార్కెట్లో విడుదల కానుంది.

కొత్త డిజైన్.. ఆకట్టుకునే సర్క్యులర్ కెమెరా మోడ్యూల్ 
ఇటీవల చైనాలో జరిగిన చైనాజాయ్ ఎగ్జిబిషన్‌లో, చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వైబోలో లీకైన పోస్టర్ల ప్రకారం... OnePlus 16 డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. ముఖ్యంగా దీని వెనుక భాగంలో స్క్వేరిష్ డిజైన్‌కు స్వస్తి పలికి, సరికొత్త సర్క్యులర్ కెమెరా మోడ్యూల్‎ను అందించబోతున్నారు. ఈ రౌండ్ కెమెరా కటౌట్‌లో రెండు పెద్ద ప్రధాన కెమెరా సెన్సార్లు, ఒక మూడవ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండేలా రూపోందించారు. ముందు భాగంలో అత్యంత సన్నని బెజెల్స్‌తో కూడిన ప్రీమియం లుక్‌ను కంపెనీ తీసుకురానుంది.

గేమింగ్ ప్రపంచాన్ని షేక్ చేసే డిస్‌ప్లే 
OnePlus 16 స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటివరకు ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లోనూ చూడని వినూత్నమైన డిస్‌ప్లే టెక్నాలజీని అందించబోతున్నారు. ఇందులో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండనుండగా, ఇది ఏకంగా 185Hz వరకు అత్యధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇది అల్ట్రా-హై ఫ్రేమ్ రేట్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రాసెసింగ్ విషయానికి వస్తే, క్వాల్కమ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ 2nm టెక్నాలజీ ఆధారిత స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. దీనికి తోడు మెరుగైన గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఫెంగ్‌చి గేమింగ్ కోర్ టెక్నాలజీని కూడా జోడించారు.


Deepfake Alert : మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం.. మెటా ఇండియా హెడ్ పై పోలీస్ కేసు

9000mAh భారీ బ్యాటరీ.. నెటిజన్లలో విపరీతమైన క్రేజ్ 
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంటుందనే అపోహను చెరిపివేస్తూ, OnePlus 16 మోడల్‌లో ఏకంగా 9000mAh కెపాసిటీ కలిగిన భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది గేమర్లకు, హెవీ యూజర్లకు ఎలాంటి అంతరాయం లేని బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. అత్యంత పవర్ఫుల్ హార్డ్‌వేర్, ఆకట్టుకునే నెక్స్ట్-జెన్ ఫీచర్లతో రాబోతున్న ఈ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »