Huawei FreeClip 2 S Earbuds Launched: డిజైన్ పరంగా ఈ ఇయర్ బడ్స్ మార్కెట్లోని సాధారణ బడ్స్ కంటే చాలా భిన్నంగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.
Photo Credit: Huawei
Huawei FreeClip 2 S
Huawei FreeClip 2 S Earbuds Launched: ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం హువాయ్ గ్లోబల్ మార్కెట్లోకి తన సరికొత్త ప్రీమియం ఇయర్ బడ్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన హువాయ్ పురా 90ఎస్తో పాటు ఈ లేటెస్ట్ హువాయ్ ఫ్రీక్లిప్ 2 ఎస్ ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మ్యూజిక్ వినడానికి ఎక్కువ ఇష్టపడే మధ్యతరగతి, యువతను ఆకట్టుకునేలా ఇందులో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆడియో ఫీచర్లను, పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌ను అందించింది. మ్యూజిక్ లవర్స్ మెచ్చేలా క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీతో ఈ బడ్స్ డిజైన్ చేయబడ్డాయి.
డిజైన్ పరంగా ఈ ఇయర్ బడ్స్ మార్కెట్లోని సాధారణ బడ్స్ కంటే చాలా భిన్నంగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇందులో హువాయ్ ప్రత్యేకంగా ఓపెన్-ఈర్ సి-బ్రిడ్జ్ డిజైన్‌ను ఉపయోగించింది. ఇది చెవులకు చాలా కంఫర్టబుల్‌గా ఫిట్ అవ్వడమే కాకుండా, ఎక్కువ సమయం పెట్టుకున్నా ఎలాంటి నొప్పి లేకుండా హాయిగా ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ ధరల విషయానికి వస్తే, మలేషియా మార్కెట్లో MYR 899 (మన కరెన్సీలో సుమారు రూ.21,200), యూరప్‌లో EUR 229 (సుమారు రూ.25,200), యూకేలో GBP 199 (సుమారు రూ.25,600) గా కంపెనీ నిర్ణయించింది. ఈ బడ్స్ డీప్-సీ బ్లూ మరియు స్పేస్ సిల్వర్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
సాంకేతిక వివరాలు పరిశీలిస్తే.. హువాయ్ ఫ్రీక్లిప్ 2 ఎస్ లో 10.8mm సైజ్ గల పవర్‌ఫుల్ డుయల్ డ్రైవర్లను అమర్చారు. ఇవి బేస్ పర్ఫార్మెన్స్‌ను, ఓవరాల్ సౌండ్ బ్యాలెన్స్‌ను అద్భుతంగా మెయింటైన్ చేస్తాయి. ఈ ఇయర్ బడ్స్ 20Hz నుంచి 20kHz వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఆడియో, వాయిస్ ప్రాసెసింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడం కోసం ఇందులో ఏఐ సపోర్ట్ ఉన్న న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను వాడారు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి వాల్యూమ్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఇందులో డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో కూడిన స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది.
Crypto Currency : క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్.. భారత్‌లో క్రిప్టోకు అసెట్ హోదా లేదని తేల్చేసిన కేంద్రం
చాలామంది ఓపెన్-ఈర్ బడ్స్ వాడేటప్పుడు పక్కన ఉన్నవారికి సౌండ్ వినబడుతుందేమో అని భయపడుతుంటారు. దీనిని అరికట్టడానికి హువాయ్ ఇందులో రివర్స్ సౌండ్ వేవ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది సౌండ్ బయటకు లీక్ కాకుండా నియంత్రిస్తుంది. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మన వాయిస్ స్పష్టంగా వినిపించేందుకు ఇందులో మూడు మైక్రోఫోన్లు, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్‌ను ఇచ్చారు. కస్టమర్లు తమకు నచ్చినట్లు సౌండ్ సెట్టింగ్స్ మార్చుకోవడానికి 10-బ్యాండ్ ఈక్వలైజర్, మల్టిపుల్ ఈక్యూ ప్రిసెట్స్ అందించారు. దీనికోసం Huawei Audio Connect యాప్‌ను ఉపయోగించవచ్చు.
కనెక్టివిటీ కోసం ఇందులో సరికొత్త బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉంది. దీని సహాయంతో ఒకేసారి రెండు వేర్వేరు డివైజ్ లతో (ఫోన్, లాప్‌టాప్) కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఒక్కో ఇయర్ బడ్‌లో 60mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 537mAh భారీ బ్యాటరీ ఉంది. బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ ఇస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలుపుకుంటే ఏకంగా 38 గంటల పాటు వాడుకోవచ్చు. ఇందులో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో పాటు 3W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇయర్ బడ్స్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 40 నిమిషాలు, కేస్ ఛార్జ్ అవ్వడానికి 50 నిమిషాల సమయం పడుతుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains