ఇందులో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 8,000 ఎంఏహెచ్ మెగా బ్యాటరీని అమర్చారు.
Photo Credit: OnePlus
OnePlus N6
OnePlus : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు బ్రాండ్ వాల్యూతో పాటు బడ్జెట్‌ను చూసుకునే మధ్యతరగతి కస్టమర్ల కోసం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ అదిరిపోయే ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సాధారణంగా వన్‌ప్లస్ ఫోన్లు అంటే కాస్త ప్రీమియం ధరల్లో ఉంటాయనే అభిప్రాయం ఉంది. కానీ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా కంపెనీ సరికొత్తగా ఎన్ సిరీస్‌ను భారత్‌లో ప్రారంభించింది. అందులో భాగంగా గత నెలలో విడుదల చేసిన వన్‌ప్లస్ ఎన్6 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. తక్కువ ధరలోనే నెక్స్ట్ లెవెల్ ఫీచర్లను అందించడంతో మిడిల్ క్లాస్ యూజర్లు ఈ ఫోన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఈ వన్‌ప్లస్ ఎన్6 స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ సామర్థ్యం. ఇందులో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 8,000 ఎంఏహెచ్ మెగా బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ యూజర్లు సులభంగా మూడు రోజుల పాటు వాడుకోవచ్చని కంపెనీ గట్టిగా చెప్తోంది. దీనికి తోడు 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అవసరమైనప్పుడు వేరే డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు 5 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. నిరంతరం ఫోన్ వాడే మధ్యతరగతి ఉద్యోగులకు, ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి పదే పదే ఛార్జింగ్ పెట్టే తలనొప్పిని ఈ ఫోన్ దూరం చేస్తుంది.
వన్‌ప్లస్ ఎన్6 క్రియేట్ చేసిన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తూ కంపెనీ ఈ సిరీస్ లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్లో ఈ సరికొత్త ఫోన్ కోసం ఒక ప్రత్యేక మైక్రోసైట్ లైవ్ అయ్యింది. దీని ద్వారా వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ అనే మోడల్ భారత్‌లో త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు అధికారికంగా ఖరారైంది. అయితే ఈ కొత్త ఫోన్ లాంచ్ డేట్ కానీ, దాని ధర మరియు డిజైన్ వివరాలను కానీ కంపెనీ ఇంకా రహస్యంగానే ఉంచింది. ఈ అప్‌కమింగ్ ఫోన్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే భారీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ ఎన్6 ధరల వివరాలు పరిశీలిస్తే, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.24,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను కస్టమర్ల కోసం ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు క్లాసీ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు. వన్‌ప్లస్ సంస్థ తన పాపులర్ నోర్డ్ సిరీస్ కంటే తక్కువ ప్రైస్ రేంజ్‌లో ఈ సరికొత్త ఎన్-సిరీస్ ఫోన్లను పొజిషన్ చేయడం గమనార్హం. తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ బ్రాండ్ ఫోన్ వాడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Budget 5G Smartphones : రూ.30 వేల బడ్జెట్లో బెస్ట్ ఫోన్ ఏది? నథింగ్, టెక్నో, రియల్‌మి మొబైల్స్ మధ్య బిగ్ ఫైట్
ఈ ఫోన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇందులో 6.75-ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, ఎండలో సైతం స్పష్టత కోసం 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 పై రన్ అవుతుంది. ఫోన్ ఎక్కువ సేపు వాడినా లేదా గేమ్స్ ఆడినా వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 5,300mm² సైజ్ గల వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.
కెమెరా విభాగం విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ వెనుక భాగంలో 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ సింగిల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. దీనితో స్పష్టమైన ఫోటోలను క్లిక్ చేయవచ్చు. అలాగే ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వీటితో పాటు యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ బడ్జెట్ ఫోన్ లో కొన్ని అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా చేర్చడం విశేషం.
ప్రకటన
ప్రకటన
Samsung Music Studio 5, Music Studio 7 Wi-Fi Speakers Launched in India