Nothing Phone 4b Vs Tecno Pova 8 Vs Realme 16T 5G: నథింగ్ ఫోన్ (4b) ప్రీమియం విభాగంలో లభిస్తోంది. దీని 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా, 8 GB + 256 GB మోడల్ ధర రూ. 38,999 గా ఉంది.
Photo Credit: Nothing/Tecno/Realme
Nothing Phone 4b vs Tecno Pova 8 vs Realme 16T 5G
Nothing Phone 4b Vs Tecno Pova 8 Vs Realme 16T 5G: భారతీయ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ మరింత హీటెక్కుతోంది. ఇటీవల నథింగ్ సంస్థ లాంచ్ చేసిన సరికొత్త మొబైల్ Nothing Phone (4b) మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. అయితే, ఈ ఫోన్‌కు పోటీగా టెక్నో నుంచి వచ్చిన టెక్నో పోవా 8, రియల్‌మి లేటెస్ట్ మోడల్ రియల్‌మి 16T 5Gలు గట్టి సవాల్ విసురుతున్నాయి. ఈ మూడు ఫోన్లు దాదాపు ఒకే తరహా బడ్జెట్ విభాగంలో ఉన్నప్పటికీ, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పరంగా వేటికవే ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. కొత్తగా మొబైల్ కొనాలనుకునే కస్టమర్ల కోసం ఈ మూడు పాపులర్ ఫోన్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలు, పోలికలను క్షుణ్ణంగా విశ్లేషించాం.
మొదటగా ఈ ఫోన్ల ధరలను పరిశీలిస్తే.. నథింగ్ ఫోన్ (4b) ప్రీమియం విభాగంలో లభిస్తోంది. దీని 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా, 8 GB + 256 GB మోడల్ ధర రూ. 38,999 గా ఉంది. వీటికి భిన్నంగా టెక్నో పోవా 8, రియల్‌మి 16T 5G రెండు ఫోన్లు కూడా బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. టెక్నో పోవా 8 మోడల్ 6 GB + 128 GB వేరియంట్ రూ. 29,999 కు, 8 GB + 128 GB వేరియంట్ రూ. 31,999 కు లభిస్తోంది. సరిగ్గా ఇదే ధరలతో రియల్‌మి 16T 5G కూడా 6 GB + 128 GB వేరియంట్ రూ. 29,999, 8 GB + 128 GB మోడల్ రూ. 31,999 లకే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
డిస్‌ప్లే విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ (4b)లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన కలర్స్ ఇస్తుంది. మరోవైపు టెక్నో పోవా 8 లో 6.76 ఇంచుల ఐపీఎస్ స్క్రీన్‌ను ఇచ్చారు, ఇది 144 Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇక రియల్‌మి 16T ఫోన్ లో 6.8 ఇంచుల పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌ను చేర్చారు. ఇది 1570x720 పిక్సెల్స్ రెజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. అమోలెడ్ స్క్రీన్ ప్రియులకు నథింగ్ బెస్ట్ కాగా, స్మూత్ రిఫ్రెష్ రేట్ కావాలనుకునే వారికి టెక్నో, రియల్‌మి అద్భుతమైన ఎంపికగా నిలుస్తాయి.
స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది ప్రధానంగా ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటుంది. నథింగ్ ఫోన్ (4b)లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గేమింగ్, రోజువారీ మల్టీటాస్కింగ్ పనులను చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అదే సమయంలో టెక్నో పోవా 8 లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను వాడారు. ఇక రియల్‌మి 16T 5G మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అందించారు. ఈ మూడింటిలోనూ నథింగ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ పరంగా అత్యుత్తమ స్కోర్‌లను నమోదు చేస్తోంది.
సాఫ్ట్‌వేర్, యూజర్ ఇంటర్‌ఫేస్ విషయానికి వస్తే, ఈ మూడు బ్రాండ్లు కూడా కస్టమర్ల కోసం సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లను అందించాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్ ఆధారంగానే పనిచేస్తాయి. కాకపోతే వాటి ఓన్ కస్టమ్ స్కిన్స్ విభిన్నంగా ఉంటాయి. నథింగ్ ఫోన్ (4b) క్లీన్, బ్లోట్‌వేర్ రహిత Nothing OS 4.1తో రన్ అవుతుంది. కాగా, టెక్నో పోవా 8 మొబైల్ HiOS 16తో వినియోగదారుల ముందుకు రాగా.. రియల్‌మి 16T 5G ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లు గల Realme UI 7 సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో వస్తుంది.
Nothing Phone (4b) : భారత్‌లో నథింగ్ ఫోన్ (4b) సేల్స్ షురూ.. మార్కెట్లోకి సరికొత్త గ్లిఫ్ లైటింగ్ స్మార్ట్‌ఫోన్
కెమెరా విభాగం చూస్తే.. నథింగ్ ఫోన్ (4b) వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక టెక్నో పోవా 8 వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉండగా, ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అదేవిధంగా రియల్‌మి 16T 5G వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను జత చేశారు. సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. కదిలేటప్పుడు కూడా ఫోటోలు బ్లర్ కాకుండా స్పష్టంగా రావడానికి నథింగ్ లోని OIS ఫీచర్ బాగా సహాయపడుతుంది.
బ్యాటరీ సామర్థ్యం పరంగా టెక్నో, రియల్‌మి కంపెనీలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ రెండు ఫోన్లలోనూ ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీలను అందించారు. ఇవి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. రియల్‌మి లో ఉన్న SuperVOOC టెక్నాలజీ వల్ల బ్యాటరీ మరింత సురక్షితంగా ఛార్జ్ అవుతుంది. వీటికి భిన్నంగా నథింగ్ ఫోన్ (4b)లో 6,000 mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఒకవేళ మీకు బ్యాటరీ లైఫ్, తక్కువ బడ్జెట్ ప్రాధాన్యత అయితే రియల్‌మి లేదా టెక్నో వైపు వెళ్లవచ్చు. ఒకవేళ ప్రీమియం డిజైన్, అమోలెడ్ డిస్‌ప్లే, బెస్ట్ OIS కెమెరా కావాలనుకుంటే నథింగ్ ఫోన్ (4b) బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹1,999
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
JBL Tune 780NC Wireless Headphones
Starts from ₹7,999
Philips 5G Smartphone India Launch Date Confirmed: Here’s What We Know
Boltt Reveals Software Update Policy for Ace 5G and Evo Ahead of September 1 Sale
Samsung Galaxy Tab S12 Ultra Allegedly Listed on Geekbench With MediaTek Dimensity 9500 Chipset