దేశంలో అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ సరికొత్త N సిరీస్‌ను భారత్‌లో పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది.
Photo Credit: OnePlus
इस स्मार्टफोन में फ्लैट फ्रेम और फ्लैट रियर पैनल होगा
OnePlus N6 : భారతీయ ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ వన్‌ప్లస్ ఇప్పుడు సామాన్యుడి బడ్జెట్ మార్కెట్ పై కన్నేసింది. దేశంలో అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ సరికొత్త N సిరీస్‌ను భారత్‌లో పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో భాగంగా రాబోతున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ N6 అని తెలుస్తోంది. అత్యంత ఆకర్షణీయమైన ఫ్లాట్ ప్యానెల్ డిజైన్‌తో రాబోతున్న ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో రూ.20,000 కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని సమాచారం.
అమెజాన్‌లో లీకైన వివరాలు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్ సిద్ధమైంది. అయితే ఈ పేజీలో మొబైల్ మోడల్ పేరును కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆ వెబ్‌పేజీ హెడ్డింగ్లో OnePlus N6 అనే పేరు స్పష్టంగా కనిపించడంతో ఈ ఫోన్ లాంచ్ తథ్యమని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సరికొత్త బడ్జెట్ మొబైల్‌ను అమెజాన్ ద్వారానే కస్టమర్లకు విక్రయించనున్నారు. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ మనకు ఆకర్షణీయమైన గ్రీన్, క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
వన్‌ప్లస్ N6 డిజైన్ ఎలా ఉందంటే?
డిజైన్ పరంగా వన్‌ప్లస్ N6 చాలా మోడ్రన్‌గా కనిపించబోతోంది. ఈ ఫోన్ చుట్టూ ఫ్లాట్ ఫ్రేమ్, వెనుక భాగంలో ఫ్లాట్ రియర్ ప్యానెల్‌ను అందించారు. బ్యాక్ ప్యానెల్ పైభాగంలో కెమెరా మాడ్యూల్ కాస్త పైకి లేచినట్లుగా సరికొత్త స్టైల్లో అమర్చారు. ఫోన్‌కు కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్ బటన్లు ఉన్నాయి. కంపెనీ ఇప్పటివరకు ఈ ఫోన్ లాంచ్ డేట్, కచ్చితమైన ధర, పూర్తి స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, వచ్చే నెలలోనే ఈ సరికొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Raakh OTT Release : ప్రైమ్ వీడియోలోకి వచ్చేసిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాఖ్'.. ఎలా ఉందంటే?
వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ ధర, ఫీచర్లు
మరోవైపు, గత నెలలోనే మార్కెట్లోకి విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ కూడా మార్కెట్లో బాగా దూసుకుపోతోంది. దీని 6GB+128GB వేరియంట్ ధర రూ.20,999 కాగా.. 8GB+128GB వేరియంట్ రూ.22,999, టాప్ వేరియంట్ 8GB+256GB ధర రూ.25,999 గా ఉంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచుల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది, ఇది 144Hz రీఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ గేమింగ్ కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ చిప్‌సెట్, ఏఆర్ఎమ్ మాలీ-జి615 గ్రాఫిక్స్ కార్డ్ అమర్చారు.
కెమెరా, సాఫ్ట్‌వేర్ విశేషాలు
నార్డ్ CE 6 లైట్ స్మార్ట్‌ఫోన్ మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా ఏకంగా 2 TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 పై రన్ అవుతుంది. ఇక కెమెరా విభాగంలో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ప్రైమరీ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను అందించారు. ఇప్పుడు రాబోతున్న కొత్త వన్‌ప్లస్ N6 మోడల్ ఈ నార్డ్ సిరీస్ కంటే తక్కువ ధరలోనే లభిస్తుండటంతో, వన్‌ప్లస్ బ్రాండ్ లవర్స్ ఈ బడ్జెట్ ఫోన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Y600i Spotted on China Telecom With 6.87-Inch Display and Snapdragon Chipset
Apple Could Host October Event After iPhone 18 Pro Launch, New Home Devices Tipped