OnePlus N6 : వన్ ప్లస్ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే మార్కెట్లోకి OnePlus N6

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇందులో చాలా స్లిమ్ బెజెల్స్ కలిగిన ఫ్లాట్ స్క్రీన్‌ను అందించారు.

OnePlus N6 : వన్ ప్లస్ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే మార్కెట్లోకి OnePlus N6

Photo Credit: Amazon/ OnePlus

OnePlus N6

ముఖ్యాంశాలు
  • వన్ ప్లస్ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్
  • వన్ ప్లస్ ఎన్6 కెమెరా, డిస్‌ప్లే ఫీచర్లు లీక్
  • అమెజాన్‌లో వన్ ప్లస్ కొత్త ఫోన్ సేల్స్
ప్రకటన

OnePlus N6 : వన్ ప్లస్ కంపెనీ భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త వన్ ప్లస్ ఎన్6 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్‌ను ప్రీమియం లుక్‌తో పాటు ఫ్లాట్ డిస్‌ప్లే డిజైన్‌తో రూపొందించారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ గ్రీన్ అనే రెండు క్రేజీ కలర్ ఆప్షన్లలో లభించనుంది. భారతదేశంలో జూన్ 30న లాంచ్ అయిన తర్వాత ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

అద్భుతమైన డిస్‌ప్లే, స్మూత్ రిఫ్రెష్ రేట్
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇందులో చాలా స్లిమ్ బెజెల్స్ కలిగిన ఫ్లాట్ స్క్రీన్‌ను అందించారు. ఇది సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. అలాగే సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ పైభాగంలో మధ్యలో పంచ్-హోల్ కటౌట్ డిజైన్‌ను ఉపయోగించారు. మూవీస్ చూడటానికి, గేమింగ్ ఆడటానికి ఈ డిస్‌ప్లే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

హీటింగ్ సమస్యలకు చెక్ పెట్టే కూలింగ్ సిస్టమ్
సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఎక్కువ సమయం వాడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కుతుందనే ఫిర్యాదు ఉంటుంది. కానీ వన్ ప్లస్ ఈ ఫోన్‌లో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం అధునాతన  వేపర్ ఛాంబర్ కూలింగ్  సొల్యూషన్‌ను అందించింది. ఇది ఏకంగా 5,300 చదరపు మిల్లీమీటర్ల హీట్ డిస్సిపేషన్ ఏరియాను కలిగి ఉంటుంది. దీనివల్ల ఫోన్ ఎంత హెవీగా వాడినా కూడా చాలా కూల్‌గా రన్ అవుతుంది.

కెమెరా సెటప్, వీడియో రికార్డింగ్ ఫీచర్లు
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, వన్ ప్లస్ ఎన్6 వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను పెట్టింది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సామర్థ్యంతో వస్తుంది. దీనితో పాటు మరొక సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌తో గరిష్టంగా 60 fps స్పీడ్‌తో హైక్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అలాగే ఒకే సమయంలో రెండు వైపులా రికార్డ్ చేసుకునే డ్యూయల్-వ్యూ వీడియో మోడ్ కూడా ఇందులో ఉంది.

Vivo Y6a : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. 7200mAh భారీ బ్యాటరీతో వివో Y6a లాంచ్

పవర్‌ఫుల్ ప్రాసెసర్, గీక్‌బెంచ్ స్కోర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6835 చిప్‌సెట్‌తో దర్శనమిచ్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు 6GB ర్యామ్, ARM మాలి-G57 MC2 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్టులో 788 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 1,993 పాయింట్లు సాధించింది. అలాగే గీక్‌బెంచ్ ఏఐలోనూ క్వాంటైజ్డ్ స్కోర్ 1,072 సాధించి పర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టింది.

భారీ బ్యాటరీ, ధరల వివరాలు
సాధారణంగా ఫోన్లలో 5000mAh బ్యాటరీ చూస్తుంటాం, కానీ వన్ ప్లస్ ఇందులో ఏకంగా 8,000mAh మెగా బ్యాటరీని ప్యాక్ చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 3 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీనితో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 7 ఏళ్ల బ్యాటరీ హెల్త్ వారంటీని ఇస్తున్నారు. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 పై రన్ అవుతుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 18,000 నుంచి రూ. 25,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Note 17 Pro : పవర్‌ఫుల్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా.. మార్కెట్లోకి షావోమి కొత్త ఫోన్
  2. Apple : టెక్ ప్రపంచంలో ఆపిల్ సరికొత్త సంచలనం.. ఐప్యాడ్ మినీ డిస్‌ప్లే చూస్తే కళ్లు చెదరాల్సిందే
  3. OnePlus N6 : వన్ ప్లస్ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే మార్కెట్లోకి OnePlus N6
  4. Vivo X Fold 6 : వివో నుంచి నెక్స్ట్ లెవెల్ ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లోకి వచ్చేసిన Vivo X Fold 6
  5. Windows 10 : విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ బంపర్ గిఫ్ట్.. మరో ఏడాది పాటు పొడిగించిన సపోర్ట్
  6. Smartphone : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఒక్క నెలలోనే మార్కెట్లోకి వచ్చిన టాప్ మొబైల్స్ ఇవే
  7. Vivo Y6a : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. 7200mAh భారీ బ్యాటరీతో వివో Y6a లాంచ్
  8. OnePlus Nord Buds : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. తక్కువ ధరలో ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్
  9. Vi-Spotify Deal : వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్.. పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 3 నెలలు స్పాటిఫై ప్రీమియం ఫ్రీ
  10. Android 17 : ఆండ్రాయిడ్ 17 వచ్చేసింది.. సరికొత్త బబుల్స్ ఫీచర్‌తో కంప్యూటర్‌లా మారిపోనున్న మీ మొబైల్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »