Windows 10 : విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ బంపర్ గిఫ్ట్.. మరో ఏడాది పాటు పొడిగించిన సపోర్ట్

మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల పాత ఓటింగ్ సిస్టమ్‌తోనే బండి లాగిస్తున్న కోట్ల మంది యూజర్లకు భారీ ఊరట లభించనుంది.

Windows 10 : విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ బంపర్ గిఫ్ట్.. మరో ఏడాది పాటు పొడిగించిన సపోర్ట్

Photo Credit: Microsoft

Microsoft

ముఖ్యాంశాలు
  • విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ బంపర్ గిఫ్ట్
  • అప్పుడే విండోస్ 11 కి మారాల్సిన పనిలేదు
  • విండోస్ 10 ‘ఈఎస్‌యూ’ ప్రోగ్రామ్ పొడిగింపు
ప్రకటన

Windows 10 : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ (OS) యూజర్లకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక లక్కీ ఛాన్స్ ఇచ్చింది. నిజానికి మైక్రోసాఫ్ట్ గత ఏడాదిలోనే విండోస్ 10కి అధికారిక సపోర్ట్‌ను ముగించేసింది. కొత్తగా వచ్చిన విండోస్ 11 హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వని పాత పీసీల కోసం  కన్స్యూమర్ ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ (ESU) ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ ఈఎస్‌యూ ప్రోగ్రామ్ కూడా ఈ ఏడాది అక్టోబర్‌తో శాశ్వతంగా ముగిసిపోవాల్సి ఉంది. కానీ, యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ తాజాగా ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఈ ప్రోగ్రామ్‌ను మరో ఏడాది పాటు పొడిగించింది. దీనివల్ల పాత కంప్యూటర్లు వాడుతున్న వారికి ఎలాంటి లాభం జరుగుతుంది, దీనికి ఎలా సైన్ ఇన్ అవ్వాలో తెలుసుకుందాం.

మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల పాత ఓటింగ్ సిస్టమ్‌తోనే బండి లాగిస్తున్న కోట్ల మంది యూజర్లకు భారీ ఊరట లభించనుంది. విండోస్ 11 సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేయని పాత పీసీలు లేదా ల్యాప్‌టాప్‌లు ఉన్నవారు, వెంటనే కొత్త డివైజ్ కొనాల్సిన అవసరం లేకుండా తమ పాత కంప్యూటర్‌ను భద్రంగా వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఈ ఈఎస్‌యూ (ESU) ప్రోగ్రామ్‌ను పొడిగించడం వల్ల యూజర్లకు తమ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మరింత సమయం దొరికినట్లయింది.

మైక్రోసాఫ్ట్ తన అఫీషియల్ సపోర్ట్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, విండోస్ 10 వినియోగదారులు అక్టోబర్ 12, 2027 వరకు ఈ ఈఎస్‌యూ ప్రోగ్రామ్‌లో ఎప్పుడైనా చేరవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ అయి ఉంటే, మీరు మళ్లీ ఏమీ చేయనవసరం లేదు. మీ అకౌంట్ ఆటోమేటిక్‌గా అక్టోబర్ 2027 వరకు పొడిగించబడుతుంది. ఒకే ఒక ఈఎస్‌యూ లైసెన్స్ ఉపయోగించి గరిష్టంగా 10 కంప్యూటర్ల వరకు సెక్యూరిటీ కవరేజ్‌ను పొందవచ్చని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

ఈ ప్రోగ్రామ్‌లో ఎప్పుడైనా చేరే అవకాశం ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ కస్టమర్లను ఒక విషయంలో గట్టిగా హెచ్చరిస్తోంది. ఈఎస్‌యూ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకోకముందు మీ కంప్యూటర్‌లోకి వైరస్‌లు, హ్యాకర్లు, ప్రమాదకరమైన మాల్‌వేర్‌లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భద్రతా అప్‌డేట్స్ లేకపోవడం వల్ల మీ పర్సనల్ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎంత త్వరగా ఈ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అయితే అంత మంచిదని కంపెనీ చెబుతోంది.

Smartphone : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఒక్క నెలలోనే మార్కెట్లోకి వచ్చిన టాప్ మొబైల్స్ ఇవే

ఈ ఆఫర్ ఏయే వెర్షన్లకు వర్తిస్తుంది?
ఈ కన్స్యూమర్ విండోస్ 10 ఈఎస్‌యూ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలంటే మీ కంప్యూటర్ తప్పనిసరిగా విండోస్ 10 వెర్షన్ 22H2 కి అప్‌డేట్ అయి ఉండాలి. ఇందులో విండోస్ 10 హోమ్, ప్రొఫెషనల్, ప్రో ఎడ్యుకేషన్ లేదా వర్క్‌స్టేషన్స్ ఎడిషన్లు వాడుతున్న వారు మాత్రమే జాయిన్ అవ్వడానికి అర్హులు. అలాగే మీ పీసీలో లేటెస్ట్ విండోస్ అప్‌డేట్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయి ఉండాలి.

జాయిన్ అవ్వడం ఎలా?
మీ పాత కంప్యూటర్‌ను ఈ ప్రోగ్రామ్‌లో చేర్చడం చాలా సులభం. ఇందుకోసం మీరు మీ సిస్టమ్‌లో మీ పర్సనల్  మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ కనిపించే ఈఎస్‌యూ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని ఎన్‌రోల్ అవ్వవచ్చు. దీనివల్ల రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసే అన్ని అఫీషియల్ సెక్యూరిటీ ప్యాచెస్, బగ్ ఫిక్సెస్ మీ విండోస్ 10 కంప్యూటర్‌కు కూడా రెగ్యులర్‌గా అందుతాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Vivo X Fold 6 : వివో నుంచి నెక్స్ట్ లెవెల్ ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లోకి వచ్చేసిన Vivo X Fold 6
  2. Windows 10 : విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ బంపర్ గిఫ్ట్.. మరో ఏడాది పాటు పొడిగించిన సపోర్ట్
  3. Smartphone : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఒక్క నెలలోనే మార్కెట్లోకి వచ్చిన టాప్ మొబైల్స్ ఇవే
  4. Vivo Y6a : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. 7200mAh భారీ బ్యాటరీతో వివో Y6a లాంచ్
  5. OnePlus Nord Buds : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. తక్కువ ధరలో ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్
  6. Vi-Spotify Deal : వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్.. పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 3 నెలలు స్పాటిఫై ప్రీమియం ఫ్రీ
  7. Android 17 : ఆండ్రాయిడ్ 17 వచ్చేసింది.. సరికొత్త బబుల్స్ ఫీచర్‌తో కంప్యూటర్‌లా మారిపోనున్న మీ మొబైల్
  8. Smartphones : ఆఫర్లు లేవు.. అన్నీ రేట్లు పెరిగాయి.. రూ.25 వేల బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలో అర్థం కావట్లేదా?
  9. Red Magic Tablet 5Pro : గేమర్స్‌కు పూనకాలే.. మార్కెట్లోకి వస్తున్న సరికొత్త రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో
  10. Realme P4 Series : రియల్‌మీ కస్టమర్లకు భారీ షాక్.. పీ4 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచేసిన కంపెనీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »