Vivo X Fold 6 : వివో నుంచి నెక్స్ట్ లెవెల్ ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లోకి వచ్చేసిన Vivo X Fold 6

ఈ ఫోల్డబుల్ ఫోన్ లోపలి వైపు ఏకంగా 8.02 ఇంచుల భారీ శామ్‌సంగ్ M14 అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు.

Vivo X Fold 6 : వివో నుంచి నెక్స్ట్ లెవెల్ ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లోకి వచ్చేసిన Vivo X Fold 6

Photo Credit: Vivo X Fold 6

Vivo X Fold 6

ముఖ్యాంశాలు
  • వివో నుంచి నెక్స్ట్ లెవెల్ ఫోల్డబుల్ ఫోన్
  • అదిరిపోయే డిస్‌ప్లే, భారీ బ్యాటరీ
  • 200 ఎంపీ జీస్ కెమెరాతో వివో కొత్త సంచలనం!
ప్రకటన

Vivo X Fold 6 : వివో కంపెనీ తన ఎక్స్ సిరీస్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వివో ఎక్స్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. వెనుక భాగంలో గుండ్రటి  కెమెరా మాడ్యూల్‌తో ఈ ఫోన్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఇన్ సైడ్, అవుట్ సైడ్ రెండు వైపులా అద్భుతమైన డిస్‌ప్లేలను అందించారు. ఈ ఫోన్ బ్లూ హోల్, పోలార్ నైట్, సాల్ట్ లేక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. చైనాలో జూలై 1 నుంచి వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఫోల్డబుల్ ఫోన్ లోపలి వైపు ఏకంగా 8.02 ఇంచుల భారీ శామ్‌సంగ్ M14 అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. అలాగే ఫోన్‌ను మడతబెట్టినప్పుడు వాడుకోవడానికి బయట వైపు 6.51 ఇంచుల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ రెండు స్క్రీన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, వంద శాతం DCI-P3 కలర్ గామట్‌తో వస్తాయి. అంటే ఇందులో మూవీస్ చూడటం లేదా గేమ్స్ ఆడటం నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్‌కు దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP58, IP59 రేటింగ్స్ కూడా ఇచ్చారు.

వివో ఎక్స్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత  OriginOS 6 Fold సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో అత్యంత వేగవంతమైన 3 నానోమీటర్ (3nm) ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4.21GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. హెవీ గ్రాఫిక్స్ కోసం మాలి జి1-ఆల్ట్రా జీపీయూ ఉంది. ఇందులో గరిష్టంగా 16GB వరకు ర్యామ్,  1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, వివో ఇందులో ప్రఖ్యాత జీస్ ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పెట్టింది. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ (f/1.68) సామర్థ్యంతో వస్తుంది, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. దీనితో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం లోపలి స్క్రీన్‌పై ఒకటి, బయటి స్క్రీన్‌పై ఒకటి చొప్పున రెండు 20 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు. ఈ ఫోన్‌తో ఏకంగా 8K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

Vivo Y6a : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. 7200mAh భారీ బ్యాటరీతో వివో Y6a లాంచ్

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సైజ్ తక్కువగా ఉంటుందనే ఫిర్యాదు ఉంటుంది. కానీ వివో ఈ ఫోన్ లో ఏకంగా 7,000mAh మెగా బ్యాటరీని ప్యాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. కనెక్టివిటీ పరంగా ఇది 5G, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఇండియన్ జీపీఎస్ వ్యవస్థ అయిన NavICకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ విప్పినప్పుడు కేవలం 4.40mm మందం, మడతబెట్టినప్పుడు 9.40mm మందంతో ఉంటూ, 228 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధరలు విభిన్న వేరియంట్లను బట్టి ఉన్నాయి. బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర CNY 7,999 (మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1,11,000) గా ఉంది. అలాగే 12GB + 512GB మోడల్ ధర రూ. 1,25,000, 16GB + 512GB మోడల్ ధర రూ. 1,39,000 గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 1,53,000 గా ఉంది. వీటితో పాటు స్పెషల్ గా డిజైన్ చేసిన 'బ్లాక్ గోల్డ్ ఎడిషన్' ధర సుమారు రూ. 1,57,000 గా కంపెనీ అనౌన్స్ చేసింది. భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. OnePlus N6 : వన్ ప్లస్ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే మార్కెట్లోకి OnePlus N6
  2. Vivo X Fold 6 : వివో నుంచి నెక్స్ట్ లెవెల్ ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లోకి వచ్చేసిన Vivo X Fold 6
  3. Windows 10 : విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ బంపర్ గిఫ్ట్.. మరో ఏడాది పాటు పొడిగించిన సపోర్ట్
  4. Smartphone : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఒక్క నెలలోనే మార్కెట్లోకి వచ్చిన టాప్ మొబైల్స్ ఇవే
  5. Vivo Y6a : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. 7200mAh భారీ బ్యాటరీతో వివో Y6a లాంచ్
  6. OnePlus Nord Buds : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. తక్కువ ధరలో ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్
  7. Vi-Spotify Deal : వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్.. పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 3 నెలలు స్పాటిఫై ప్రీమియం ఫ్రీ
  8. Android 17 : ఆండ్రాయిడ్ 17 వచ్చేసింది.. సరికొత్త బబుల్స్ ఫీచర్‌తో కంప్యూటర్‌లా మారిపోనున్న మీ మొబైల్
  9. Smartphones : ఆఫర్లు లేవు.. అన్నీ రేట్లు పెరిగాయి.. రూ.25 వేల బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలో అర్థం కావట్లేదా?
  10. Red Magic Tablet 5Pro : గేమర్స్‌కు పూనకాలే.. మార్కెట్లోకి వస్తున్న సరికొత్త రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »